Monday, 13 April 2015

ప్రతి హిందువు నలుగురిని కనాలి

ప్రతి హిందువు నలుగురిని కనాలి

(13 Apr) హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కనాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్‌ అన్నారు. లేనిపక్షంలో హిందు జాతి తగ్గిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కౌండిన్య సేవాసమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ మంజుల అనగానికి ఆదివారం రాత్రి బషీర్‌బాగ్‌ దేశోద్ధారకభవన్‌లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహత్మా జ్యోతిరావు పూలే స్మారక పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన స్వామిగౌడ్‌ మాట్లాడుతూ 'చిన్న కుటుంబం చింతల్లేని కుటుంబం' అనే అందమైన నినాదంతో హిందూ జాతి తగ్గిపోయే ప్రమాదముందన్నారు. ఒకరు పది మంది సంతానం కంటుంటే, మరొకర్ని ఇద్దరికే పరిమితం చేయాలని కోరడం ఏం పద్ధతని ప్రశ్నించారు. ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడిన వారి చరిత్రను తొక్కిపెట్టారని.. సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ చరిత్ర దీనికి నిదర్శనమని చెప్పారు. జ్యోతిరావు పూలే హిందూ మతంలో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. గ్రామాల్లో నేటికీ కులవ్యవస్థ వేళ్లూనుకునే ఉందని, 60 ఏళ్ల నాటి పరిస్థితులేమీ మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌

No comments:

Post a Comment