Tuesday 18 August 2015

హోదానో.. ప్యాకేజీనో.. నిధులైతే తెస్తాం - మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి

హోదానో.. ప్యాకేజీనో.. నిధులైతే తెస్తాం

మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
శ్రీకాళహస్తి, ఆగస్టు 17: ప్రత్యేక హోదానా.. ప్రత్యేక ప్యాకేజీనా అనేది కాకుండా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెప్పించడానికి సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నా రు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తెప్పిస్తామని స్పష్టంచేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సోమవారం జరిగిన టీడీపీ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం కోరుతున్నామన్నారు. రాజధానికోసం చేస్తున్న భూసమీకరణను కొందరు వ్యతిరేకించ డం బాధాకరమన్నారు. రైతులే స్వచ్ఛదంగా ముందుకొచ్చి రాజధాని నిర్మాణానికి భూములిస్తున్నారని మంత్రి స్పష్టంచేశారు. దీనికి వ్యతిరేకంగా కొందరు ధ ర్నాలు చేయడం అర్థరహితమన్నారు. తనపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇక పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి టీడీపీని విమర్శించడం అర్థరహితమన్నారు.ప్రత్యేక హోదా పేరుతో అమాయకులను రెచ్చగొట్టడం మంచిది కాదని హితవు పలికారు. బలిదానాలతో ప్రత్యేక హోదా రాదన్నారు. కేంద్రంతో చర్చించి.. ఒప్పించి నిధులు విడుదల చేయించుకుంటామని బొజ్జల ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనున్న మంచి సంబధాలను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
 
జగన్‌కు గొడవ ఉండాల్సిందే వైసీపీ అధినేత జగన్‌ది క్రిమినల్‌ మైండ్‌ అని, ప్రతిపక్ష నేతగా అతడు అనర్హుడని మంత్రి బొజ్జల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనకు నిత్యం ఏదో ఒక గొడవ ఉండాల్సిందేనన్నారు. గోదావరి నది నుంచి వృథాగా పోతున్న సుమారు 50 టీఎంసీల నీటిని పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ‘సీమ’ జిల్లాలకు మళ్లించడాన్ని జగన్‌ వ్యతిరేకించడం బాధాకరమన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను ఆయన రెచ్చగొడుతున్నారని విమర్శించారు. దీనివల్ల ప్రాంతీయ విద్వేషాలు రగిలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘పట్టిసీమ’వల్ల పడమట మండలాలకు నీటి సమస్య తీరుతుందని మంత్రి అన్నారు.

No comments:

Post a Comment