Tuesday, 17 June 2014

సింగపూర్ కాన్సులేట్ జనరల్‌తో చంద్రబాబు

నేడు సింగపూర్ కాన్సులేట్ జనరల్‌తో చంద్రబాబు భేటీ

Published at: 17-06-2014 13:50 PM
హైదరాబాద్, జూన్ 17 : కొత్త రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మంగళవారం సాయంత్రం 4:00 గంటలకు సింగపూర్ కాన్సులేట్ జనరల్‌తో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశంకానున్నారు. ఏపీ రాజధానిని సింగపూర్‌లా అభివృద్ధి చేసే యోచనలో ఉన్న చంద్రబాబు అక్కడి భవనాలు, ఆర్కిటెక్చర్, సంస్థలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో అత్యుత్తమ రాజధానిని నిర్మిస్తాం : మంత్రి నారాయణ

Published at: 17-06-2014 13:47 PM
హైదరాబాద్, జూన్ 17 : ఆంధ్రప్రదేశ్ లో అత్యుత్తమమైన రాజధానిని నిర్మిస్తామని అందుకోసం సింగపూర్ సహకారం తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం ఉదయం సింగపూర్ కాన్సులేట్‌జనరల్‌తో సమావేశం అయిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంపై సింగపూర్ కాన్సులేట్ జనరల్‌లో చర్చించినట్లు ఆయన తెలిపారు. జాతీయ స్థాయి సంస్థల నిర్మాణానికి భూసేకరణకు కలెక్టర్ల నుంచి నివేదిక కోరామని ఆయన చెప్పారు. విశాఖ, గుంటూరు, తిరుపతి, విజయవాడను మెగా సిటీలుగా మిగిలిన న గరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


చంద్రబాబు ప్లాన్: సింగపూర్ తలదన్నేలా రాజధాని నిర్మాణం!

బుధవారం, 18 జూన్ 2014 (11:00 IST)
Babu
సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా ప్లాన్ వేస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి టెక్నికల్ సహకారం అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 
మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ రాయ్, మరికొందరు అధికారులను కలిశారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆహ్వానం మేరకు వారు వచ్చారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్‌లో ఉన్న అత్యుత్తమ కన్సల్టెన్సీ ఏమిటని చంద్రబాబు వారిని అడిగినట్లుగా సమాచారం. రాష్ట్ర అవసరం ఏమిటని సింగపూర్ అధికారులు చంద్రబాబును అడిగారట.
శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు తమ రాష్ట్రం విస్తరించి ఉందని, అందరికీ అందుబాటులో ఉండేలా ఒక రాజధాని నిర్మాణం చేయడం తమ లక్ష్యమని చంద్రబాబు వారికి చెప్పారు. 
ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధానిని సింగపూర్ తలదన్నేలా నిర్మించాలని చంద్రబాబు పక్కా ప్లాన్ వేస్తున్నారు. ఎక్కడ ఏర్పాటు చేసినా అత్యుత్తమమైనదిగా నిర్మిస్తామని, ఇందుకోసం సింగపూర్, మలేషియా తరహాలో నగరాల అభివృద్ధికి ఆలోచన చేస్తున్నామని మంత్రి పి నారాయణ చెప్పారు.



చంద్రబాబు సింగపూర్ మోడల్ అంటే ...కామెడీ గ అనుకుంటున్నా మిత్రుల కోసం.
నిజమే సింగపూర్ లో వ్యవసాయం లేదు, సింగపూర్ లో నీళ్ళు దొరికేదే తక్కువే, సింగపూర్ లో హెవీ ఇండస్ట్రీస్ తక్కువే.
మరి 2013 లో సింగపూర్ గ్రోత్ రేట్ ఎంత ?- 14.6% ... ఇండియా ది ఎంత ? - 5.6% ...మనవాళ్ళు గ్రోత్ రేట్ 8% అవుతూనే అదో వింత లాగా చూస్తున్నారు..
GDP per captia 1960 లో ఇండియా 271$ - సింగపూర్ 4913$ - చైనా 193$
2013 లో ఇండియా 1487$ - సింగపూర్ 51,900$ - చైనా 6091$
ఏ దేశం ఎన్ని రేట్లు పెరిగిందో మీరే చూడండి.
Reasons for development of Singapore-
* By embracing globalization,
* free market capitalism,
* education,
* strict pragmatic policies.
వాళ్ళు చెప్పిన qualities చంద్రన్నకు ఉన్నవే కదా. మరి సింగపూర్ లాగా డెవలప్ చేస్తానంటే నవ్వెందుకు ?
Singapore's man power division = 13.7%, services 70.1%, others 0.8%(2013 est.) unemployment 1.9%
India's man power division = agriculture: 51.1%, industry: 22.4%, services: 26.6% (2012 est.)
Service sector ని డెవలప్ చేస్తే అభిబృద్ధి వేగంగా జరుగుతది అని చంద్రన్న 15 ఏళ్ల కింద గుర్తించాడు. అందుకే IT సెక్టార్ ని చంద్రబాబు బాగా ప్రమోట్ చేసాడు. సింగపూర్ విజయ రహస్యం కూడా service sector అని గుర్తించాలి.
అది చంద్రబాబు కెపాసిటీ.
జై చంద్రన్న.

No comments:

Post a Comment