పెళ్లిళ్లు స్వర్గంలో...పెళ్లికళ భూలోకంలో!
Sakshi | Updated: April 22, 2015 23:35 (IST)
పెళ్లి తంతులో ఏ చిన్న అంశాన్నీ వదిలిపెట్టకుండా ప్రతిదానికీ డిజైనర్ టచ్ ఇచ్చి ‘ఔరా’ అనిపిస్తున్నారు వెడ్డింగ్ డిజైనర్లు. ఇన్నాళ్లూ పెళ్లి కార్డులు, పెళ్లి పందిరి వరకే పరిమితమైన డిజైనర్లు ఇప్పుడు పెళ్లింట అంతా తామే అయి నడిపిస్తున్నారు.
జడ
జడకు మల్లెలు, కనకాంబరాలు, లిల్లీలతో అల్లిక వేయడం ఒకనాటి మాట. ఇప్పుడు చీరకు సరిపోలే రంగులతో కుందన్లు, పూసలు, ముత్యాలు, జరీ దారాల అల్లికతో అందమైన పూల జడలను రూపుకడుతున్నారు డిజైనర్లు. ఆకట్టుకునే ఈ డిజైనర్ జడలు రూ.2,000ల నుంచి ధర పలుకుతున్నాయి. పూలజడల తయారీలో వాడే మెటీరియల్‌ను బట్టి ధర కూడా పెరుగుతుంది.
జల్లెడ
పెళ్లికి ముందు చేయించే మంగళస్నానంలో వాడే జల్లెడను కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. శాటిన్ రిబ్బన్ పూలు, కుందన్ల మెరుపులతో జల్లెడలు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి.
కొబ్బరి బోండాం
పందిట్లోకి నడిచే వచ్చే కుందనపు బొమ్మలాంటి వధువు చేతిలో కొబ్బరి బోండాం ఉంటుంది. పచ్చదనం జీవితమంతా పరుచుకోవాలనే కొబ్బరిబోండాంతో పందిట్లో అడుగుపెడుతుంది వధువు. ఆ కొబ్బరిబోండాంని ఇప్పుడు చెప్పనలవి కానన్ని సొబగులతో తీర్చిదిద్దుతున్నారు. చమ్కీ, ముత్యాలతో రూపుకట్టే ఈ కొబ్బరి బోండాలు పందిట్లో ఆక ర్షణీయంగా మారాయి. అంతేకాదు, కొబ్బరి కుడకలు కూడా డిజైనర్ టచ్‌తో మెరిసిపోతూ కనిపిస్తాయి.
తలంబ్రాల బుట్ట
కొన్ని పెళ్లిళ్లలో వారి వారి సంప్రదాయాన్ని బట్టి వధువును పెద్ద బుట్టలో కూర్చోబెట్టి పందిట్లోకి మోసుకువస్తారు. ఆ బుట్టనే కాదు, తలంబ్రాలకు ఉపయోగించే బుట్టలను కూడా వెల్వెట్, శాటిన్ మెరుపులతో మెరిపిస్తున్నారు. అందమైన లేసులు కడుతున్నారు. ధర పెట్టిన కొద్దీ డిజైనర్ హంగులూ పెరుగుతాయి. ఒక్కో బుట్ట రూ.2,500ల నుంచి ధర పలుకుతోంది.
అడ్డు తెరలు
వధువుకి వరుడికి మధ్యలో పట్టుకునే అడ్డుతెర డిజైన్లు లెక్కలేనన్ని వచ్చేశాయి. రాధాకృష్ణులు, సీతారాముల చిత్రాలే కాదు, పక్షుల సౌందర్యం వీటిలో చూడవచ్చు. చూడచక్కని సందేశమించే ‘కొటేషన్లూ’ అడ్డుతెరల మీద దర్శనమిస్తాయి. ఇదంతా డిజైనర్ మహిమే!
పువ్వుల ఆభరణాలు.
అమ్మాయిని పెళ్లి కూతురు చేయాలంటే ఇప్పుడు ఓ కొత్తరకం ‘కళ’ డిజైనర్ టచ్‌తో వచ్చింది. బంగారు నగలను పక్కన పెట్టి డిజైన్ చేసిన పువ్వుల ఆభరణాలతో వధువును చూడముచ్చటగా తీర్చిదిద్ది మరింత శోభను తెస్తున్నారు.
ఇవే కాదు, సన్నికల్లు, కలశం, పూల దండలు, విసనకర్రలు, గొడుగులు, ముత్యాల పందిళ్లు, మంగళసూత్రాలు, మెట్టెలు.. అన్నీ డిజైనర్ ‘టచ్’ ఉన్నవే! పెళ్లికి వచ్చిన అతిథులకు ‘రిటర్న్ గిఫ్ట్’ ఇవ్వాలన్నా అవి కూడా అందమైన డిజైన్‌తో ఆకట్టుకునేలా ఉండాలని కోరుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. అందుకు తగ్గట్టు రూ.100 నుంచి మార్కెట్లో డిజైనర్ రిటర్న్ గిఫ్ట్‌లు లభిస్తున్నాయి.ఇలా పెళ్లిలో ఏయే సందర్భాలలో ఏయే వస్తువులు ఉపయోగిస్తారో, వాటన్నింటికీ డిజైనర్ ‘కళ’ను చేర్చి మీ నట్టింటికి తీసుకువస్తున్నారు డిజైనర్లు. ఇందుకు ఆన్‌లైన్ మార్కెట్‌లూ అందుబాటులో ఉన్నాయి
- ఎన్.ఆర్
పెళ్లి కళ
పెళ్లి అనగానే ఓ కళ మన కళ్ల ముందు మెదులుతుంది. అందుకే ప్రతి అంశాన్నీ ఫోకస్ చేస్తూ ప్రతిదీ కళకళలాడేలా డిజైన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాం. ఈ డిజైన్డ్ కళపై ఇప్పుడు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.
- కల్పనా రాజేష్, పూలజడల డిజైనర్
www.pellipoolajada.com

No comments:
Post a Comment