|
కోచి (ఆగస్ట్ 13): మన దేశంలో ఒక ఎకరం పొలం కొనాలంటే దాదాపు పది లక్షలు పట్టుకోవాల్సిందే. అదే ఆఫ్రికాలో అయితే భూమి వెల చాలా చౌక. అందుకే అక్కడ పంటలు పండించి ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. భారత కంపెనీలకు ఇప్పుడు ఆఫ్రికా దేశాలు ఇప్పుడు కామధేనువులు. డ్యూటీ ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ (డీఎప్‌టీపీ) పథకంతో భారత కంపెనీలు పండుగ చేసుకుంటున్నాయి. ఈ విధానంతో ఇప్పుడు ఆఫ్రికాలోని 34 దేశాల్లో భారత కంపెనీలకు భారీ రాయితీలు లభిస్తున్నాయి.
అంతగా అభివృద్ధి చెందని ఆఫ్రికా ఖండంలో భారీ స్థాయిలో పంట భూములు లభ్యమవుతాయి. అక్కడ ఒక హెక్టార్ భూమి (దాదాపు 2.5 ఎకరాలు) విలువ ఒక డాలర్ కంటే తక్కువగానే ఉంటుంది. పైగా అక్కడ లేబర్ కూలీ కూడా చాలా తక్కువ. దీంతో అక్కడ పండించి భారత్‌కు దిగుమతి చేసేందుకు చాలా మంది పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. అయితే అక్కడి భూముల్లో సారం చాలా తక్కువ. ఒక హెక్టార్ భూమిలో భారత్‌లో 500-700 కిలోల వరి పండితే.. ఆఫ్రికాలో 250 కేజీలు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అయినప్పటికీ భారత్‌లో కంటే అక్కడ పండించడం లాభదాయకమే అవుతోంది.
ఆఫ్రికాలోని ఇథియోపియా, కెన్యా, రవాండ, ఉగాండ, టాంజానియా వంటి దేశాల్లో ఎల్&టీ, షాపూర్జీ పాల్లొంజీ గ్రూపు వంటి సంస్థలు భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టాయి. అక్కడి భూముల్లో జీడి పప్పు, పత్తి, రబ్బరు, కాఫీ వంటి పంటలను భారీ స్థాయిలో పండిస్తూ లాభాలను గడిస్తున్నాయి పలు భారత కంపెనీలు.
|
No comments:
Post a Comment