Thursday, 9 April 2015

రైతులకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు

రైతులకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు
Sakshi | Updated: April 09, 2015 12:59 (IST)
రైతులకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూములు ఇవ్వమన్న రైతులకు హైకోర్టు ఊరట నిచ్చింది. 9.2 ఫారాలు సమర్పించిన రైతుల వ్యవసాయ పనులకు ఆటంకం కలిగించొద్దని ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై రెండు వారాల్లోగా కౌంటర్‌ కూడా దాఖలు చేయాలని కూడా ఆదేశించింది.

కాగా రాజధాని నిర్మాణానికి తమ భూములు ఇచ్చేది లేదంటూ సుమారు 200 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.  రైతులు 9.2 ఫారాలను ఈ ఏడాది జనవరి 30న సమర్పించారు. స్వచ్ఛందం పేరుతో తమ భూములు లాక్కున్నారని, ఆ ఫారాలపై తమతో బలవంతంగా సంతకాలు పెట్టించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూ సమీకరణ నుంచి తమను మినహాయించాలంటూ వారు న్యాయస్థానాన్ని కోరారు. రైతుల తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. కోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టు సానుకూలంగా స్పందించటం రైతుల విజయం అని సుధాకర్ రెడ్డి అన్నారు.

No comments:

Post a Comment