Monday, 31 August 2015

Apples in Araku Valley of Andhra

CCMB may grow apples in Araku Valley of Andhra Pradesh soon

Raji Reddy Kesireddy, ET Bureau Jan 18, 2014, 05.27AM IST
(CCMB may grow apples in Araku…)
YDERABAD: While the Greek hero Hercules wanted to possess the fruit desperately, Adam - the first man in Abrahamic religions - apparently couldn't resist eating it and was then desperate. Whatever the reasons, few fruits have enjoyed the clout of apple, one of the oldest cultivated trees on Earth.
In India, its farming has so far been limited mostly to the Himalayan region - Kashmir, Himachal Pradesh and Uttarakhand as well as pockets of the North East. But if scientists at Hyderabad's Centre for Cellular and Molecular Biology (CCMB) have their way, they could soon be grown in Araku Valley of Andhra Pradesh.
For some time now, the changing climatic conditions in the Himalayan region have been hurting apple production, forcing scientists to look for alternatives. Know as the Kashmir of Andhra Pradesh, Araku is blessed with a temperate climate and low temperatures that is suited for growing apples; at least, in theory.
Situated at about 3,600 feet above the sea level, the Araku Valley area records temperatures of 1-5 degrees centigrade during winters. "Since apples are grown at high altitude areas with low temperatures in winters, we hope the locations in the Araku valley area that we chose for the experiment will yield positive results over the next four-five years," said Ramesh Aggarwal, who heads a team of CCMB scientists working on the project.
The CCMB scientists are exploring the prospects of growing the fruit - which originated in the Central Asian region, most likely Kazakhstan - in the Lambasingi and Chintapally regions of Araku in Andhra Pradesh's Visakhapatnam district.
The scientists began work a few years ago to develop new breeds that are resistant to changing climatic conditions while ensuring high yields as part of a genomics sequencing project sponsored by the Department of Biotechnology. They hope to identify genes that give the plant characteristics such as disease and drought resistance. Today there are more than 7,500 varieties of apples grown worldwide, of which at least 300 are cultivated in India commercially. It is said that Alexander the Great first brought the dwarf varieties to Europe (Macedonia) in the fourth century BC, from where it found its way to the rest of the world.
Aggarwal said his team recently visited Araku valley and held discussions with local farmers, non-governmental organisations and researchers to explore growing apples there. If the Araku experiment succeeds, the scientists plan to replicate it in other hilly regions of the South, including the Nilgiris in Tamil Nadu and Coorg in Karnataka.
"To begin with, we will experiment with some 100 saplings of seven leading apple varieties by this month end and increase the number of plants to around 500 over the next one year," said Aggarwal.
In India, the fifth-largest producer of the fruit worldwide, apples were first grown only towards the end of the 19th Century. But it was Samuel Evans Stokes, or Satyananda Stokes as he was later known, who introduced apple cultivation to Himachal Pradesh in the early part of the last century.   Today, it is the major horticultural export crop of the state.
The CCMB scientists are sourcing the saplings of apple variants from Dr YS Parmar University of Horticulture and Forestry at Solan in Himachal Pradesh.
Senior principal scientist at CCMB, A Veerabhadra Rao said studies showed that the climate of Chintapally region was identical to California and Florida in the United States, where apple is grown on a large scale.

Sunday, 30 August 2015

విభజన బిల్లును ఆమోదించినప్పుడు జగన్ ఎక్కడ దాక్కున్నారు: చంద్రబాబు

విభజన బిల్లును ఆమోదించినప్పుడు జగన్ ఎక్కడ దాక్కున్నారు: చంద్రబాబు
Updated :31-08-2015 11:59:47
హైదరాబాద్, ఆగస్టు 31: ప్రత్యేక హోదా కోసం చనిపోయిన వారి మృతుల కుటుంబాలకు ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఈ తీర్మానంపై మాట్లాడిన జగన్ ప్రత్యేక హోదా కోసం జరిగిన బలిదానాలకు కారణం టీడీపీ, బీజేపీలేనని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేత ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదన్నారు.వైసీపీ రాజకీయాల వల్లే రాష్ట్రం తగలబడిందని చంద్రబాబు ఆరోపించారు. బెయిల్ కోసం కాంగ్రెస్‌తో లాలూచీ పడింది జగనేనని, తమకు ఎలాంటి లాలూచీలతో పనిలేదని చంద్రబాబు తెలిపారు. కేసుల కోసం కాంగ్రెస్‌తో లాలూచీ పడి రాష్ట్రాన్ని విభజించిన పాపం వైయస్సార్ పార్టీదేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. జనం తమపై నమ్మకంతో అధికార పీఠంపై కూర్చోబెట్టారని అన్నారు. పార్లమెంట్‌లో విభజనపై చర్చ జరుగుతున్నప్పడు జగన్ ఎక్కడ దాక్కున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై 15నెలలుగా రాజీలేని పోరాటం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడేది ఎప్పటికైనా టీడీపీయేనని చంద్రబాబు చెప్పారు. హత్యలు చేయడం వైసీపీకి అలవాటని, ప్రజలను కాపాడడం తమ పార్టీకి అలవాటని చంద్రబాబు అన్నారు.

