Sunday 30 August 2015

రెడ్లకు కోచింగ్‌ ఇస్తే 10 లక్షలిస్తా: జేసీ దివాకర్‌రెడ్డి

రెడ్లకు కోచింగ్‌ ఇస్తే 10 లక్షలిస్తా: జేసీ దివాకర్‌రెడ్డి
Updated :31-08-2015 02:02:38
 రెడ్లలోనూ పేదలు.. చేయూతనివ్వాలి: తెలంగాణ హోం మంత్రి నాయిని 
 
రవీంద్రభారతి/హైదరాబాద్‌, ఆగస్టు 30: పేద రెడ్డి విద్యార్థులను రెడ్డి సంఘాలు, ఉన్నత స్థానంలో ఉన్న వారు ఆదుకోవాలని, వారికి సరైన శిక్షణ ఇప్పిస్తూ మంచి ర్యాంకు వచ్చేలా ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. రెడ్డి అభ్యర్థుల కోసం ఎవరైనా కోచింగ్‌ సెంటర్‌ పెడితే తన వంతుగా రూ.10 లక్షలు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌ రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన రెడ్డి అభ్యర్థులను ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అభినందించారు. రెడ్డి సామాజికవర్గం అనగానే అగ్రవర్ణంగా చిత్రీకరించారని, వీరిలో కూడా పేదలు ఉన్నారని నాయిని చెప్పారు. రెడ్డి రాజుల కాలంలో గొలుసు చెరువులు ఉండేవని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మిషన్‌ కాకతీయతో వాటిని తిరిగి అభివృద్ధి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘం అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారి అజయ్‌కల్లాం, మెట్రోరైల్‌ ఎండీ ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి మాట్లాడుతూ నిరుపేద రెడ్డి అభ్యర్థులకు నిత్యం అండగా ఉంటామన్నారు.

No comments:

Post a Comment