Friday 7 August 2015

ఆగస్టు 10న ప్రత్యేక హోదా కోసం ఢిల్ళీలో జగన్‌ దీక్ష

ప్రత్యేక హోదా కోసం జగన్‌ దీక్ష

హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌ : ఏపికి ప్రత్యేక హోదా విషయంలో ఇన్నాళ్లపాటు కేంద్రానికి వినతులతో సరిపెట్టుకొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇక కన్నేరజేయాలని నిర్ణయించుకొంది. ఏపికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆగస్టు 10వ తేదీన ఢిల్లీలో జంతర్‌మంతర్‌వద్ద ధర్నా చేయాలని నిర్ణయించింది. గురువారంనాడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏపికి ప్రత్యేక హోదా విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించుకొన్నట్లు తెలిసిం ది. ఈ నేపథ్యంలో ఆగస్టు 10వ తేదీన ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించారు. ఈ ధర్నాలో వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డితోపాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటారు.


ఢిల్లీ వేదికగా ఆగస్టులో జగన్ దీక్ష

వైసీపీ అధినేత జగన్ మరోసారి దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఢిల్లీలోనే దీక్ష చేయాలని నిర్ణయించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష చేయనున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 10న లేకుంటే 15 తరువాత గానీ జంతర్‌మంతర్ వద్ద జగన్ దీక్ష చేసే అవకాశం ఉంది. ఏడాదిగా ప్రత్యేక హోదాపై పోరాడుతున్నా కేంద్రం నుంచి కనీస స్పందన లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రత్యేక హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదనీ, అదే ఉంటే మంత్రివర్గం నుంచి ఎందుకు తప్పుకోవడం లేదని ప్రశ్నిస్తోంది. 
రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు మోసాలు ఇప్పటివి కాదనీ, నాడు ఎన్టీఆర్‌కు, నేడు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికలు ఇప్పట్లో వస్తే టీడీపీ బంగాళాఖాతంలో కలవడం ఖాయమని జోస్యం చెప్పారు. 67 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు, వేలాది మంది కార్యకర్తలతో ఢిల్లీలో దీక్ష చేస్తామని జగన్ హెచ్చరించారు. 



ఆగస్టు 10న జంతర్ మంతర్ వద్ద జగన్ ధర్నా



హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆగస్టు 10న దీక్ష చేయనున్నారు. గురవారం జరిగిన వైసీపీ పొలిటికల్‌ ఎఫ్ఫైర్స్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

No comments:

Post a Comment