రెడ్లకు కోచింగ్‌ ఇస్తే 10 లక్షలిస్తా: జేసీ దివాకర్‌రెడ్డి

రెడ్లకు కోచింగ్‌ ఇస్తే 10 లక్షలిస్తా: జేసీ దివాకర్‌రెడ్డి
Updated :31-08-2015 02:02:38
 రెడ్లలోనూ పేదలు.. చేయూతనివ్వాలి: తెలంగాణ హోం మంత్రి నాయిని 
 
రవీంద్రభారతి/హైదరాబాద్‌, ఆగస్టు 30: పేద రెడ్డి విద్యార్థులను రెడ్డి సంఘాలు, ఉన్నత స్థానంలో ఉన్న వారు ఆదుకోవాలని, వారికి సరైన శిక్షణ ఇప్పిస్తూ మంచి ర్యాంకు వచ్చేలా ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. రెడ్డి అభ్యర్థుల కోసం ఎవరైనా కోచింగ్‌ సెంటర్‌ పెడితే తన వంతుగా రూ.10 లక్షలు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌ రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన రెడ్డి అభ్యర్థులను ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అభినందించారు. రెడ్డి సామాజికవర్గం అనగానే అగ్రవర్ణంగా చిత్రీకరించారని, వీరిలో కూడా పేదలు ఉన్నారని నాయిని చెప్పారు. రెడ్డి రాజుల కాలంలో గొలుసు చెరువులు ఉండేవని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మిషన్‌ కాకతీయతో వాటిని తిరిగి అభివృద్ధి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘం అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారి అజయ్‌కల్లాం, మెట్రోరైల్‌ ఎండీ ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి మాట్లాడుతూ నిరుపేద రెడ్డి అభ్యర్థులకు నిత్యం అండగా ఉంటామన్నారు.

కలిసి కొట్లాడుదాం..!

కలిసి కొట్లాడుదాం..!
Updated :31-08-2015 02:16:44
  • హోదా కోసం బలవన్మరణాలు వద్దు
  • చంద్రబాబు మౌనమే ఏపీకి శాపం: కవిత
  • రాష్ట్రపతికి పరామర్శ, భగవద్గీత బహుకరణ
న్యూఢిల్లీ, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదాకోసం ఏపీలో జరుగుతున్న ఆత్మహత్యలు చూస్తే బాధగా ఉందని, హక్కుల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పోరాడుదామని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఉద్యమ సమయంలో తెలంగాణలో ఉన్న పరిస్థితులే ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నాయన్నారు. అప్పటి తెలంగాణ తల్లుల కడుపుకోత తనకు తెలుసు కాబట్టే.. ఏపీలో ఎవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని కవిత కోరారు. ‘ఒక సోదరిగా ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’నని తెలిపారు. కాగా, ప్రతి రాషా్ట్రన్ని ప్రధాని మోదీ ఫెడరల్‌ స్పూర్తితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలు సాధించడానికి ఏపీతో కలిసి కొట్లాడేందుకు తమకెలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. మోదీ వైఖరిని చంద్రబాబు తప్పుపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీహార్‌లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్కడ ప్యాకేజీ ప్రకటించారని, కానీ.. ఏడాదిగా పెండిగ్‌లో ఉన్న ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు, అభివృద్ధి కోసం తెలంగాణకు ఇస్తామన్నవి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలేవీ నెరవేర్చలేదన్నారు. వీటన్నింటిని చంద్రబాబు ఎత్తి చూపాల్సిన సమయం ఆసన్నమైందని.. ఆయన మౌనం ఏపీకి శాపంగా మారుతోందన్నారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే.. ఇప్పుడు కృష్ణా జలాల కొరత ఏర్పడిందని, రాబోయే రోజుల్లో గోదావరి జలాల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంటుందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. వీటి పరిష్కారం కోసం తెలుగు రాషా్ట్రలుగా, రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. సతీవియోగంతో దు:ఖంలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని.. సీఎం కేసీఆర్‌ తరపున ఎంపీ కవిత, మరికొందరు ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి హిందూ సాంప్రదాయం ప్రకారం భగవద్గీత బహూకరించినట్లు కవిత తెలిపారు.

