Monday 16 June 2014

పోలవరం అథారిటీకి బడ్జెట్‌లో 2000 కోట్లు!

పోలవరం అథారిటీకి బడ్జెట్‌లో 2000 కోట్లు!

Published at: 17-06-2014 04:10 AM
హైదరాబాద్, జూన్16(ఆంధ్రజ్యోతి): పోలవరం అథారిటీకి 2014-15 బడ్జెట్‌లో రూ.2000 కోట్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం అథారిటీకి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలంటే... బడ్జెట్ ప్రతిపాదనల్లో పోలవరం అథారిటీ పేరిట ప్రత్యేక హెడ్ ఆఫ్ అక్కౌంట్ ఏర్పాటు చేయాలి. ప్రత్యేక అక్కౌంట్ లేకుంటే.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు సాధించడం ఇబ్బందిగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం నుంచి 90 శాతం నిధులు వస్తాయి. అలాగే... భూసేకరణ, పునరావాస కల్పనకు కూడా నిధులు కేంద్రం నుంచే అథారిటీ ద్వారా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ తయారీ సమయంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. చంద్రబాబు త్వరలో కేంద్ర జల వనరుల మంత్రికి ఈ మేరకు లేఖ రాయనున్నార ని సమాచారం. మరోవైపు, చంద్రబాబు ఈ నెల 25, 26 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని ఏమేం కోరాలో శాఖలవారీగా నివేదికలు తయారు చేసే కసరత్తు నడుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సోమవారం ఇక్కడ సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. దీనికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహనరావు కూడా హాజరయ్యారు. విభజన తర్వాత వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై నివేదికలు తయారుచేసి మూడు రోజుల్లో సీఎం కార్యాలయానికి అందించాలని ఈ సమావేశంలో నిర్ణయిం చారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయించిన నేపథ్యం లో దానిపై ఇప్పటివరకూ ఖర్చు చేసిన రూ. మూడువేల కోట్లు కేంద్రం తిరిగి ఇవ్వాలని కోరాలని, ఈ ప్రాజెక్టు పూర్తికి ఎంత అవసరమో అంచనా వేసి కేంద్రానికి నివేదించాలని నిర్ణయించారు. విద్యారంగంలో కొత్త రాష్ట్రంలో కేంద్ర సంస్థలు స్ధాపించాల్సిన వాటిని పేర్కొంటూ వాటికి వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూమి, ఇతర మౌలిక వసతుల వివరాలు కూడా ఇవ్వాలని నిశ్చయించా రు. కాగా, పలు అంశాలతో కూడిన భారీ జాబితాను తీసుకుని సీఎస్ కృష్ణారావు మంగళవారం ఢిల్లీకి వెళుతున్నారు. రుణ మాఫీకి సంబంధించి రిజర్వు బ్యాంకు అధికారులతో మాట్లాడే అంశంతో పాటు బ్యాంకర్ల ద్వారా ఖరీఫ్ రుణాలు ఇప్పించడం, ప్రత్యేక హోదాతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు, విద్యుత్ సమస్య, నివారణ, సీఎస్‌టి వాటాలో భాగంగా రాష్ట్రానికి కేంద్రం చెల్లిం చాల్సిన బకాయిలు, రాజధాని నిర్మాణం, విభజన చఙట్టంలో పేర్కొన్న వివిధ అంశాలను సీఎస్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

No comments:

Post a Comment