|
ప్రస్తుతం సోషల్ మీడియా చాలా శక్తిమంతంగా వేగవంతంగా పనిచేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. లక్షలాదిమందికి నేరుగా సమాచారం అందించడం సాధ్యమవుతోందన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌ను తాను విస్తృతంగా ఉపయోగిస్తున్నానని, పథకాలను ప్రజలకు వివరించడమే కాకుండా వారి సమస్యలు తెలుసుకోవడానికీ ఉపయోగపడుతున్నాయని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా వీటిని వినియోగించుకోవాలని సూచిస్తున్నామన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రోహింగ్‌టన్, జస్టిస్ చలమేశ్వర్‌లు 66ఎపై ఇచ్చిన తీర్పు ఆహ్వానించదగినదని చంద్రబాబు కితాబిచ్చారు. 20 ఏళ్ల తరువాత కేంద్రంలోను, రాష్ట్రంలోను మంచి ప్రభుత్వాలు వచ్చాయని, పేదరికం తొలగించడానికి పనిచేస్తున్నాయని, దానికి మీడియా సహకరించాలని కోరారు. మీడియాలో వాసి, రాశి పెరిగిందని దాంతో పాటే సీరియ్‌సనెస్ కూడా పెరగాలని అభిలషించారు.
|
No comments:
Post a Comment