Saturday, 11 April 2015

ముస్లిం రిజర్వేషన్లపై తలోమాట

ముస్లిం రిజర్వేషన్లపై తలోమాట

Sakshi | Updated: April 11, 2015 02:11 (IST)
ముస్లిం రిజర్వేషన్లపై తలోమాట
  • జాతీయ బీసీ కమిషన్ ఎదుట అనుకూల, వ్యతిరేక వాదనలు
  • నిర్ణయం వెల్లడించని కమిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ-ఈ జాబితాలోని దోబీ ముస్లిం, ఫకీర్, ఫకీర్ సాయెబ్, బుడబుడ్కి, లబ్బి, లబ్బాయి, ఖురేషీ, షేక్, ముస్లిం కటిక తదితర 14 ముస్లిం బృందాలు, వర్గాలను కేంద్ర ప్రభుత్వ ఓబీసీ కులాల జాబితాలో చేర్చే అంశంపై శుక్రవారం జాతీయ బీసీ కమిషన్ ఎదుట అనుకూల, వ్యతిరేక వర్గాలు వాదనలు వినిపించాయి. రాష్ట్రంలోని బీసీ కులాలపేర్లు, అచ్చుతప్పులు, సవ రణలు తదితర  అంశాలపై హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని హాలులో జరిగిన జాతీయ బీసీ కమిషన్ ప్రజావినతుల సేకరణ (పబ్లిక్ హియరింగ్)లో ప్రధానంగా ఈ అంశంపైనే చర్చ సాగింది.

కేంద్ర జాబితాలో ఈ కులాలను చేర్చేందుకు ఇప్పటికే అందిన వివరాలు, నివేదికలు, వివిధ సంఘాల వినతులపై కమిషన్ సర్వే చేపట్టాలని అనుకూల వర్గం కోరగా, సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నం దున తీర్పు వెలువడే దాకా దీనిపై ఏ నిర్ణయం తీసుకోవద్దని వ్యతిరేక వర్గం వాదించింది. ఇరువర్గాల వాదనలను విన్న కమిషన్ తన నిర్ణయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాంగ్రెస్ పార్టీపక్షాన, వ్యక్తిగతంగా ఆయా కులాల పక్షాన శాసనమండలిలో విపక్షనేత మహ్మద్ అలీ షబ్బీర్‌తోపాటు ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ప్రసాద్ కుమార్ తమ వాదనలను వినిపించారు.

ఇదే అంశంపై విడిగా ఎంఐఎం పక్షాన ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పేరిట రాసిన వినతిపత్రాన్ని ఆ పార్టీ ఎమ్మెల్సీలు సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వీ, అమీనుల్ హసన్‌జాఫ్రి బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్యకు సమర్పించారు. ఈ 14 కులాలను రాష్ట్ర ప్రభుత్వం బీసీ-ఈలో చేర్చలేదని, ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున తీర్పు వచ్చేవరకు దీనిపై నిర్ణయం తీసుకోవద్దని వివిధ బీసీ సంఘాలు,  న్యాయవాది కొండల్‌రావు, బీసీ యునెటైడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య ప్రతివాదనలు వినిపించారు.

No comments:

Post a Comment