Monday 2 June 2014

కేసీఆర్‌ను ఆహ్వానించిన చంద్రబాబు

ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌ను ఆహ్వానించిన చంద్రబాబు

Published at: 02-06-2014 16:05 PM
హైదరాబాద్, జూన్ 2 : జూన్ 8న జరిగే ప్రమాణ స్వీకారమహోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీడీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. సోమవారం ఉదయం తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు చంద్రబాబు ఫోన్‌లో అభినందనలు తెలిపుతూ, తన ప్రమాణ స్వీకారానికి రావల్సిందిన ఆహ్వానించారు.
అలాగే వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని చంద్రబాబు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలు, అన్ని జాతీయ పార్టీల అధినేతలకు ఆహ్వానాలు పంపారు. కులదీప్‌నయ్యర్, ఎం.జె అక్బర్, వెంకటరమణ తదితర పాత్రికేయులను సైతం చంద్రబాబు ఆహ్వానించారు.

No comments:

Post a Comment