హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడిలో మునిగిపోవడంతో న్యాయబద్ధమైన పాలన సాగడం లేదని విమర్శించారు. శనివారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాట్లాడిన అంబటి.. చంద్రబాబు ప్రధానంగా ఐదు ఫ్రస్టేషన్లతో ఇబ్బందిపడుతున్నారన్నారు. శేషాచలం ఎన్ కౌంటర్, రాజధాని నిర్మాణంపై కోర్టుల అడ్డంకులు, పట్టిసీమ, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఒక్క హామీని కూడా నేరవేర్చకపోవడం
తదితర వాటితో బాబు ఇబ్బంది పడుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు.
ఆయన కుటుంబంలో కూడా ఏదో ఒక ఫ్రస్టేషన్ ఉందా అన్న అనుమానం తమలో కలుగుతుందన్నారు. వాటి నుంచి బయటకొచ్చి న్యాయబద్ధంగా పాలించాలని అంబటి హితవు పలికారు.ఇప్పటివరకూ ప్రజలకిచ్చిన ఒక్క హామీని కూడా బాబు నేరవేర్చలేదని అంబటి మరోసారి గుర్తు చేశారు.
No comments:
Post a Comment