సింహం, డేగ కలిస్తే ఎదురే ఉండదు
Updated : 4/15/2015 2:29:39 AM
Views : 867
- భారత్, జర్మనీ మైత్రి మరింత బలపడాలి
- జర్మనీ పెట్టుబడుల కోసం భారత్‌లో ప్రత్యేక యంత్రాంగం
- ఐరాస భద్రతామండలిలో భారత్, జర్మనీలకు చోటివ్వాలి
- సంయుక్త ప్రకటనలో ప్రధాని మోదీ, జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్
- జర్మనీ పెట్టుబడుల కోసం భారత్‌లో ప్రత్యేక యంత్రాంగం
- ఐరాస భద్రతామండలిలో భారత్, జర్మనీలకు చోటివ్వాలి
- సంయుక్త ప్రకటనలో ప్రధాని మోదీ, జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్
బెర్లిన్, ఏప్రిల్ 14: మానవ వనరులు పుష్కలంగా ఉన్న భారత్‌తో పారిశ్రామికాభివృద్ధిలో ఎంతో ముందున్న జర్మనీ చేయికలిపితే రెండుదేశాలు ప్రపంచంలోనే బలమైన శక్తిగా అవతరిస్తాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భారత పారిశ్రామికాభివృద్ధి కోసం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జర్మనీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. జర్మనీ పెట్టుబడిదారులు, వ్యాపారస్తుల సౌకర్యం కోసం భారత్‌లో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు.
అణు విస్తరణకన్నా ఉగ్రవాదమే ప్రమాదం
అణ్వాయుధాల విస్తరణకన్నా ప్రపంచానికి ఉగ్రవాదమే అత్యంత ప్రమాదకరంగా పరిణమించిందని ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. అది మానవత్వానికే పెనుముప్పుగా పరిణమిస్తున్నదని తెలిపారు. ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న దేశాలపై ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితిలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సుపై (సీసీఐటీ) ఈ ఏడాదైనా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆఫ్గనిస్థాన్‌లో శాంతి, ప్రజాస్వామ్యాభివృద్ధి ఎంతో ముఖ్యమని తెలిపారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అందరూ రాజీకి రావాలి: మెర్కెల్
ఈయూ- భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అన్ని వర్గాలు రాజీకి రావాలని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ పిలుపునిచ్చారు. ఈ ఒప్పందంపై భారత్, ఈయూ మధ్య సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రధాని విమానంలో సమస్యలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: మూడు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ వాడుతున్న ఎయిర్ ఇండియా వన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ముంబైలో సిద్ధంగా ఉన్న ప్రత్యామ్నాయ విమానాన్ని హుటాహుటిన జర్మనీ రాజధాని బెర్లిన్‌కు పంపారు. బోయింగ్ 747-400 విమానంలో ప్రధాని బెర్లిన్ నుంచి కెనడాలోని ఒట్టావాకు వెళ్లాల్సి ఉండగా మంగళవారం ఉదయం విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో వెంటనే ప్రత్యామ్నాయ విమానాన్ని బెర్లిన్ పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యామ్నాయ విమానంలో ప్రధానితోపాటు ఇతర భారతీయ ప్రతినిధులు కెనడా బయలుదేరి వెళ్లారు.
No comments:
Post a Comment