తెలంగాణ డెవలప్ గావాలె!
ఆ ఫలితాలు సమాజానికి అందాలె!!
నేడు ప్రొఫెసర్ జయశంకర్ మూడో వర్థంతి
నేడు ప్రొఫెసర్ జయశంకర్ మూడో వర్థంతి
"తెలంగాణను తప్పకుండ జూస్త. నాకైతే ఏం సందేహం లేదు. తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం మేజర్ ఎజెండా. ఇప్పుడు ఒకటి.. తెలంగాణ దేనికొరకు? ఎవని కొరకు? అంటే బీసీ సమస్య వస్తది గద.. తెలంగాణలో ఆర్థికాభివృద్ధి మోడల్ ఎట్ల వుండాలె అన్నప్పుడు.. అగ్రికల్చర్ ఎట్ల ఉండాలె.. ఇరిగేషన్ ఎట్ల ఉండాలె అనే ప్రణాళిక ఉంది. తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమం ఎట్ల ఉండాలె అంటె అగ్రికల్చర్ లెవల్‌లో, ఇరిగేషన్, రూరల్ డెవలప్‌మెంట్‌లో.. అట్ల అన్నీ వస్తయ్.. విద్యా విధానం ఎట్లా వుండాలె, వైద్య విధానం ఎట్ల ఉండాలె? అన్నీ సాధ్యమైతయ్.. ట్రెమండస్ ఛేంజస్ ఉంటయ్. ఒకటి.. ఆర్థిక పునర్నిర్మాణంలో బలహీనవర్గాల పాత్ర పెద్దగ ఉంటది. ముఖ్యంగ వ్యవసాయ రంగం, గ్రామీణ ప్రాంతం. దానికి అనుబం«ధగా విద్య, వైద్య రంగాల్లో ఉన్నటువంటి సంస్కరణలు జేస్తె ఆటోమాటిక్‌గ ఈ కార్పొరేట్ కల్చర్ బోతది. అది బోతే ఈ వర్గాలకు ఆ ఎలిజిబిలిటి వస్తది. కార్పొరేట్ కల్చర్ వున్నంత కాలం వాళ్లు పైకి రాలేరు. నాలాంటి వాళ్ల ఫస్ట్ ఎజెండా కార్పొరేట్ కల్చర్ ఖతం గావాలె. ఏది ఏమైనా తెలంగాణ సెంట్రిక్ వుంటది. తెలంగాణ డెవలప్ గావాలె, డెవలప్‌మెంట్ ఫలితాలు సమాజానికి అందాలె''.
- ఆచార్య కొత్తపల్లి జయశంకర్
(వొడువని ముచ్చట నుంచి...)
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, అనుక్షణం జనం వెన్నుతట్టి, వ్యూహాలను అందించి, పోరాటబాట చూపిన తెలంగాణ పిత ప్రొఫెసర్ జయశంకర్.. తెలంగాణను తప్పకుండా చూస్తాననే ఆశాభావం వ్యక్తం చేసేవారు. చివరి వరకూ రాష్ట్ర ఏర్పాటు కోసమే పరితపించారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉండాలనే బ్లూప్రింట్ కూడా సిద్ధం చేశారు. కానీ, ఆ కల నెరవేరకుండానే 2011లో జూన్ 21న క్యాన్సర్‌తో కన్నుమూశారు. నేడు ఆయన మూడో వర్ధంతి. ఆయన కలలుగన్న కొత్త రాష్ట్రంలో తెలంగాణ సమాజం నేడు ఊరూరా నివాళి అర్పిస్తోంది.

No comments:
Post a Comment