Wednesday 18 June 2014

ఆంధ్రాలోనూ కొన్ని చానెళ్లు నిలిపేద్దాం

ఆంధ్రాలోనూ కొన్ని చానెళ్లు నిలిపేద్దాం

Published at: 18-06-2014 05:23 AM
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రెండు టీవీ చానెళ్ల ప్రసారాలు నిలిపి వేయించిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నేతలు అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి పెంచుతున్నారు. సీమాంధ్రలో పనిగట్టుకొని తమ పార్టీకివ్యతిరేకంగా వ్యవహరించిన కొన్ని చానెళ్ల ప్రసారాలు అక్కడ కూడా నిలిపివేయించాలన్నది వారి డిమాండ్. మూడు, నాలుగు టీవీ చానెళ్లపై సీమాంధ్రలోని టీడీపీ నేతలు బాగా ఆగ్రహంతో ఉన్నారు. ఈ చానెళ్లు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పనిగట్టుకొని టీడీపీని ఓడించడానికి శాయశక్తులా కృషి చేశాయని, బూటకపు సర్వేలు తయారు చేసి, వాటిని పదేపదే ప్రసారం చేస్తూ టీడీపీ ఓడిపోతోందన్న అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేశాయన్నది వారి ఆరోపణ. పోలింగ్‌కు మూడు రోజుల ముందు ఒక టీవీ చానెల్ ఇలాంటి సర్వే ఒకదానిని ప్రసారం చేసే ప్రయత్నం చేయడాన్ని వారు ఉదాహరిస్తున్నారు. ఈమేరకు.. కొందరు టీడీపీ నేతలు మంగళవారం ఇక్కడ చంద్రబాబును కలిసి దీనిపై మాట్లాడారు. "మనం ముందు చేస్తే తప్పు అవుతుంది. తెలంగాణలో కేసీఆర్ దారి చూపించారు. ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి ఆయనకు ఇష్టం లేని టీవీ చానెళ్ల ప్రసారాలు నిలిపివేయించారు. మనమూ అదే పని చేద్దాం. మనకు వ్యతిరేకంగా పనిచేసిన చానెళ్లను మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఎంఎస్‌వోలకు చెప్పి వాటిని నిలిపివేయిద్దాం. ప్రభుత్వాన్ని కాదని కేబుల్ ఆపరేటర్లు వ్యాపారం చేయలేరు. మీరు ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలి'' అని వాదించారు. నిలిపివేయడానికి వంద కారణాలు దొరుకుతాయని, అనధికారికంగా జరగాల్సినవి జరిగిపోతాయని వారు ఆయనతో అన్నారు. దీనిపై ఆలోచిద్దామని చంద్రబాబు అన్నట్లు సమాచారం.

No comments:

Post a Comment