|
- వేసవిలో నోరూరిస్తున్న పాల, మొర్రి, తునికి, ఇప్పపండ్లు
- తునికాకు, చీపురు పుల్లల సేకరణ
- గిరిజనులకు ఆదాయ వనరులు
మంథని: వేసవి అంటే మండే ఎండలు, నీటి ఎద్దడితో జనం అల్లాడుతుంటారు. ఈ వేసవిలోనే జిల్లాలోని తూర్పు డివిజన్‌లో నో రూరించే ప్రకృతి ప్రసాదిత పండ్లు అడవి బిడ్డలకు ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నాయి. ఎలాంటి కాలుష్యం, రసాయనిక ఎరువు లు పడకుండా సహజ సిద్ధంగా లభించే ఈ అడవి పండ్లు అందరికీ ఆరో గ్యాన్ని పంచుతూ గిరిజనులకు ఆదాయ వనరులుగా మారాయి. డివిజన్‌లోని మంథని, ముత్తారం, మల్హర్, కాటారం, మహదేవపూర్, మహాముత్తారం మండలాల్లో విస్తరించి ఉన్న అడవుల్లో వేసవి కాలం ప్రారంభంలో పాలపండ్లు, మొర్రి పండ్లు, తునికి పండ్లు, ఇప్ప పండ్లు, తునికాకు, చీపురు లాంటి అటవీ ఉత్పత్తులు లభ్యమవుతాయి. దాదాపు నెల రోజుల పాటు ఇలాంటి అటవీ ఉత్పత్తులను గిరిజనులతో పాటు ముదిరాజ్‌లు ఎక్కువగా సేకరిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. తెల్లవారుజాము న 3-4 గంటల ప్రాంతంలో గ్రామాల సమీపంలోని అడ వికి వెళ్లి పాలపండ్లు, మొర్రి పండ్లు, తునికి పండ్లు, ఇప్ప పండ్లు, తునికాకు, చీపురు పుల్లను సేకరించి ఉదయం 9 గంటల వరకు తిరిగి గ్రామంలోకి చేరుకుంటారు. సేకరించిన పం డ్లను గంపల్లో వేసుకొని సాయం త్రం, ఉదయం ఊరూరా తిరిగి అమ్ము తుం టారు. అడవుల్లో పండ్ల సేకరణలో అడవిపందులు, ఎలుగుబంట్లు, పాము ల దాడులకు గురైన సంఘటనలు అనేకమున్నాయి. చెట్ల పై నుంచి పడి పోయి చాలా మంది గాయాలపాలయ్యా రు. అయితే అడ వులు రాను రాను అంతరిం చి పోతుండటంతో వివిధ రకాల పండ్లు కూడా అడవుల్లో దొరకడం కష్టతరంగా మారుతోంది. దీంతో అనేక వ్యయప్రయాసాలకు కోర్చి సేకరించిన పండ్లను టీ గ్లాస్ చొప్పున రూ. 15-20, వాటర్ గ్లాస్ కు రూ.50 విక్రయిస్తున్నారు. మరికొందరు గిరిజనులు గ్లాస్ పండ్లకు బదులు గ్లాస్ బియ్యం తీసుకుంటుంటారు. వేసవి కాలంలోనే సహ జ సిద్ధంగా లభించే ఈ పండ్లతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుండటంతో ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. చీపురు కట్టను రూ. 20కి అమ్ముతుండగా, విప్ప పువ్వును జీసీసీకి, తునికాకును కల్లాల్లో విక్రయిస్తుంటారు. ప్ర స్తుతం తునికాకు సీజన్ ఇంకా ప్రారంభం కాలేదు. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్ప త్తులకు స్థానికంగా గిరిజన సహకార సం స్థ, ప్రభుత్వ పరంగా గిట్టుబాటు ధరతో కొ నుగోలు చేసే కేంద్రాలు లేని కారణంగా క ష్టానికి తగిన ఫలితం వారికి లభించడం లేదు. కష్టపడి సేకరించినా ఫలితం దక్కడంలేదు వేసవిలో అడవిలో దోరికే పండ్లు, కాయలే మాకు ఉపాధి. నెల రోజుల పాటు అడవుల్లో దొరికే ఇప్పపూవ్వులు, పాలపండ్లు, తునికి లాంటి పండ్లను సేకరించి అమ్ముతుంటాం. జీసీసీ అధికారులు మేం సేకరించే పండ్ల ను సంస్థ ద్వారా కొనుగోలు చేయడం లేదు. దీంతో సేకరిం చిన పండ్లను గ్రామాల్లో అతి తక్కువ ధరకు, బియ్యానికి అమ్ముతున్నాం. కొంత మంది దళారులు మావద్ద కొనుగోలు చేసిన పండ్లకు సరైన ధర ఇవ్వడంలేదు. ఎండా కాలం ఎంతో కష్టపడి అడవుల్లో పండ్లు సేకరించి అమ్మినా ఫలితం మాత్రం దక్కడంలేదు. - గుగులోతు రాజభాయి, పెగడపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఆదివాసీలమైన మేము సీజన్‌లో అటవీ ఉత్పత్తుల సేకరణలోనే గడుపుతాం. వర్షాకాలంలో అడవి బోడ కాకర, వివిధ రకాల గడ్డలు సేకరిస్తాం, బంక, వివిధ రకాల పండ్లను, వేసవిలో విప్ప, పాల, తునికి, మొర్రి పండ్లతో పాటు చీపుర్లు, తునికాకు లాంటివి సేకరిస్తూ స్థానికంగా ఉపాధి పొందుతున్నాం. అయితే గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు ప్రభుత్వం, గిరిజన సహకార సంస్థ తరుపున స్థానికంగా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో పట్టణాల నుండి వచ్చే కొందరు వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. - పులిసూ నాగయ్య, కనుకునూర్ |
No comments:
Post a Comment