న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 : పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా లేనట్టే అని కేంద్రం తేల్చేసింది. శుక్రవారం లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు సంబంధించిన ఎంపీలు కొత్తప్రభాకర్‌రెడ్డి, మాగంటిబాబు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రత్యేక హోదాపై ఆశలు వదులుకోవచ్చని ప్రణాళికశాఖ మంత్రి రావుఇంద్రజిత్‌సింగ్ స్పష్టం చేశారు.
ఇప్పటికే 11 (అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, మణిపూర్,మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్,సిక్కిం, త్రిపుర, ఉత్తారాఖండ్)కు అప్పటి ఎన్డీసీ ప్రత్యేక హోదా ఇచ్చిందన్నారు. ప్రత్యేక హోదాకు ఇచ్చేందుకు కావాలసిన ఐదు అర్హతలను ఈ సందర్భంగా ఇంద్రజిత్ ప్రస్తావించారు. 14 ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత ఏ రాష్ర్టానికీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఆయన తేల్చేశారు.
14వ ఆర్థిక సంఘం సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం గత బడ్జెట్‌లో పలు కేంద్ర పథకాలను ఉపసంహరించుకుందని, కేంద్రం ఇచ్చే నిధులను తగ్గించిందన్న విషయాన్ని ఇంద్రజిత్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా పొందిన 11 రాష్ర్టాలు కూడా బయటనుంచి ఆర్థిక సాయం పొందే పథకాలకు కేంద్రం 90 శాతం నిధులను అందజేస్తుందని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ, తెలంగాణ నుంచి అభ్యర్థనలు అందాయన్న విషయాన్ని ఇంద్రజిత్ చెప్పారు. ఈ క్రమంలో 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇక ఏ రాష్ర్టానికీ ప్రత్యేక హోదా దక్కదని కేంద్రం సుస్పష్టం చేసింది.
ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని అందరూ ఎదురుచూస్తున్న నేపథ్యంలో రావు ఇంద్రజిత్ ఇచ్చిన సమాధానం నిరాశనే మిగిల్చింది. ఇటీవల ఏపీ భవన్‌లో టీడీపీపీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ఇచ్చేట్టు లేదన్నారు. ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ నిధులు ఇచ్చేందుకు కేంద్రం మొగ్గు చూపిస్తోందనీ, అయినప్పటికీ ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గేది లేదని ఆ విషయాన్ని కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించాలని ఎంపీలకు చంద్రబాబు ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామిక ప్రగతి వేగవంతం అవుతుందని తద్వారా ఉపాధి హామీ జరుగుతుందని, ఎన్నో వేల ఉద్యోగాలు వస్తాయని అందరూ భావించినప్పటికీ, ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ చరిత్రలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది.
http://www.sakshi.com/news/andhra-pradesh/no-special-status-to-ap-arun-jaitly-conformed-242471
అరుణ్ జైట్లి మే 24, 2015
14వ ఆర్ధిక సంఘం.
ప్రత్యేక హోదా లేనట్టే
April 25, 2015 at 12:00 am
న్యూఢిల్లీ : తెలంగాణకు ప్రత్యేక హోదాపై ఏ మేరకు కేంద్రం పురోగతి సాధించిందో తెలపాలంటూ లోకసభలో టిఆర్‌ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాగంటి బాబు కూడా ఇదే సమాధానాన్ని కేంద్రం నుంచి కోరారు. వీరి ప్రశ్నలకు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ.. ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిషా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కోరాయని చెప్పారు. ఎత్తైన పర్వత ప్రాంతాలతో సేద్యానికి ఏమాత్రం అనువుకాని రాష్ట్రాలకు… అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ….ఆర్థికంగా వెనుకబడి, మౌలిక సదుపాయాలకు బొత్తిగా లేని రాష్ట్రాలకు … ఇతర దేశాలకు సరిహద్దుల్లో ఉండే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా గతంలో ఇచ్చారని చెప్పారు. ఈ విధివిధానాల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్ము కాశ్మీర్, మణిపూర్ మేఘాలయ మిజోరాం, మేఘాలయ, నాగాల్యాండ్, సిక్కిం. త్రిపుర.ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రత్యేక హోదా లభించిందని పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ష్ట్రాలకు ప్రత్యేక హోదాతో లేదా వేగవంతమైన అభివద్ధి కోసం పన్నురాయితీలు ప్రకటించాలని కోరిన నేపథ్యంలో 2015 బడ్జట్‌లో ఈ ఏప్రిల్ ఒకటి నుంచి 2020 మార్చి 30 లోపు వెనుకబడిని ప్రాంతాల్లో నెలకొల్పే పరిశ్రమలకు 15 శాతం పన్ను రాయితీలు ఇవ్వడంతో పాటు యంత్రాల తరుగుదలలో ముప్పై శాతం కేంద్రమే భరించే విధంగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయని వివరించారు.
