Saturday, 29 August 2015

ప్రత్యేక హోదాపై చంద్రబాబు తన వైఖరి చెప్పట్లేదు : జగన్‌

ప్రత్యేక హోదాపై చంద్రబాబు తన వైఖరి చెప్పట్లేదు : జగన్‌
Updated :29-08-2015 18:01:02
విజయవాడ, ఆగస్టు 29 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాడు తన వైఖరి తేల్చడం లేదని ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ప్రత్యేక హోదా వస్తే 90శాతం గ్రాంటు, 10శాతం రుణం వస్తుందని, అయితే... ప్రత్యేక ప్యాకేజీనే మేలని ప్రజలను టీడీపీ నేతలు మభ్యపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాతో ప్రతి జిల్లాను హైదరాబాద్‌లా తయారు చేయవచ్చని, ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చంద్రబాబును నిలదీస్తామన్నారు. ఎన్నికలకు ముందు ఐదేళ్లు కాదు.. పదేళ్లపాటు ప్రత్యేక హోదా కావాలన్న నేతలు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని, అసలు 14వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదాతో సంబంధం లేదని, ప్రత్యేక హోదా దాని పరిధిలోకి రాదని, ప్రత్యేక హోదా అంశం ప్రధాని చేతుల్లోనే ఉందన్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ అనుసరిస్తున్న విధానానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ తన మద్దతును విరమించుకోవాలన్నారు. శనివారం జరిగిన బంద్‌ను విఫలం చేసేందుకే కేబినెట్‌ భేటీ పెట్టారని, అయినా... బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించారని వీరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

No comments:

Post a Comment