Thursday, 23 April 2015

బర్గర్ లో బేకన్ లేదంటూ మహిళ కాల్పులు

బర్గర్ లో బేకన్ లేదంటూ మహిళ కాల్పులు

Others | Updated: April 23, 2015 10:58 (IST)
బర్గర్ లో బేకన్ లేదంటూ మహిళ కాల్పులు
వాషింగ్టన్:  బర్గర్ లో స్టఫింగ్ సరిగా లేదంటూ కాల్పులు జరిపిన ఓ మహిళ చివరకు కటకటాల పాలైంది. వివరాల్లోకి వెళితే మిచిగన్ కి చెందిన శనేకా మోనిక్యూ టొర్రెస్  2014 ఫిబ్రవరి10 రాత్రి తన స్నేహితురాలితో కలసి మెక్ డొనాల్డ్స్ కి వెళ్లింది. మీల్ తో పాటూ బేకన్ చీస్ బర్గర్ ఆర్డర్ చేసింది. మీల్ వచ్చినా బెకన్ సర్వ్ చేయలేక పోవడంతో మేనేజర్ ..శనేకాకు క్షమాపణ చెప్పి మీల్ ని ఉచితంగా ఇస్తానని చెప్పాడు.

అదే రోజు కొన్ని గంటల తర్వాత శనేకా తిరిగి మెక్ డొనాల్డ్స్ కి  వచ్చింది.  అయితే ఆమె బర్గర్ ఆర్డర్ చేసినా అప్పుడు  కూడా బేకన్ లేకుండానే మీల్ ఇవ్వడంతో ఆగ్రహం పట్టలేని శనేకా మోనిక్యూ టొర్రెస్ తన వెంట తెచ్చుకున్న గన్ తో ఎడాపెడా కాల్చేసింది.  అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో ఎవరికి గాయాలు కాలేదు.

దాంతో అమ్మడిపై మెక్ డొనాల్డ్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కోర్టు విచారణ సందర్భంగా... కాల్పులు అనుకోకుండా జరిగిన సంఘటనగా పరిగణించాలని శనేకా మోనిక్యూ తరపు న్యాయవాది కోరినా లాభం లేకుండా పోయింది. శనేకా మోనిక్యూ కు న్యాయస్థానం మూడు నుంచి ఏడేళ్లలోపు శిక్ష విధించిది.

No comments:

Post a Comment