Saturday, 29 August 2015

మన లక్ష్యం హరిత అమరావతి: చంద్రబాబు

మన లక్ష్యం హరిత అమరావతి: చంద్రబాబు
Updated :29-08-2015 17:26:14
విజయవాడ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : రాజధా ని అమరావతిని గ్రీన్‌సిటీగా చూడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ ప్రాంతంలో ఏరియల్‌ సీడింగ్‌ కార్యక్రమాన్ని శుక్రవారం విజయవాడలోని ఇంది రాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటి సారి గా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా హెలికాప్టర్‌ నుంచి కొండలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలల్లో విత్తనాలు చల్లే కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో దాదాపు 3,500 ఎకరాల్లో విత్తనాలు జల్లే ఏర్పాట్లు చేశామని వివరించారు. సీఆర్‌డీఏను గ్రీన్‌ పార్క్‌గా చూడటమే అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రజలందరూ సమష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటితే ఐదేళ్ల కాలంలో కోట్ల మొక్కలు పెంచిన వారమవుతామని పేర్కొన్నారు. ఈ మహా యజ్ఞంలో ప్రతి ఒక్క రూ పాల్గొనాలని అప్పుడే మన మనుగడకు పూర్తి భరో సా వస్తుందని సూచించారు. ఏరియల్‌ సీడింగ్‌ కోసం కృష్ణపట్నం పోర్టు హెలికాప్టర్‌ను ఉచితంగా ఇవ్వడం ఎంతో సంతోషమన్నారు. హెలికాప్టర్‌ మెత్తం 30 ట్రిప్పుల ద్వారా ఈ కార్యక్రమన్ని పూర్తి చేస్తుందని వివరించారు.
 
భవనాలు నావి.. మొక్కలు మీవి 
ప్రతి విద్యార్థి తప్పని సరిగా గ్రీన్‌ కార్ప్స్‌లో చేరాలని సీఎం సూచించారు. విద్యార్థుల పుట్టినరోజు, తల్లిదండ్రుల పుట్టిన రోజు, పరీక్షలు పాసైనా, ఫెయిలైనా మొక్కలు నాటాలన్నారు. మీరు జీవితంలో చేసే పనులన్నింటికీ అవే నిదర్శనం అని పేర్కొన్నారు. వాటిని సంరక్షించే బాధ్యత కూడా పిల్లలే తీసుకుని పెద్దవాళ్లకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో అడవులను అభివృద్ధి చేయడానికి ఉపాధి హమీ ద్వారా రూ. 350 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. మన వాతావరణానికి సరిపోయే విత్తనాలను విదేశాల నుంచి అయినా సరే తెప్పిస్తామని తెలిపారు. నవ్యాంధ్ర రాజధానిలో బిల్డింగ్‌లు, రోడ్లు వేయించడం సంగతి తాను చేసుకుంటానని వాటి పక్కన మొక్కలు పెంచే బాధ్యత పిల్లలు చూసుకోవాలని చమత్కరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 23 శాతం గ్రీనరీ ఈ కార్యక్రమం ద్వారా 40 శాతానికి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు

సోంపేట థర్మల్‌ ప్లాంట్‌ రద్దు..ఆ భూముల్లో వ్యవసాయ ఆధార పరిశ్రమలు : అచ్చెన్నాయుడు

సోంపేట థర్మల్‌ ప్లాంట్‌ రద్దు..ఆ భూముల్లో వ్యవసాయ ఆధార పరిశ్రమలు : అచ్చెన్నాయుడు
Updated :29-08-2015 17:22:17
విజయవాడ, ఆగష్టు 29 : సోంపేట థర్మల్‌ ఫ్లాంట్‌ను రద్దు చేస్తూ ఏపీ కేబీనెట్‌ శనివారం నిర్ణయం తీసుకుంది. థర్మల్‌ ఫ్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి 1107 జీవోను రద్దు చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా థర్మల్‌ ఫ్లాంట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. థర్మల్‌ ఫ్లాంట్‌కు ఏపీఐఐసీ కేటాయించిన 972 ఎకరాల భూమిలో మల్టీ ప్రొడక్ట్‌ వ్యవసాయ ఆధార పరిశ్రమలు నెలకొల్పుతామని ఆయన వెల్లడించారు. జీవోను రద్దు చేసినందున థర్మల్‌ ఫ్లాంట్‌కు వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలను నిలిపివేయాలని సోంపేట వాసులకు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. థర్మల్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా అక్కడ ఐదున్నర ఏళ్ల నుంచి ప్రజలు దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రత్యేక హోదాపై చంద్రబాబు తన వైఖరి చెప్పట్లేదు : జగన్‌

ప్రత్యేక హోదాపై చంద్రబాబు తన వైఖరి చెప్పట్లేదు : జగన్‌
Updated :29-08-2015 18:01:02
విజయవాడ, ఆగస్టు 29 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాడు తన వైఖరి తేల్చడం లేదని ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ప్రత్యేక హోదా వస్తే 90శాతం గ్రాంటు, 10శాతం రుణం వస్తుందని, అయితే... ప్రత్యేక ప్యాకేజీనే మేలని ప్రజలను టీడీపీ నేతలు మభ్యపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాతో ప్రతి జిల్లాను హైదరాబాద్‌లా తయారు చేయవచ్చని, ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చంద్రబాబును నిలదీస్తామన్నారు. ఎన్నికలకు ముందు ఐదేళ్లు కాదు.. పదేళ్లపాటు ప్రత్యేక హోదా కావాలన్న నేతలు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని, అసలు 14వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదాతో సంబంధం లేదని, ప్రత్యేక హోదా దాని పరిధిలోకి రాదని, ప్రత్యేక హోదా అంశం ప్రధాని చేతుల్లోనే ఉందన్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ అనుసరిస్తున్న విధానానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ తన మద్దతును విరమించుకోవాలన్నారు. శనివారం జరిగిన బంద్‌ను విఫలం చేసేందుకే కేబినెట్‌ భేటీ పెట్టారని, అయినా... బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించారని వీరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

