అర్రా, ఆగస్టు 18 : బీహార్ రాష్ర్టానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపించింది. మంగళవారం బీహార్‌లో పర్యటించిన ఆయన 1.25 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఆర్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ బీహార్ భవిష్యత్తును తన ప్రభుత్వం మార్చేస్తుందని ఉద్ఘాటించారు.
బీహార్ అభివృద్ధి చెందితే ఎక్కువగా ఆనందించేది తానే అని ఆయన అన్నారు. దళితుల అభ్యుదయం కోసి కృషి చేసిన వ్యక్తిని బీహార్ గవర్నర్‌గా నియమించామని మోదీ తెలిపారు. బీహార్ పర్యటనలో మోదీ పలు అభివృద్ధి కార్యాక్రమాలకు శంకుస్థాపన చేశారు. 11 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులను ప్రారంభించారు. 25 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే 23 స్కిల్ ట్రైనింగ్ సెంటర్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
No comments:
Post a Comment