|
-ప్రథమ స్థానంలో స్లొవేకియా
- మంగళవారం అమెరికా చికాకు - గురువారం గల్ఫ్ దేశాల సంతోషం లండన్, ఏప్రిల్ 19: నిద్రపోవడమంటే టైముకి పడకెక్కడం, ఏదో ఒక టైముకి లేవడం మాత్రమే కాదంటున్నారు పరిశోధకులు. జనావళికి అత్యవసరం, అత్యంత ప్రీతిపాత్రమైన నిద్ర తీరు.. దేశకాలాలను బట్టి మారుతుందని తెలుస్తోంది. అంతేనా.. నిద్రపోయే, లేచే సమయం, నిద్రించే వ్యవధి, ఆ వారంబట్టి మూడ్ కూడా డిసైడవుతాయని తాజా సర్వేలో తేలింది. స్లీప్ సైకిల్ యాప్ యూజర్ల నుంచి 50 దేశాల్లో జనం నిద్రపై సమాచారం గ్రహించారు. ఈ యాప్‌ను ఉపయోగించే వారు.. దాని ద్వారా తమ నిద్రా సమయాలను నియంత్రించుకునే అవకాశం ఉంది. అలారం నుంచి దినచర్య, పని, అలసిపోయే సమయం వంటి ఇతర వివరాలు ఆ యాప్‌కు ఇవ్వాలి. అప్పడది.. నిద్రపోవాల్సిన సమయంతో పాటు లేవాల్సిన సమయాన్నీ సూచిస్తుంది. ఆ యాప్ యూజర్ల నుంచి సేకరించిన సమాచారాన్నిబట్టి ప్రపంచంలో మెజారిటీ దేశాల్లో బుధవారం రాత్రి బాగా నిద్రపోతారని తేల్చారు. అలాగే.. ఆదివారం ఎక్కువ మంది తక్కువగా నిద్రపోతారని తెలిసింది. అమెరికన్లు మంగళవారం ఉదయం ఏడింటికే లేచినా.. చికాగ్గా ఉంటూ శుక్రవారం వరకూ అలాగే ఉంటారట. సింగపూర్, స్పెయిన్, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాలవాసులూ ఇంతే. ఇక స్లోవేకియాలో జనానికి నాణ్యమైన నిద్ర పడుతోందని తేలింది. ఈ వరుసలో భారత్ 25, బ్రిటన్, అమెరికా 45, 49 స్థానాల్లో ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో గురువారం జనం ఆలస్యంగా నిద్రలేచి మంచి మూడ్‌లో ఉంటారట. ఈ యాప్‌ను ఉపయోగించే 20 లక్షల మందినుంచి 2014 జూన్ 1- ఈ ఏడాది 31 మార్చివరకూ సేకరించిన సమాచారాన్నిబట్టి సర్వే నిర్వాహకులు అంచనాలు వేశారు. ఏయే వారాల్లో ఎలా ఉంటుందంటే... సోమ: ఎక్కువమంది తొందరగా లేస్తారు. అందరికన్నా ముందు దక్షి ణాఫ్రికాలో ఉదయం6:09కి లేస్తారు. మంగళ: అమెరికన్లు ఏడింటికల్లా లేచినా రోజంతా చిరాగ్గా ఉం టారు. స్పెయిన్, సింగపూర్, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లోనూ ఇంతే. బుధ: అమెరికన్లు చక్కగా నిద్రిస్తారు. తర్వాతి స్థానం చైనాది. గురు: నిద్రంతా గల్ఫ్ దేశాలదే. వారు ఈ రోజు ఎక్కువగా నిద్రించడమే కాక, మంచి మూడ్‌లో ఉంటారని తేలింది. శుక్ర: ఈ రోజు అమెరికన్లు ఉదయం 8:24 వరకూ లేవకుండా ఉన్నా.. మంచి మూడ్‌లో ఉంటారని తేలింది. శని: 90 శాతం జనం ఈ రోజు లేటుగా లేస్తారు. ఆది: 66 శాతం జనం ఈ రోజు తక్కువ సమయం నిద్రిస్తారు. |
No comments:
Post a Comment