పెళ్లికాని కుర్రాళ్లే... వారి టార్గెట్‌

పెళ్లికాని కుర్రాళ్లే... వారి టార్గెట్‌
Updated :29-08-2015 09:49:34
  • ధనవంతురాలైన యువతికి వరుడు కావాలంటూ ప్రకటన
  •  అందమైన యువతుల ఫొటోలతో వల
  •  నగరంలో కి‘లేడీ’ ముఠా గుట్టురట్టు
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ: మూడు పదులు దాటినా దొరకని తోడు.. ఇంట్లో పెళ్లిచేసుకోమంటూ పోరు. దీంతో బ్రహ్మచారులు పెళ్లిపీటలు ఎక్కటం కష్టంగా మారింది. సంబంధం ఉందని మ్యారెజ్‌ బ్రోకర్లు చెప్పగానే వేలకు వేలు ఖర్చుచేసి వాలిపోతున్నారు. అలాంటి సమయంలో పెళ్లికాని కుర్రాళ్లకు ఆస్తి.. అందం ఉన్న అమ్మాయి వివరాలు దొరికితే ఊరుకుంటారా! ఇంకేముంది.. భలేమంచిరోజు అనుకుంటూ ఖరీదైన సూటు.. బూటుతో సిద్ధం. అబ్బాయిల బలహీనతను అవకాశంగా చేసుకుని... ఓ కి‘లేడీ’ ముఠా అందినంత దండుకుంటోంది. ఇదంతా మోసమని గ్రహించేలోపు పలాయనం చిత్తగిస్తున్నారు. ఈ పెళ్లిగోలలో చిక్కుకుని లబోదిబోమంటూ మోసపోయిన కుర్రాళ్లు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తీగలాగడంతో డొంక కదిలింది. అసలు బడ్డారం బట్టబయలైంది. వంద అబద్దాలు ఆడైనా పెళ్లి చేయమనేది నాటి సామెత. నూరు అబద్దాలతో పెళ్లిచేస్తామని నమ్మించి దోచుకోవటమే హైటెక్‌ సామెత అన్నట్టుగా సాగిస్తున్న కి‘లేడీ’ మోసపు గుట్టు ఇది.
నగరంలో ఓ అందమైన అమ్మాయి ఫొటోతో పత్రికల్లో ప్రకటన ఇస్తారు. కోట్లాది రూపాయల ఆస్తి ఉన్న ఆమెకు తగిన వరుడు కావాలని.. సమర్థుడైతే చాలని.. కులగోత్రాలు.. ఆస్తిపాస్తులతో పనిలేదని ప్రకటనలో పేర్కొంటారు. ఆస్తి తర్వాత సంగతి.. అందమైన ఫొటో చూడగానే అబ్బాయిలు ఫ్లాటైపోతున్నారు. క్షణం ఆలోచించకుండా అక్కడ ఉన్న ఫోన్‌ నంబర్‌కు డయల్‌ చేస్తున్నారు. అట్నుంచి వినిపించే అందమైన కంఠం తాము మ్యారేజ్‌ బ్యూరో అంటూ సమాధానమిస్తుంది. ఆకట్టుకునే యువతుల ఫొటోలతో పెళ్లికాని కుర్రాళ్లకు వలవేసి రప్పించుకుంటారు. యువకులకు గాలం వేయడానికి 10 మంది యువతులు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరి పనంతా అందంగా అబద్ధాలను నమ్మించడమే. పెళ్లి సంబంధం కోసం వచ్చిన యువకుల నుంచి రిజిసే్ట్రషన్‌ ఫీజు కింద 5 నుంచి పదివేల రూపాయల వరకు వసూలు చేస్తారు. ఇలా... రోజు పదుల సంఖ్యలో కుర్రాళ్లకు వలవేశారు. అక్కడి రిసెప్షన్‌లో ఉండేది ఆడపిల్లలు కావటంతో గట్టిగా ప్రశ్నించలేని యువకులు ఫోన్‌ చేసినప్పుడల్లా అక్కడ వాలిపోయేవారు. వెళ్లిన ప్రతిసారీ ఎంతోకొంత రాబట్టుకునేవారు. కొద్దిరోజులు గడిచాక ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది. మరికొన్ని సందర్భాల్లో తాము ఇతర ప్రాంతంలో ఉన్నట్టు చెప్పేవారు. గట్టిగా అడిగితే.. మరోచోట అందం.. ఆస్తిపాస్తులున్న ఆడపిల్ల ఉందంటూ అక్కడ పనిచేసే యువతులు సమా ధానం చెప్పేవారు. ప్రకటనలో ఇచ్చిన ఫోన్‌ నంబర్లు వీరి వద్దే ఉండటంతో యువకులు పోన్‌ చేసిన సమయంలో నమ్మించేలా నాటకమాడేవారు. అక్కడ నుంచి కథ మళ్లీ మొదటికే. చివరకు పెళ్లిసంగతి దేవుడెరుగు... పర్సు ఖాళీ అవుతుండటంతో.. ధైర్యం చేసిన ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
పత్రికా ప్రకటనల్లో ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌ ద్వారా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాము కూడా బ్రహ్మచారులమనే నమ్మించారు. మోసాన్ని మోసంతోనే బట్టబయలు చేశారు. నకిలీ మ్యారేజ్‌ రాకెట్‌ వెనుక సూత్రధారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నెలవారీ జీతంతో 10 మంది యువతులను ఉద్యోగంలో చేర్చుకుని ఈ తంతు సాగిస్తోంది. చివరకు బండారం బయట పడటంతో కేసు నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నట్టు సమాచారం. 