http://www.manatelangana.org/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95-%E0%B0%B9%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE-%E0%B0%B2%E0%B1%87%E0%B0%A8%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%87/
ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వం.. మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ : ప్రేక్షక పాత్రలో ఏపీ ఎంపీలు
శుక్రవారం, 31 జులై 2015 (14:02 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కడం ఎండమావిగామే మారనుంది. కొత్తగా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ తేటతెల్లం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం లోక్‌సభలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
అంతేకాకుండా, బీహార్ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని, ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారని గుర్తుచేశారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా అసాధ్యమని తేలిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు శరాఘాతంగా మారనున్నాయి.
ఒకవైపు లోక్‌సభ సాక్షిగా మంత్రి ఇంద్రజిత్ సింగ్ ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేస్తున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు మాత్రం ప్రేక్షకుల్లా మిన్నకుండిపోయారు. మంత్రి వ్యాఖ్యలను ఏమాత్రం ఖండించడం లేదా... సభలో నిరసన వ్యక్తం చేయడం వంటి చర్యలు చేయకుండా ప్రేక్షకుల్లా సభలో మిన్నకుండి పోవడం గమనార్హం.
‘హోదా’ లేదన్నది బీహార్ గురించే! ఏపీకి న్యాయం చేస్తాం: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (03-Aug-2015) | |
|
న్యూఢిల్లీ, హైదరాబాద్, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ర్టాలకూ న్యాయం చేస్తామని, విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలనూ నెరవేరుస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆదివారం ఆమె బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇకపై ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ లోక్‌సభలో కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ బీహార్ రాష్ట్రాన్ని ఉద్దేశించి చెప్పారని వివరించారు. ఈ వ్యాఖ్యలను ఏపీకి వర్తింప చేయొద్దని, ప్రజల్ని అయోమయానికి గురిచేయొద్దని సూచించారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై మాట మార్చిన అధికార బీజేపీని పార్లమెంటులో ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సోనియా అధ్యక్షతన సోమవారం జరిగే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో దీనిపై చర్చించనున్నట్లు కాంగ్రెస్ ఏపీ ఎంపీలు చెప్పారు. అనంతరం, రాహుల్‌తోనూ తాము ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు తెలిపారు.
ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఉండదు.. లోక్‌సభలో కేంద్రం ప్రకటన.. నోరెత్తని ఏపీ ఎంపీలు (01-Aug-2015) | |
|
న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలోని ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు. అటువంటి ప్రతిపాదనలు ఏవీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద లేవు. అలా ఇచ్చే విధానం కూడా ఏదీ లేదు’’ అని కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లోక్‌సభలో తేల్చి చెప్పారు. టీఆర్‌ఎస్ సభ్యుడు బీబీ పాటిల్, బీజేపీ సభ్యుడు విష్ణుదయాళ్ రామ్ ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నలపై శుక్రవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రావు ఇంద్రజిత్ మాట్లాడుతూ.. గతంలో ప్రత్యేక హోదా వివిధ రాషా్ట్రలకు అమలయ్యేదని, అయుతే, దానికి బదులు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా పెంచాలన్న 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదనల్ని కేంద్రం యథాతథంగా ఆమోదించి అమలు చేస్తోందని చెప్పారు. అందువల్ల, ఇప్పుడు ఏ రాషా్ట్రనికీ ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని తెలిపారు. దీనిపై బీజేడీ ఎంపీ తథాగత స్తపతి స్పందిస్తూ.. నీతి ఆయోగ్ వద్ద రూ.20 వేల కోట్లు ఉన్నా.. వాటిని వినియోగించటం లేదని ఆరోపించారు. ఒడిశాకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రూ.8300 కోట్లు వచ్చేవని, వాటిని రద్దు చేసి పన్నుల్లో వాటా పెంచడంతో ఆ మొత్తం రూ.5000 కోట్లు అయిందని, మొత్తంగా ఒడిశాకు రూ.3,300 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ మొత్తాన్ని రీయింబర్స్ చేయాలని కోరారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ.. పన్నుల వాటాలు పెంచామని, అయినా ఏ రాష్ట్రానికైనా నష్టం వాటిల్లితే ఆ మొత్తాలను రీయింబర్స్ చేసే విధానాన్ని కేంద్రం అనుసరించటం లేదన్నారు. అయినా, ఆయా రాష్ట్రాలు తమ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వస్తే పరిశీలిస్తామని చెప్పారు. బీహార్‌కు చెందిన ఆర్జేడీ సభ్యుడు పప్పూ యాదవ్ మాట్లాడుతూ.. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. దాంతో, ‘‘బీహార్, ఒడిశా సహా పలు రాషా్ట్రలు ప్రత్యేక హోదా కోరుతున్నాయి. అయితే, ప్రత్యేక హోదా ఇచ్చే విధానం ఇప్పుడు కేంద్రం వద్ద లేదు. బీహార్ సహా పలు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం’’ అని మంత్రి ఇంద్రజిత్ వివరించారు. దీంతో, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల సభ్యులు అనుబంధ ప్రశ్నలు సంధించారు. కాగా, ఈశాన్య రాష్ట్రాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రత్యేక హోదాను ఉపసంహరించే ప్రతిపాదన ఏదీ లేదని, అయితే, ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కింద ఇచ్చే నిధుల్లో మాత్రం తేడా ఉంటుందని మంత్రి చెప్పారు.
