Monday 17 August 2015

ఆస్తులు తెలంగాణకు.. అప్పులు ఏపీకి

ఆస్తులు తెలంగాణకు.. అప్పులు ఏపీకి
అడ్డగోలు విభజన ఫలితమిది.. ప్రధానితో చర్చిస్తా..

  • ఉమ్మడి రాజధానిపై గవర్నర్‌కే అధికారం
  • ఏడాదైనా ఆయన చట్టాన్ని అమలు చేయరు
  • ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్‌ను కించపరిచేలా టి-సర్కార్‌ చర్యలు
  • ఏపీ అధికారులనూ అవమానిస్తున్నారు
  • అన్ని విషయాల్లో ఏపీకి అన్యాయం
  • వ్యవసాయ వర్సిటీసహా అన్నీ తెలంగాణకే
  • చంద్రబాబు వ్యాఖ్యలు.. 3వ పత్రం విడుదల
విజయవాడ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ‘భారతదేశ చరిత్రలో అనేక కొత్త రాష్ర్టాలు ఏర్పడినప్పటికీ ఇలాంటి పరిస్థితి చరిత్రలో ఎన ్నడూ రాలేదు. అడ్డగోలుగా విభజన చేశారు. ఆస్తులన్నీ తెలంగాణకు, అప్పులన్నీ ఏపీకి ఇచ్చారు. ఏది ఏమైనా విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఉమ్మడి రాజధాని విషయం నుంచి రెవెన్యూ లోటు వరకు అనేక అంశాలను ఈ నెల 20న ప్రధానితో సమావేశంలో చర్చిస్తా. కేంద్రం ఎలాంటి పరిష్కారాలు చూపిస్తుందో చూడాలి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం రాత్రి విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయన రాష్ట్ర విభజన అనంతర పరిస్థితులపై మూడో వివరణ పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విభజన చట్టం పూర్తి ఏకపక్షంగా జరిగింది. ఏపీకి అన్ని రకాలుగా అన్యాయం చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ రాజకీయ ప్రయోజనాలతో ఇష్టమొచ్చినట్లు విభజన చేసింది. ఇటలీ రిపబ్లిక్‌ డే రోజున రాష్ట్ర విభజన అపాయింట్‌మెంట్‌ డేగా ప్రకటించింది. కాంగ్రెస్‌ వైఖరి కారణంగా ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాల్సిన తెలుగు రాష్ర్టాల నడుమ అనేక వివాదాలు తలెత్తాయి. సమస్యలు ఉంటే ఏడాదిలోపు కూర్చుని మాట్లాడుకోమన్నారు. మేము చొరవ చూపినా తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాలేదు. అందుకే కేంద్రాన్ని ఒక పెద్దన్నలా విశాల దృక్పధంతో సమస్యలను సరిదిద్దమని కోరుతున్నాం. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందే వరకు కేంద్రం ఆదుకోవాలి’ అని పేర్కొన్నారు.
 
విభజన నష్టాలెన్నో..
విభజన వల్ల రాషా్ట్రనికి ఎన్ని నష్టాలు రావాలో అంతకన్నా ఎక్కువే వచ్చాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘యూపీఏ ప్రభుత్వం ప్రజలను అవమానించింది. పునాదుల నుంచి నిర్మించుకుంటే తప్ప నిలబడలేం. విభజన సమయంలో ఢిల్లీలో కూర్చున్నారు తప్పితే ఏపీకి వచ్చి ఎవరూ జరుగుతున్న అన్యాయంపై మాట్లాడలేదు. అసలు విభజన సమయంలో ఆంధ్రాను పరిగణనలోకి తీసుకోలేదు. ఆస్తులన్నీ తెలంగాణకు, అప్పులన్నీ ఏపీకి ఇచ్చారు. విభజనను ఓ శాసీ్త్రయత లేకుండా చేశారు’ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. విభజనకు తోడు 2004-14 మధ్య కాలంలో కాంగ్రెస్‌ చేసిన అవినీతి, అసమర్థ పాలన రాషా్ట్రన్ని కష్టాల్లోకి నెట్టిందన్నారు విభజన సమయంలో ఆస్తులు ప్రాంతాన్ని బట్టి, అప్పులను జనాభా ప్రాతిపదికన ఇవ్వడం వల్ల నష్టపోయామని చంద్రబాబు అన్నారు. దీంతో ఆస్తులు పోయినా.. అప్పులు చెల్లించగలిగే పరిస్థితి లేదన్నారు.
 
ఉమ్మడి రాజధానిపై గవర్నర్‌కే అధికారం
సెక్షన్‌-5, 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు, బాధ్యతలు ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో నివసించే ప్రజలకు ప్రత్యేక భద్రత కల్పించాల్సి ఉందన్నారు. ఏపీ ప్రజల ఆస్తులను కాపాడేందుకు గవర్నర్‌కు అన్ని అధికారాలు ఇచ్చారని, పదేళ్ల తర్వాత మాత్రమే హైదరాబాద్‌ తెలంగాణకు రాజధాని అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 15 నెలలు అవుతున్నా గవర్నర్‌ చట్టాన్ని అమలు చేయకపోవడంతో ఏపీని కించపరిచేలా తెలంగాణ చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో కట్టినవన్నీ తెలంగాణకే చెందుతాయని మొదలుపెట్టి ఇంటర్‌ బోర్డ్‌ అకౌంట్లను సీజ్‌ చేయడం వంటి పనులన్నీ చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ అధికారులను అవమానిస్తున్నారన్నారు. కమలనాథన్‌ కమిటీపై కూడా అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. విద్యుత్తు శాఖలో 1250 మంది ఉద్యోగులు కోర్టులో వేసినా నేటికీ దిక్కు లేకుండా పోయిందన్నారు. 371- డిపై స్పష్టత లేదని, కార్పొరేషన్‌ ఉద్యోగులు ఎలా ఉండాలో సెక్షన్‌- 10లో పేర్కొనలేదని, వీటి వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ మొదలుకుని హార్టీకల్చర్‌, బయో పెస్టిసైడ్‌ ల్యాబ్స్‌, వివిధ వర్సిటీలు తెలంగాణకు వెళ్లిపోయాయని, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 969 సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఏపీకి 309 మాత్రమే దక్కాయని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పైన ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఏపీని విమర్శిస్తోందన్నారు. రెండు రాషా్ట్రల మధ్యలో ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల ఆపరేషన్‌పై చర్చించకపోవడం వల్ల ఇప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ‘రాజధానినే వద్దన్న వారితో అఖిల పక్షం వేసి ఏం మాట్లాడాలి?’ అని ఆయన ప్రశ్నించారు.

No comments:

Post a Comment