Saturday 21 June 2014

ఏపీ అసెంబ్లీలో కాసేపు వేడిక్కిన వాతావరణం

ఏపీ అసెంబ్లీలో కాసేపు వేడిక్కిన వాతావరణం

Published at: 20-06-2014 11:24 AM
హైదరాబాద్, జూన్ 20 : ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెలకు అభినందనలు తెలిపే సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు కొద్దిసేపు సభలో వాతావరణాన్ని వేడెక్కించాయి. ఈ సందర్భంగా సభలో జగన్, యనమల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ప్రస్తుతం సభలో ఉన్నవి రెండే రెండు పార్టీలు అని ఓ వైపు పాలక పక్షం, రెండో వైపు ప్రతిపక్షం మాత్రమే ఉన్నాయని జగన్ అన్నారు. బీజేపీ పార్టీ ప్రస్తుతానికి ప్రభుత్వంలో భాగమైనందున ఆ పార్టీ తమవైపు వచ్చే వరకు అటువైపుగా(పాలకపక్షం)లో ఉన్నట్లు భావిస్తున్నామన్నారు.
దీంతో జగన్ వ్యాఖ్యలపై మంత్రి యనమల రామకృష్ణుడు కౌంటర్ ఇచ్చారు. మొన్నటి వరకు అధికారంలోకి వస్తామని కలలు కన్న జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుటికీ అవే కలలు కంటూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావాలన్న జగన్ కలలు ఎప్పటికీ నిజం కావని, తాము శాశ్వతంగా అధికారంలోనే ఉంటామని వ్యాఖ్యానించారు. ప్రతిగా స్పందించిన జగన్ ఎవరు ఎక్కడ ఉంటారనేది అంతా దేవుడే చూసుకుంటాడని అన్నారు. 1999లో కూడా మీలో ఇదే ఆత్మవిశ్వాసం కనిపించిందని, తమరొకటి తలిస్తే దేవుడు, ప్రజలు మరో తీర్పు నిచ్చారన్నారు. 2004 ఎన్నికల్లో ప్రజలు విపక్ష నేత వైఎస్‌కు పట్టం కట్టారని, భవిష్యత్‌లోనూ ఇదే జరుగుతుందని వైఎస్ జగన్ ధీమా వ్యక్తంచేశారు.

No comments:

Post a Comment