|
కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు
ముసునూరు, ఆగస్టు 4: కృష్ణాజిల్లా ముసునూ రు తహసిల్దార్ డి.వనజాక్షికి... చంపుతామని బెదిరింపు లేఖ అందింది. దీంతో తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ఒక్కసారిగా కలకలం రేగిం ది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌రావు, వనజాక్షిల మధ్య జరిగిన ఇసుక వివాదం మరువకముందే... తాజాగా లేఖ చర్చనీయాంశమైంది.
బెదిరిపోను.. వెళ్లిపోను..
‘నేను ఈ లేఖలకు బెదిరిపోయి ఇక్కడ (ముసునూరు) నుంచి వెళ్ళను. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను. ఇటీవల ఒక వ్యక్తి తహసిల్దార్ కార్యాలయానికి వచ్చి ‘మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి... ఎమ్మెల్యే చింతమనేనితో మీకు పెద్ద తగాదా జరిగింది. మీరు ఉద్యోగం ఎలా చేస్తున్నారు’ అన్నాడు. అతనిపై సీరియస్ అయ్యాను. ఆ వ్యక్తి పనే అయి ఉంటుంది’ అని వనజాక్షి చెప్పారు. కాగా, తహసిల్దార్ ఫిర్యాదు మేరకు లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఎస్సై పి.విజయ్‌కుమార్ ముసునూరు పోస్టాఫీ్‌సకు వెళ్ళి ఈ లేఖపై ప స్ట్‌మాస్టర్ సత్యనారాయణను ప్రశ్నించారు.లేఖ సారాంశమిదీ.. ‘‘ఎమ్మార్వో గారు, ఇసుకరీచ్‌లో గొడవ జరిగిన 8వ రోజున మిమ్మల్ని చంపాలని మాకు సుపారీ ఇచ్చారు. మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి లేదా మిమ్ములను వదలం. రెండుదఫాలుగా మీ ఇంటికి వచ్చి రెక్కీ నిర్వహించాం. మీభర్త, పిల్లలను వదిలి మిమ్ములను చంపటానికి.... ప్లాన్ సిద్ధం చేశాం. ఇది బయటకు లీక్ చేస్తే మీకే.., పదిరోజుల్లో మీరు సర్దుకోండి, లేదా!’’ అని సి.ఎన్.టి.పి. అనే పేరుతో తహసిల్దార్‌కు ఈ లేఖ అందింది. కొంద రు ఇసుక అక్రమార్కులు ఈ పనికి ఒడిగట్టి ఉం డవచ్చనే అనుమానం రెవెన్యూ అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. దీనిపై తహసిల్దార్ డి.వనజాక్షి మంగళవారం కృష్ణాజిల్లా కలెక్టర్, ఎస్పీ, నూజివీ డు ఆర్డీవో, డీఎస్పీలకు ఫిర్యాదు చేస్తూ ముసునూరు పోలీ్‌సస్టేషన్‌లో కేసుపెట్టారు. |
No comments:
Post a Comment