నా ప్యాకేజీ 2.7 లక్షల కోట్లు: నితీశ్‌

నా ప్యాకేజీ 2.7 లక్షల కోట్లు: నితీశ్‌
Updated :29-08-2015 03:46:45
పట్నా: బిహార్‌కు ప్రధాని మోదీ రూ.1.65 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే.. ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌ కుమార్‌ రూ.2.7 లక్షల కోట్ల అభివృద్ధి ప్యాకేజీని ప్రకటించారు. ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్తు, మంచినీరు తదితరాలు కల్పిస్తామని, రాబోయే ఐదేళ్లలో ఈ నిధులు ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. మోదీ ప్యాకేజీపై విమర్శలు గుప్పించారు. ‘‘ఆ ప్యాకేజీ అద్భుతమని గొప్పలు చెప్పుకొన్నారు. కానీ, నా 2.7 లక్షల కోట్ల విజన్‌ అమలుకు అవకాశమున్న పథకాలతో కూడి ఉంది. ఇవి నా హృదయంలోంచి వస్తున్న మాటలు (దిల్‌ కీ బాత్‌). మనసులోంచి వస్తున్న మాటలు (మన్‌ కీ బాత్‌) కాదు’’ అని నితీశ్‌ వ్యాఖ్యానించారు.

Thursday, 27 August 2015

ఏపీ సంగతి చూడండి నీతి ఆయోగ్‌ అధికారులకు వెంకయ్య సూచన

ఏపీ సంగతి చూడండి
నీతి ఆయోగ్‌ అధికారులకు వెంకయ్య సూచన

వెనకబడిన జిల్లాలకు సాయం చేయాల్సిందే
న్యూఢిల్లీ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని త్వరగా పరిశీలించాలని నీతి ఆయోగ్‌ అధికారులకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. తన నివాసంలో గురువారం ఆయన నీతి ఆయోగ్‌ అధికారులతో సుమారు 70 నిమిషాలపాటు సమావేశమయ్యారు. ఇందులో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగరియా, సభ్యులు వివేక్‌ డెబ్రాయ్‌, సీఈవో సింధుశ్రీ కుల్లార్‌ పాల్గొన్నారు. అనంతరం పట్టణాభివృద్ధి శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా విభజనకు దారితీసిన పరిస్థితులతోపాటు విభజన చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు జరిగిన చర్చల సారాంశాన్ని వెంకయ్య వారికి వివరించారు. రాజధాని లేకపోవడంతోపాటు రెవెన్యూ లోటుతో ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షుణ్ణంగా తెలిపారు. ప్రత్యేక హోదాతోపాటు ప్యాకేజీపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు అదనంగా ఆర్థిక చేయూత అందజేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సరిపోయినన్ని నిధులు ఇవ్వాలని సూచించారు. కలహండి-బొలంగిరి-కోరాపుట్‌(కేబీకే) తరహాలో పారిశ్రామిక అభివృద్ధికి ఏపీకి రాయితీలు ఇవ్వాలని, హిమాచల్‌ ప్రదేశ్‌కు గతంలో ఇచ్చినట్లు పన్ను మినహాయింపులు, విదేశీ సాయంతో ప్రాజెక్టులకు నిధుల శాతాన్ని పెంచడం వంటి వాటిపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న వివిధ ప్రాజెక్టులకు తగినన్ని నిధులను కేటాయించాలని కోరారు.

