హైదరాబాద్, ఏప్రిల్ 14 : సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం అంబేద్కర్ మార్గం అవసరమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మైనార్టీలను కొన్ని పార్టీలు ఓటు బ్యాంకుగా చూస్తున్నాయన్నారు. పేదలకు ఉపాధి కల్పించిన రోజే పేదరికం అంతమవుతుందన్నారు. అంబేద్కర్‌ను బీజేపీ సొంతం చేసుకుంటోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అంబేద్కర్, పటేల్, సుభాష్ చంద్రబోస్‌కు గత ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వలేదని మంత్రి ఆరోపించారు. బోస్ కుటుంబంపై నిఘా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పడానికి కాంగ్రెస్ ఎందుకు అంతలా భయపడుతోందని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకే స్వర్ణభారత్ ఏర్పాటు చేసినట్టు వివరించారు. దీనిపై ఆరోపణలు సరికాదని వెంకయ్య హితవు పలికారు.
No comments:
Post a Comment