Sunday 22 June 2014

వీడేరా..న్యూయార్క్ పోలీస్!

వీడేరా..న్యూయార్క్ పోలీస్!

Published at: 23-06-2014 04:36 AM
రాష్ట్ర రాజధానిలో పోలీస్ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో ఆధునికీకరిస్తామని.. లండన్, న్యూయార్క్ తరహా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. తెలంగాణ హోం మంత్రి నాయిని పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి.. న్యూయార్క్ తరహా పోలీసింగ్ అంటే? వారి వనరులు, జీతభత్యాలు.. ఎలా ఉంటాయో చూద్దాం..
సమర్థ పోలీసింగ్‌కు పెట్టింది పేరు.. న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్! దీన్ని అధికారికంగా 'సిటీ ఆఫ్ న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్'గా.. షార్ట్‌కట్‌లో 'ఎన్‌వైపీడీ'గా వ్యవహరిస్తారు. హాలీవుడ్ సినిమా ప్రియులకు ఈ 'ఎన్‌వైపీడీ' అనే పేరు చిరపరిచితం అంటే అతిశయోక్తి కాదు.
-1845లో ఏర్పాటైన పోలీసు వ్యవస్థ ఇది. అమెరికాలోనే అతిపెద్ద పోలీసు దళం ఎన్‌వైపీడీకి ఉంది.
-ఇందులో చాలా స్పెషలైజ్‌డ్ విభాగాలుంటాయి. అవి.. ఎమర్జెన్సీ సర్వీస్ యూనిట్, కే-9 (డాగ్ స్క్వాడ్), హార్బర్ పెట్రోల్, ఎయిర్ సపోర్ట్, బాంబ్ డిస్పోజల్, కౌంటర్ టెర్రరిజం, క్రిమిల్ ఇంటిలిజెన్స్, యాంటీ గ్యాంగ్, యాంటీ ఆర్గనైజ్‌డ్ క్రైమ్, నార్కోటిక్స్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ పబ్లిక్ హౌసింగ్.
-'చట్టాలు అమలయ్యేలా చూడటం, శాంతిని పరిరక్షించడం, (ప్రజల్లో) భయాన్ని తొలగించడం, సురక్షిత వాతావరణాన్ని కల్పించడం' ..ఇవే తమ లక్ష్యాలని ఎన్‌వైపీడీ పేర్కొంటుంది.
-ఎన్‌వైపీడీలో ప్రస్తుతం యూనిఫాం ధరించే పోలీసుల సంఖ్య 34,450. వీరు కాక.. 4500 మంది ఆక్సిలరీ పోలీస్ ఆఫీసర్లు, 5000 మంది స్కూల్ సేఫ్టీ ఏజెంట్లు, 2300 మంది ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్లు, 370 మంది ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపర్‌వైజర్లు ఉన్నారు.
-ఎన్‌వైపీడీ అంటే.. న్యూయార్క్‌కు మాత్రమే పరిమితం కాదు. దాని ఇంటిలిజెన్స్-ఉగ్రవాద వ్యతిరేక బ్యూరోకు చెందిన అధికారులు లండన్, పారిస్, మాడ్రిడ్, టెల్ అవీవ్, హాంబర్గ్, టొరంటో తదితర 11 విదేశీ నగరాల్లో పనిచేస్తారు.
-అత్యంత సమర్థులైన పోలీసు అధికారులు.. అధునాతన నిఘా, భద్రత వ్యవస్థలతో ఎన్‌వైపీడీ అలరారుతుంటుంది.
-ఎన్‌వైపీడీకి చెందిన యాక్షన్ డెస్క్ సెంటర్ రోజులో 24 గంటలూ.. వారంలో ఏడు రోజులూ తెరిచే ఉంటుంది. సమస్య ఉన్నవారు ఏక్షణంలోనైనా ఫిర్యాదు చేయవచ్చు. ఫోన్ ద్వారాగానీ, నేరుగా గానీ, ఈమెయిల్, పోస్ట్ ద్వారాగానీ కంప్లయింట్ చేయవచ్చు.
-విధుల్లో ఉన్న న్యూయార్క్ పోలీసు వద్ద 9ఎంఎం సెమీ ఆటోమేటిక్ సర్వీస్ పిస్టల్ ఉంటుంది. విధుల్లో లేని సమయాల్లో పాయింట్ 38 రివాల్వర్ ఉంచుకోవచ్చు.
-ఎన్‌వైపీడీ వద్ద ఉన్న పోలీసు కార్ల సంఖ్య 8839. పడవలు.. 11. హెలికాప్టర్లు 8. ఇవికాక.. 120 గుర్రాలు, 31 జర్మన్ షెపర్డ్ శునకాలు, మరోమూడు బ్లడ్ హౌండ్ కుక్కలు ఉన్నాయి.
ఇవీ జీతభత్యాలు
-ఎన్‌వైపీడీలో కొత్తగా చేరిన పోలీసుకు నెలకు జీతభత్యాలన్నీ కలుపుకొని 34,970 డాలర్ల దాకా ఇస్తారు (మన కరెన్సీలో దాదాపుగా రూ.2,10,000).
-ఉద్యోగంలో చేరిన మొదటి రెండేళ్లూ జీతంతో కూడిన 10 సెలవులు ఇస్తారు. 3, 4, 5 సంవత్సరాల్లో ఈ సంఖ్య 13కు పెరుగుతుంది. ఆ తర్వాత.. వేతనంతో కూడిన సెలవులు 27 ఇస్తారు.
-పూర్తి జీతంతో కూడిన సిక్‌లీవులు.. అదీ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇస్తారు.
-20 ఏళ్ల సర్వీసు పూర్తయ్యాక కావాలంటే స్వచ్ఛంద పదవీ విరమణ చేయవచ్చు. మిగతా సర్వీసు కాలానికి సగం జీతం చెల్లిస్తారు. 2014లో ఎన్‌వైపీడీలో చేరిన ఒక పోలీసు.. రిటైర్మెంట్ సమయంలో పొందే సొమ్ము దాదాపు 22 లక్షల డాలర్ల దాకా ఉంటుంది. మన కరెన్సీలో దాదాపు.. రూ.13.25 కోట్లు.
 

No comments:

Post a Comment