ఆంధ్రా సర్కారు కవ్వింపు
చంద్రబాబు నిజ స్వరూపం బయటపడుతోంది
కరెంటు, నీరు, పోలవరంపై క
తిప్పికోటెందుకు తెలంగాణ ఏకం కావాలి: కేసీఆర్
కరెంటు, నీరు, పోలవరంపై క
తిప్పికోటెందుకు తెలంగాణ ఏకం కావాలి: కేసీఆర్
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణపై కసి, విద్వేషాలు పెంచుకుని ఆంధ్రా సర్కార్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విమర్శించారు. ఇలాంటివి తిప్పికొట్టడానికి తెలంగాణ సమాజం ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆరుగురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు, మరో ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. వీరంతా పదవుల కోసం టీఆర్ఎస్‌లో చేరలేదని, తెలంగాణ ప్రగతి కోసం వస్తున్నారని తెలిపారు. "పోరాటాలు, ఆత్మబలిదానాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. దీనిని చూసి ఓర్వలేకనే తెలంగాణపై కుట్రపన్నుతున్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రగతికోసం అంతా ఏకంకావాలి. బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలి'' అని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం నాయకులకు చీమూ నెత్తురు ఉంటే వెంటనే ఆ పార్టీని వదిలి రావాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేని టీడీపీలో ఇంకా ఎందుకు కొనసాగుతారని ప్రశ్నించారు. "చంద్రబాబు నాయుడు నిజస్వరూపం బయట పడింది.
తెలంగాణకు కరెంట్ ఇవ్వరాదని ఆయన అంటున్నారు. ఖమ్మంలోని ఏడు మండలాలను దక్కించుకునేందుకు దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చుకున్నారు. చంద్రబాబు ఎంత తెలంగాణ వ్యతిరేకి కాకపోతే గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ ఏర్పాటు మాయని మచ్చ అని చెప్పిస్తారు?'' అని కేసీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు స్పష్టమైన ఎజెండాతోనే తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలుపన్నుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో చదువుకుంటున్న ఆంధ్రా విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వమే ఫీజులను భరించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలవడం ఇందులో భాగమేనని అన్నారు. ఆంధ్రా విద్యార్థులకు మనమెందుకు ఫీజులు చెల్లించాలని ప్రశ్నించారు. "ఇప్పుడు నా పని నేను చేసుకుపోతున్నా. గత కొంత కాలంగా మాట్లాడడమే మానేశా. చంద్రబాబు మాత్రం తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకుంటున్నారు'' అని ఆరోపించారు. కృష్ణా డెల్టాకు విడుదల చేసిన తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలని, లేకుంటే ఊరుకునేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, గిరిజనుల హక్కులను రక్షించడానికి డిజైన్‌ను మాత్రం మార్చాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఎవరి మీదా విద్వేషాలకు పోకుండా తెలంగాణ భవిష్యత్తుకు అన్ని శక్తులు ఏకీకృతం కావాలని అన్నారు. టీడీపీ విధానాలు నచ్చకనే ఆపార్టీ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో చేరారని అన్నారు.
బెల్ట్ షాపులను నియంత్రించే దిశగా కఠిన చర్యలను తీసుకోవాలని ఎక్సైజ్ శాకాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. బుధవారం ఆయన ఎక్సైజ్ మంత్రి పద్మారావు, కమిషనర్ అహ్మద్ నదీం తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2014-15 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో... ఒక్క దరఖాస్తు కూడా రాని 191 దుకాణాల విషయమై సీఎం వద్ద ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఎక్సైజ్ శాఖాపరంగా 2014-15 ఎక్సైజ్ సంవత్సరానికిగాను ఎంత ఆదాయం వస్తుంది ? తదితర వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అలాగే నకిలీ మద్యాన్ని, కల్లు విక్రయాలను, బెల్ట్ షాపులను నియంత్రించే క్రమంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
No comments:
Post a Comment