స్పందించని ఏపీ సభ్యులు వాస్తవానికి, ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు వచ్చే ‘స్టార్ ప్రశ్నల’ జాబితా, వాటి సమాధానాలను ఎంపీలందరికీ ముందుగానే వారి వారి నివాసాలకు లోక్‌సభ సెక్రటేరియెట్ పంపిస్తుంది. తద్వారా ఆయా ఎంపీలు తమకు నచ్చిన ప్రశ్నకు అనుబంధంగా ప్రశ్నలు వేసేందుకు ఆస్కారం లభిస్తుంది. ఆయా ప్రశ్నల తీవ్రతను బట్టి, సమయాన్ని బట్టి, స్పీకర్ విచక్షణాధికారాన్ని బట్టి ఎంతమంది సభ్యులకైనా అనుబంధ ప్రశ్న వేసే అవకాశం లభిస్తుంది. అయితే, ప్రత్యేక హోదా ప్రశ్నపై చర్చ జరుగుతుండగా టీడీపీ లోక్‌సభాపక్ష నాయకుడు తోట నరసింహం, బీజేపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి సభలోనే ఉన్నారు. అయినా, వారెవరూ దీనిపై అనుబంధ ప్రశ్నలు వేయలేదు. ప్రత్యేకహోదా కోరుతూ గత వారం పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ధర్నా చేయగా, ఆగస్టు 10వ తేదీన జగన్ జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తానని ప్రకటించిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం.
|
|
కేంద్రం చెప్పింది బీహార్ గురించంట
Mon Aug 03 2015 09:58:12 GMT+0530 (IST)
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చిత్రమైన వాదనను వినిపించారు. చెవిలో పువ్వులు పెడితే ఇట్టే నమ్మేసే ఆంధ్రోళ్ల మనసులు సేద తీరేలా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏదో జరగనుందని ఆశ పెడుతూ బుజ్జగించేలా మాట్లాడారు. మాటలతో మాయపుచ్చే ప్రయత్నం చేశారు
ప్రత్యేక హోదా విషయంపై.. ఈ మధ్యన కేంద్రమంత్రి పార్లమెంటులో సమాధానం ఇస్తూ.. ఇప్పటికిప్పుడు దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన లేదని.. అలాంటి ఆలోచన కేంద్రం చేయటం లేదని తేల్చి చెప్పేయటం తెలిసిందే.
దీనిపై ఏపీలోని ప్రజలు.. రాజకీయ పక్షాలు తీవ్రస్థాయిలో మండి పడటం తెలిసిందే. ఎవరికి వారు.. పోరాటాలు చేయటానికి సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో బీజేపీ నేతల్ని సొంత నేతలే ప్రశ్నించే పరిస్థితి.
