|
హైదరాబాద్, ఆగస్టు 19 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో రేపటి(గురువారం) ఏపీ సీఎం చంద్రబాబు భేటీ వాయిదా పడింది. అనివార్య కారణాల రేపు సమయం ఇవ్వలేకపోతున్నామని ప్రధాని కార్యాలయం నుంచి ఏపీసీఎంవోకు లేఖ అందింది. ఈనెల 25 లేదా 28, 29,31 తేదీల్లో ఏ రోజు వీలైతే ఆరోజు అపాయింట్‌మెంట్ ఇస్తామని పీఎంవో తెలిపింది. ఈ నాలుగు రోజుల్లో ప్రధానితో అపాయింట్‌మెంట్‌కు సంబంధించి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
వాస్తవానికి రేపు సాయంత్రం 4 గంటలకు మోదీతో చంద్రబాబు సమావేశం కావాల్సి ఉంది. ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా డిమాండ్‌తో పాటు ఏపీకి ఆర్థిక లోటు, పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై ప్రధానితో బాబు చర్చించేందుకై అపాయింట్‌మెంట్ ఖరారు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అధికారులతో సైతం చంద్రబాబు సమావేశమై రేపు ప్రధానికి ఇవ్వాల్సిన ప్రజెంటేషన్‌పై ఇప్పటికే కొంత కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.
బీహార్‌కు ప్రధాని భారీగా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో ఏపీ విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో రేపటి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ప్రధానితో భేటీ వాయిదా పడటంతో ఆ నాలుగు తేదీల్లో అపాయింట్ ఖరారు అయి ఇరువురు సమావేశమైన అనంతరమే ఏపీకి కేంద్రం నుంచి అందే సహాయసహకారాలపై స్పష్టత వచ్చే అవకాశం కన్పించడంలే
|
No comments:
Post a Comment