మహానాడు ఈసారి హైదరాబాద్‌లో
Sakshi | Updated: April 29, 2015 04:18 (IST)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా మే 27 నుంచి 29 వరకు నిర్వహించే మహానాడు ఈసారి హైదరాబాద్‌లో జరగనుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం తెచ్చేందుకు హైదరాబాద్‌లోనే మహానాడు నిర్వహించాలని ఈ ప్రాంత నేతలు కోరుతున్నారు. దీంతో మహానాడు వేదికగా హైదరాబాద్‌ను ప్రాథమికంగా ఖరారు చేశారు. ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. మే రెండో తేదీన బాబు అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగే పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటారు.
ఈ విషయమై చర్చించేందుకు తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు బుధవారం సమావేశమవనున్నారు. కాగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సచివాలయంలోని తన చాంబర్‌లో మంగళవారం మధ్యాహ్నం విందు ఇచ్చారు. ఇదిలా ఉండగా టీటీడీ పాలకవర్గ సభ్యులుగా నియమితులైన ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, జి. సాయన్న చంద్రబాబును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

No comments:
Post a Comment