గ్లామర్ కోల్పోయిన ప్రత్యేక హోదా

హోదాకు నిధుల కోత
గ్లామర్ కోల్పోయిన ప్రత్యేక హోదా

  •  90 శాతం గ్రాంటు ఒక్కటే ప్రధాన ఆకర్షణ
  •  నిధులు తగ్గితే హోదా వచ్చినా ఒరిగేదేమీ లేదు
  •  మంచి కేటాయింపులతో ప్యాకేజీయే బెటర్‌
  •  ఏపీ ఆర్థిక శాఖాధికారుల అభిప్రాయం
హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదా కోసం దేశవ్యాప్తంగా అనేక రాషా్ట్రలు పోటీ పడుతున్నా ఈ హోదాకు క్రమంగా గ్లామర్‌ తగ్గిపోతోంది. ప్రత్యేక హోదా ఉన్న రాషా్ట్రలకు ఇచ్చే నిధుల్లో భారీగా కోత పడుతుండడమే దీనికి కారణం. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా రాషా్ట్రలకు అందే
నిధులు మరీ తగ్గిపోయాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వంటి రాషా్ట్రలు పాత రోజులను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టడం వృథా అని, ఆ హోదా వచ్చినా ఇప్పుడు దాని వల్ల వచ్చే నిధులు పెద్దగా ఉండటం లేదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అభివృద్ధిపరంగా బాగా వెనకబడి ఉన్న ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్‌, హిమాచల్‌ వంటి రాష్ట్రాలకు కేంద్ర నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చే నిమిత్తం వాటికి ప్రత్యేక హోదా కల్పిస్తూ వచ్చారు. వీటికి కొన్ని పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు ఇచ్చినా, వాటిని విడిగా ఇచ్చారు. ప్రత్యేక హోదాకు, ఈ రాయితీలకు సంబంధం లేదు. ఈ రాయితీలు కూడా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఇచ్చారు. అలాగే, హోదా రాషా్ట్రలకు మూడు నాలుగు పద్దుల కింద కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తూ వచ్చింది. ఇదంతా 90 శాతం గ్రాంటుగా వస్తుండడంతో రాషా్ట్రలకు పెద్ద ఆకర్షణగా మారింది. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల సత్వర పూర్తికి ఏఐబీపీ ద్వారా నిధులు; విదేశీ రుణ ప్రాజెక్టుల కింద హోదా రాషా్ట్రలకు 90 శాతం గ్రాంటుగా ఇస్తూ వస్తున్నారు. కానీ, క్రమంగా ఈ రాషా్ట్రలకు ఈ పథకాల ద్వారా వచ్చే నిధులు భారీగా తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు, 2005- 06లో హోదా రాషా్ట్రలకు కేంద్రం అన్ని రాషా్ట్రలకు ఇచ్చే మొత్తం సాయంలో 56 శాతం నిధులు దక్కాయి. 2015- 16కు వచ్చేసరికి ఇది 15 శాతానికి పడిపోయింది. హోదా రాషా్ట్రలకు 40 శాతం మేర కేంద్ర సాయం తగ్గిందని ఆర్థిక శాఖ అధికారుల విశ్లేషణలో తేలింది. కాగా, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రాషా్ట్రలకు నిధుల కేటాయింపు పెంచారు. గతంలో కేంద్ర ఆదాయంలో 32 శాతం వాటాను రాషా్ట్రలకు ఇచ్చేవారు. ఇప్పుడు హోదాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకూ దానిని 42 శాతానికి పెంచారు. ఆ తర్వాత వివిధ పేర్లతో రాషా్ట్రలకు ఇతరత్రా ఇచ్చే సాయాన్ని నిలిపివేశారు. ఉదాహరణకు, హోదా రాష్ట్రాలకు గతంలో గణనీయంగా నిధులు కేటాయించే రాషా్ట్రల వార్షిక ప్రణాళికలకు ఇచ్చే సాయం, ప్రత్యేక ప్రణాళికా సాయం, ప్రత్యేక కేంద్ర సహాయాన్ని 2015- 16 నుంచి పూర్తిగా నిలిపివేశారు. అలాగే, ఏఐబీపీ పథకం కింద సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చే నిధులను కూడా తగ్గించేశారు. 2014- 15లో ఈ పథకం కింద రాషా్ట్రలకు రూ.8992 కోట్లు ఇస్తే ఈ ఏడాది దానిని దేశం మొత్తానికి కలిపి రూ.1000 కోట్లకు పరిమితం చేశారు. ‘‘ప్రత్యేక హోదా రాషా్ట్రలకు కేంద్రం ఇచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంటుగా వస్తాయన్నది పెద్ద ఆకర్షణ. కానీ, కేంద్రం ఇచ్చే నిధులు బాగా తగ్గిపోతున్నప్పుడు ఆ హోదా పెద్దగా లాభసాటి కాదు. పెద్ద పోరాటం చేసి ప్రత్యేక హోదా తెచ్చుకొని, ఆ తర్వాత పెద్దగా నిధులు రాకపోతే దెబ్బతింటాం. ఏ మార్గంలో నిధులు వస్తాయన్న దానిపైనే ఇప్పుడు దృష్టి పెట్టాలి’’ అని సీనియర్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. హోదా ఉంటే విదేశాల నుంచి వచ్చే రుణాల్లో కూడా 90 శాతం గ్రాంటుగా వస్తాయని, అదొక లాభమని కొందరు చెబుతున్నారు. ఆర్థిక శాఖాధికారులు దానితో కూడా విభేదిస్తున్నారు. ‘‘ఈ హోదాను ఐదేళ్లకు ఇస్తారు. ఇంత తక్కువ వ్యవధిలో విదేశీ రుణ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు తయారు చేయడం, వాటికి విదేశీ సంస్థలతో ఆమోదం పొందడం, నిధులు రావడం అంత తేలిక కాదు. కొన్ని నిధులు వచ్చినా వాటి పరిమాణం పెద్దగా ఉండకపోవచ్చు’’ అని ఒక అధికారి వివరించారు. ఆర్థిక కోణంలో చూసినప్పుడు హోదాతో పోలిస్తే ప్రత్యేక ప్యాకేజీ మేలని ఏపీ ఆర్థిక శాఖ వర్గాలు బలంగా భావిస్తున్నాయి.

