http://www.andhrajyothy.com/Artical?SID=103518&SupID=19
http://www.sakshi.com/news/andhra-pradesh/medha-patkar-visits-ap-capital-area-228890
- సామాజిక ఉద్యమకారులకు చంద్రబాబు ప్రశ్న
- పట్టిసీమపై జగన్ దుష్ప్రచారం: టీడీపీ నేతలు
హైదరాబాద్, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ‘విభజన విషయంలో సమ న్యాయం చేయాలని ఆనాడు పదేపదే కోరినా కేంద్రం పట్టించుకోలేదు. కేంద్రం ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ప్రజలు లక్షల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నెలల తరబడి పోరాడారు. తమకు అన్యాయం చేయవద్దని కోరా రు. ఆనాడు ఏ సామాజిక ఉద్యమకారుడు, కార్యకర్త వచ్చి వారిని పరామర్శించిన పాపాన పోలేదు. ఎందుకు ఉద్యమిస్తున్నారని అడిగే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడొచ్చి ఏదో అన్యాయం జరిగిపోతోందని మాట్లాడుతున్నవారంతా ఆనాడు ఎక్కడికి పోయారు? రాషా్ట్రనికి అన్యాయం జరిగినప్పుడు వీళ్లంతా ఏమయ్యారు’ అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం. శుక్రవారం ఆయన ఇక్కడ లేక్‌వ్యూ అతిథి గృహంలో టీడీపీ నేతలతో సమావేశమైనప్పుడు రాజధాని భూసేకరణపై కొందరు సామాజిక కార్యకర్తలు చేసిన ప్రకటనల విషయం ప్రస్తావనకు వచ్చింది. మేధాపాట్కర్ అక్కడ పర్యటించి వెళ్లారనీ, గాంధేయవాది అన్నా హజారే కూడా ఒక లేఖ రాశారని ప్రతిపక్ష నేత జగన్‌కు చెందిన పత్రికలో వార్త వచ్చిందని పార్టీ నేతలు చెప్పారు. ఆ లేఖ ఇంకా తనకు అందలేదని చంద్రబాబు తెలిపారు. ‘కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కూరుకుపోయి ఉంది. ఒక రాజధాని లేదు. దానిని కట్టుకోవడానికి నిధులు లేవు. పరిశ్రమలు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు లేని రాషా్ట్రన్ని మన చేతిలో పెట్టారు. ఈ పరిస్ధితిని పెద్ద మనసుతో అర్ధం చేసుకొని మనపై విశ్వాసంతో రాజధాని ప్రాంతంలోని రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 33వేల ఎకరాల భూమిని లాండ్ పూలిం గ్ కింద ఇచ్చారు. అక్కడ ఒక్క లాఠీ విరగలేదు. ఒక్క ఉద్యమం జరగలేదు. దేశంలో ఇంత ప్రశాంతంగా భూ సమీకరణ ఈ స్ధాయిలో జరగడం ఇదే ప్రఽథ మం. కంటగింపుతో కొందరు నేతలు వచ్చి ఏవేవో వచ్చి చెప్పినంత మాత్రాన సామాజిక ఉద్యమనేతలు స్పందించాల్సిన తీరు ఇదేనా? బహుశా వారికి కూడా పూర్తి సమాచారం లేకపోయి ఉండవ చ్చు. మనకేమీ వారిపై కోపం లేదు. ఇక్కడ పరిస్ధితులు, పరిణామాలు వివరిస్తూ వారికి లేఖలు రాద్దాం’ అని చంద్రబాబు అన్నారు. ‘ఇషా’ సంస్థకు చెందిన ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు రాజధాని ప్రాం తంలో 400 ఎకరాల భూమి కేటాయిస్తున్నట్లు కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అటువంటి కేటాయింపు ఇంతవరకూ చేయనప్పుడు ఆ వార్తలను ఎందుకు ఖండించలేదని అధికారుల ను సీఎం ప్రశ్నించారు. పట్టిసీమ వల్ల గోదావరి జిల్లాలకు నష్టం కలగద న్న విషయాన్ని అక్కడి ప్రజలు గ్రహించారనీ, కానీ, జగన్ మాత్రం ఢిల్లీ వెళ్లి కూర్చుని పక్క రాషా్ట్రలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈ సమావేశంలో కొందరు టీడీపీ నేతలు ఆరోపించారు. జగన్ తండ్రి వైఎస్ పోలవరం ప్రాజెక్టు టెండర్లు పిలిచిన రోజే ఇతర రాషా్ట్రలకు వెళ్లే వాటా వెళ్లి పోయిందని, ఇప్పుడు పట్టిసీమ వల్ల కొత్తగా పోయే వాటాలు ఏవీ లేవని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఈ సమావేశంలో మేధోమథనం జరిగింది. ఉత్సవాలకు ఏ పేరు పెట్టాలన్నదానిపై.. చర్చ రాగా అన్నీ నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.
No comments:
Post a Comment