ఇదిలా ఉంటే తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. కేంద్రం చెప్పిన మాటలు బీహార్ కు సంబంధించినవని.. ఏపీకి ఏ మాత్రం సంబంధం లేదని నమ్మ బలికారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యలయంలో మాట్లాడిన ఆమె.. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం లేదన్న కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ మాటలకు కొత్త భాష్యం చెప్పే ప్రయత్నం చేశారు
మంత్రిగారు చేసిన వ్యాఖ్యలన్నీ బీహార్ ను ఉద్దేశించిన చెప్పినవే తప్పించి.. ఆంధ్రాకు దాంతో సంబంధం లేదని.. అనవసరంగా ఏపీ ప్రజల్ని అయోమయానికి గురి చేయొద్దని వ్యాఖ్యానించటం గమనార్హం. మొత్తానికి ఏపీ ప్రజలకు మరోసారి తన మాటలతో పువ్వులు పెట్టేందుకు నిర్మలమ్మ చాలానే ప్రయత్నం చేశారన్న విమర్శ వినిపిస్తోంది.
Special Category status and centre-state finances
April 12th, 2013VishnuLeave a commentGo to comments
“No one can ignore Odisha’s demand. It deserves special category status. It is a genuine right,” said Odisha Chief Minister, Naveen Patnaik, earlier this month. The Odisha State assembly has passed a resolution requesting special category status and their demands follow Bihar’s recent claim for special category status.
The concept of a special category state was first introduced in 1969 when the 5th Finance Commission sought to provide certain disadvantaged states with preferential treatment in the form of central assistance and tax breaks. Initially three states Assam, Nagaland and Jammu & Kashmir were granted special status but since then eight more have been included (Arunachal Pradesh, Himachal Pradesh, Manipur, Meghalaya, Mizoram, Sikkim, Tripura and Uttarakhand). The rationale for special status is that certain states, because of inherent features, have a low resource base and cannot mobilize resources for development. Some of the features required for special status are: (i) hilly and difficult terrain; (ii) low population density or sizeable share of tribal population; (iii) strategic location along borders with neighbouring countries; (iv) economic and infrastructural backwardness; and (v) non-viable nature of state finances. 1 The decision to grant special category status lies with the National Development Council, composed of the Prime Minster, Union Ministers, Chief Ministers and members of the Planning Commission, who guide and review the work of the Planning Commission.
In India, resources can be transferred from the centre to states in many ways (see figure 1). The Finance Commission and the Planning Commission are the two institutions responsible for centre-state financial relations.
http://www.thehindu.com/news/national/andhra-pradesh/special-category-status-is-the-new-catch-phrase/article5735730.ece
‘Special Category Status’ is the new catch phrase
VIJAYAWADA, February 28, 2014
Updated: February 28, 2014 11:57 IST
SUMIT BHATTACHARJEE
At present there are 11 States that enjoy Special Status and Special Category Status
Till a few days ago, words such as ‘Samaikyandhra’ and ‘integrationist’ were the buzzwords in Andhra Pradesh politics. But, now ‘Special Category Status’ appears to be the catch phrase.
Prime Minister Manmohan Singh, former BJP president Venkaiah Naidu, and TRS leader K. Chandrsekhar Rao and Congress leader Jairam Ramesh seem to be using the term with reference to Seemandhra or Telangana.
Is this the new carrot that is being dangled by the Congress for the people of both the regions? Former Rajya Sabha Member Yelamanchili Sivaji feels so. He believes that the cause for an united Andhra Pradesh has been defeated and now the Congress is trying to win back confidence and woo the voters in coming elections by propagating the ‘Special Category Status’ and even BJP is also singing the same tune.
What is special category status?
Huge difference
First let’s clear the air between the terms ‘Special Status’ and ‘Special Category Status’. There is a huge difference between them, said Seemandhra Advocates JAC convenor M. Jayakar.
Special status is guaranteed by the Constitution of India through an Act passed by the two-third majority in both houses of the Parliament, as in the case of Jammu and Kashmir, whereas Special Category Status is granted by the National Development Council, an administrative body of the government. While Special Status empowers legislative and political rights, Special Category Status deals only with economic, administrative and financial aspects.
At present there are 11 States that enjoy Special Status and Special Category Status: Arunachal Pradesh, Assam, Himachal Pradesh, Jammu and Kashmir, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Sikkim, Tripura and Uttarakhand.
Difficult proposition
The NDC bestows Special Category Status based on certain parameters such as low resource base, hilly and difficult terrain, low population density or sizeable share of tribal population and strategic (hostile) location, in which case neither Seemandhra nor Telangana qualifies. Bihar’s repeated plea for Special Category Status was rejected on the ground of backwardness, said Mr. Jayakar. The business community seems to be accepting the status as it would empower the State to get central aid up to 90 per cent.
Keywords: Andhra Pradesh politics, Special Category Status, Special Status
|
|
|
No comments:
Post a Comment