Monday, 17 August 2015

నా వ్యతిరేకులంతా రాక్షసులే.. కేసీఆర్ పిట్ట కథ

వ్యతిరేకులంతా రాక్షసులే.. కేసీఆర్ పిట్ట కథ

వరంగల్‌, నర్సంపేట, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మంచి పనులు తలపెట్టినప్పుడల్లా అడ్డుకునేవాళ్లు ఉంటారని, వాళ్లని అధిగమించి ముందుకు సాగాలని గ్రామ జ్యోతి కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఈ సందర్భంగా పిట్ట కథ ఒకటి చెప్పారు. ‘‘రామాయణం మనందరికీ తెలిసిందే కదా.. రావణుడు సీతను ఎత్తుకుపోయినప్పుడు యుద్ధంలో రాక్షస సైన్యం ముందు వానర సైన్యం నిలవలేకపోయింది. దీంతో, అంతా సమాలోచన చేసి శ్రీరాముడితో ‘ఇక లాభం లేదు. మీరు రామబాణం వదలాల్సిందే’ అన్నారట. నిజమే కానీ, రామబాణం ధాటికి అంతా చనిపోతారని రాముడు ఆలోచించాడట. అయితే, ‘మన వానర సైన్యం తీవ్రంగా నష్టపోయింది. ఇట్లయితే మనకు సీతమ్మ దక్కదు’ అని మిగిలిన వాళ్లు అన్నారట. తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీరాముడు రామబాణం వదిలాడట. దీంతో, రావణాసురుడితోపాటు రాక్షస జాతి అంతా చనిపోయిందట. సీతను తీసుకుని వెళుతున్న సమయంలో.. అర్ధాయుష్షుతో చనిపోయిన రాక్షసులంతా ‘మీ రామబాణం వల్లే మాకు ఈ గతి పట్టింది. మా పరిస్థితి ఏమిటి?’ అని రాముడితో మొర పెట్టుకున్నారట. దాంతో ఏం ఫర్వాలేదు.. కలియుగంలో మీరు ఊరికి ఒక్కరో ఇద్దరో పుడతారు.. అప్పుడు జనాన్ని హాయిగా పీక్కుతింటారు అని చెప్పారట. ఇప్పుడు అ న్నిటినీ వ్యతిరేకించే వాళ్లంతా గా రాక్షస సంతతే’’ అ ని కేసీఆర్‌ వ్యాఖ్యానించినప్పుడు నవ్వులు విరిశాయి.

No comments:

Post a Comment