|
www.aptdc.in
http://218.248.2.228/aptdc/login/OnlineLogin.jsp
సముద్రపు కెరటాలు.. ఇసుక తిమ్మెరలు.. కాలుష్యంలేని పడవలు.. కన్యాకుమారిని తలపించేలా సూర్యోదయం.. ఇదీ ఆంధ్రా గోవాగా ప్రసిద్ధి చెందుతున్న సూర్యలంక తీరం విశిష్టతలు. బాపట్ల మండలంలోని సూర్యలంక తీరం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని నల్గొండ, హైదరాబాదు తదితర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు, భక్తులు నిత్యం అధిక సంఖ్యలో సూర్యలంక విచ్చేస్తుంటారు. కార్తీకమాసంలో భక్తులు తరలి వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు.
గుంటూరు: బాపట్లలోని సూర్యలంక వద్ద తీరం అర్ధచం ద్రాకారంలో వంపు తిరిగి ఉంది. అందువల్ల ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశా లు తక్కువగా ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. తీరంలో ఎటువంటి దుర్వాసనలు వెద జల్లకుండా ప్రకృతి రమణీయతకు ప్రతీ కగా ఉంటుంది. బాపట్ల నుంచి సముద్ర తీరా నికి వెళ్ళే మధ్య ప్రాంతంలో జీడి, సరివి, జామాయిల్ తోటలు విస్తారంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ కార్తీక సమారాధనలు చేసు కోవడానికి అనుకూలంగా ఉంది.
చూడదగిన ప్రదేశాలు
బాపట్ల ప్రాంతంలో 1400 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ భావన్నారాయణస్వామి దే వాలయం ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఉప్పెనల బారిన పడకుండ తీరంలో ఏర్పాటు చేసిన భజన హనుమంతుని దేవాలయం ప్రాంగణం, చందోలులోని లింగోద్భవ క్షేత్రం, బండ్లమ్మ దేవాలయం, అల్లూరు నరసింహా స్వామి దేవాలయం, పట్టణంలోని వివిధ కళాశాలలు ప్రసిద్ధి గాంచిన ప్రదేశాలుగా యాత్రికులను ఆక ట్టుకుంటున్నాయి.
ప్రయాణం ఇలా....
సూర్యలంక తీరం బాపట్ల పట్టణం నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి బాపట్ల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు, ఆటోలు అన్ని వేళలా తిరు గుతాయి. ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు బాపట్ల వరకు రైలులో రావచ్చు.
వసతుల వివరాలు
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సూర్యలంక తీరంలోని హరిత బీచ్ రిసార్ట్స్ ఏర్పాటు చేశారు. ప్రత్యే కంగా ఫ్యామిలీ రెస్టారెంట్ సౌకర్యం ఉంది. ఇక్కడ అన్ని రకాల వెజ్, నాన్‌వెజ్ ఆహార పదార్థాలు, డ్రింక్స్ సరఫరా చేస్తారు. బార్ అండ్ రెస్టారెంట్ తోపాటు జిమ్ సౌకర్యం ఉంది. సముద్రంలో షికారు చేసేందుకు స్పీడ్ బోటు కలదు. దీనికి ఒక రౌండ్ రూ.250 చెల్లించాలి. రిసార్ట్స్‌లోని కాటేజి ఒక రోజుకు శని, ఆదివారాల్లో ఏసీ కాటేజి రూ.3,260, మిగిలిన రోజుల్లో రూ.2,248 అద్దె చెల్లించాలి. నాన్‌ఏసీ అయితే శని, ఆదివారాలలో రోజుకు రూ.2023 , మిగిలిన రోజులలో రూ.1461 అద్దె ఉంటుం ది. డార్మేటరీకి రోజుకు రూ.2,000 అద్దె చెల్లించాలి. కాటేజీ కావాల్సిన వారు డబ్యుడబ్ల్యు డబ్ల్యు.ఏపీటీడీసీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్ లైన్‌లో బుకింగ్ చేసుకోవాలి. పర్యాటకుల సౌకర్యార్థం గ్రామపంచాయతీ సులభ కాంప్లెక్స్‌ను ఇటీవలే నిర్మించారు. బాపట్ల పట్టణంలో వ్యవసాయ అతిథిగృహం, ఆర్ అండ్‌బీ అతిథి గృహాలతో పాటు భావన రెసిడెన్సీ, శ్రీరామ లాడ్జి, కోనభవన్, సాయిప్యాలెస్, సీటెల్‌లలో వసతి పొందవవచ్చు. సూర్యలంకతీరంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా మెరైన్ పోలీసుస్టేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు.
|
No comments:
Post a Comment