చత్తీస్‌గఢ్, ఏప్రిల్ 11: చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. శనివారం నాడు సుకుమా జిల్లాలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు ఎస్టీఎఫ్ పోలీసులు మృతిచెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాయపూర్ ఆస్పత్రికి తరలించారు.
మావోయిస్టుల ఏరివేత కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్టీఎఫ్ విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు పోలీసులు సుకుమా సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండుగా మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పోలీసులపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో 7గురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు.
No comments:
Post a Comment