అమరావతికి ప్రపంచ బ్యాంకు చేయూత

అమరావతికి ప్రపంచ బ్యాంకు చేయూత
ఏపీ సీఎస్‌తో ప్రపంచబ్యాంకు అధికారుల భేటీ

హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణానికి సహకరించాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు ఏపీ సర్కార్‌ కోరింది. ఏపీ సర్కార్‌ ప్రతిపాదనకు ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకరించింది. అమరావతి నిర్మాణానికి ఎంత పెట్టుబడి కావాలన్న దానిపై సమగ్ర నివేదిక ఇస్తే నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ప్రపంచ బ్యాంకు అధికారులు తెలిపారు. రాజధానిలో సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌ తదితర నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవని, ప్రపంచ బ్యాంకు సహకరించాలని ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఎదుట ప్రతిపాదన ఉంచింది. ప్రపంచ బ్యాంకు ఆర్థికసాయంతో జరుగుతున్న పనులపై చర్చించేందుకు గురువారం ఏపీ సీఎ్‌సతో కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ కార్యదర్శి రవికుమార్‌, ప్రపంచ బ్యాంకు భారత ప్రతినిధి ఓర్లార్‌ హుల్‌ తదితరులు భేటీ అయ్యారు. 
 
ఏపీ సర్కార్‌ ఏం కోరిందంటే..
అమరావతి నిర్మాణానికి సహకరించడంతోపాటు గ్రామీణ నీటిపారుదల వ్యవస్థల బలోపేతానికి సహకరించాలని ఏపీ సర్కార్‌ ప్రపంచబ్యాంకును కోరింది. మౌలిక వసతులకు సంబంధించి మరో రెండు ప్రాజెక్టులకు నిధులివ్వాలని కూడా అభ్యర్థించింది. త్వరలోనే వీటి ప్రతిపాదనలు సమర్పిస్తామని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్‌ ఆధునికీకరణ పనులకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రూ.4,444 కోట్లును ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకుంది. రాష్ట్ర విభజన జరిగాక ఈ రుణంలో ఏపీ వాటా రూ.2832 కోట్లుగా ఉంది. తన వాటా నిధుల్లో ఏపీ సర్కార్‌ ఇప్పటికే రూ.900 కోట్లును వ్యయం చేసింది. ఈ ఆధునికీకరణ పనులను 2016 జూలై నాటికి పూర్తి చేయాల్సి ఉండగా మరో రెండేళ్లు పొడిగించాలని ఏపీ సర్కార్‌ కోరింది. కానీ, సమయం ఉన్నందువల్ల పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని, ఆ తర్వాత కావాలంటే గడువు పెంచుతామని ప్రపంచ బ్యాంకు అధికారులు తెలిపారు. చెరువులు, చిన్నతరహా నీటి వనరుల అభివృద్ధికి ప్రపంచబ్యాంకు రెండో విడత ఆర్థిక సహాయం కింద రూ.2 వేల కోట్లు మంజూరుచేయాలని ఏపీ జలవనరుల శాఖ కోరింది. సమగ్ర నివేదిక సమర్పిస్తే తాము వాటికి ఆమోదం తెలుపుతామని కేంద్రం తెలిపింది. 

చర్చకు రెడీ.. హోదా, భూ సేకరణలపై విపక్షాలకు బాబు సవాల్‌

చర్చకు రెడీ..
హోదా, భూ సేకరణలపై విపక్షాలకు బాబు సవాల్‌

  • వైసీపీ, కాంగ్రెస్‌ రాజకీయాలపైనా చర్చిద్దాం
  • ప్రధాని మోదీకి సమస్యలన్నీ వివరించా
  • ఆవేశం కాదు.. సమస్య పరిష్కారం ముఖ్యం
  • నాయకుల ‘భావోద్వేగ’ మాటలు నమ్మవద్దు
  • ప్రత్యేక హోదాతో నిధులు తగ్గిపోతాయి
  • ఉద్యోగుల స్థానికతకు వచ్చిన ఇబ్బందేమీ లేదు
  • పవన్‌ కల్యాణ్‌తోనూ మాట్లాడతా: చంద్రబాబు
 
 విజయవాడ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ‘‘రాజకీయ లబ్ధే పరమావధిగా రాష్ర్టాభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్న ప్రతిపక్షాలకు ఒక్కటే చెబుతున్నా! ప్రత్యేక హోదా, భూ సమీకరణ, సేకరణలతోపాటు వైసీపీ నీతిమాలిన రాజకీయాలు, కాంగ్రెస్‌ బాగోతాలపైనా చర్చిద్దాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్‌ విసిరారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌తో కలిసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మేం వస్తాం.. భూములు తిరిగి ఇస్తాం’ అన్న జగన్‌ ప్రకటనతోపాటు ప్రతిపక్షాల విమర్శలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘నిప్పులా బతికాను. నా జీవితంలో తప్పు చేయలేదు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేనెవరికీ భయపడలేదు. భయపడను కూడా. మేమే వస్తాం.. భూములన్నీ ఇచ్చేస్తాం అంటున్నారు. మీకు రాజకీయాలు కావాలి. మాకు రాష్ట్ర ప్రయోజనాలు కావాలి. పోలవరం కాల్వ కింద ఉన్న 200 గ్రామాలను పునరావాసం చేయాల్సి వస్తుంది. భూములు వద్దంటే.. పోలవరం కాలువ కూడా వద్దా? పోలవరం పూర్తి చేయకపోతే రాష్ట్రం అంధకారంలో ఉంటుంది. కృష్ణా నదికి నీళ్లివ్వకపోతే రాయలసీమకు నీళ్లెలా వెళతాయి? నీకు నీళ్లు కావాలి. వాళ్లకు వద్దా?’’ అని ధ్వజమెత్తారు. తనను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, రాజకీయ సమ ఉజ్జీలతో మాట్లాడితే ఓ హోదా ఉంటుందని ఎద్దేవా చేశారు. అయినా, ‘‘ఎలాంటి వ్యక్తులు వచ్చినా చెప్పాల్సిన బాధ్యత మామీద ఉంది. అన్ని విషయాలూ చర్చిద్దాం. భావోద్వేగాలతో ఆడుకునే రాజకీయ నాయకుల మాటలు విని ఆవేశం కొని తెచ్చుకోవద్దు. అఘాయిత్యాలకు ఒడికడితే మీ కుటుంబమే నష్టపోతుంది’’ అని హితవు పలికారు. ‘‘అభివృద్ధిని అడ్డుకునేవాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అవినీతికి పాల్పడి తవ్వుకున్న గోతిలోనే వాళ్లు పడ్డారు. లేపాక్షికి 8 వేల ఎకరాలు ఇచ్చారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వాటిని అటాచ్‌ చేసింది. వీళ్లు చేసిన తప్పులకు సీబీఐ, కేంద్రం, ఈడీ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను అటాచ్‌ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వాటిని కాపాడుకోవ టానికి చట్టం తీసుకొస్తాం’’ అని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధాని అని, అయినా దీని గురించి వైసీపీ మాట్లాడదని, సెక్షన్‌ 8, విభజన చట్టంలోని అంశాలపై కూడా మాట్లాడదని విమర్శించారు. ఢిల్లీలో ధర్నా చేసి ప్రధాన మంత్రితో మాట్లాడలేని పెద్ద మనిషి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవటానికే భూములు ఇచ్చేస్తామంటూ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘రాజధాని నిర్మాణానికి భూ సమీకరణను వ్యతిరేకించిన ఈ పెద్ద మనుషులు రాయలసీమకు నీళ్లు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఆలమట్టిలో నీళ్లు లేవు. తుంగభద్రలో కూడా ఇదే పరిస్థితి. దాంతో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు, శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లాలని మేం ప్రయత్నిస్తున్నాం. దానినీ అడ్డుకుంటున్నాడు. పోలవరం కాల్వ పూర్తి చేయటానికి 1800 ఎకరాలు కావాలి. రైతుల్ని ఒప్పించి వారికి న్యాయం చేసి ఎకరానికి రూ.40 లక్షల చొప్పున పరిహారం చెల్లించాం. రూ.700 కోట్లు ఖర్చు చేశాం. ఇప్పుడు ఈ పెద్ద మనుషులు ప్రాజెక్టును గందరగోళం చేశారు. భ్రష్టుపట్టించారు’’ అని మండిపడ్డారు. ఎంతో పారదర్శకంగా పట్టిసీమ తలపెట్టామని, వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని, చిత్తశుద్ధితో సహకరిస్తే స్వాగతిస్తామని, రాజకీయ లబ్ధితో వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ప్రతిపక్షాలకు హెచ్చరించారు. ప్రత్యేక హోదా రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాలు ప్రజలకు పూర్తి నిజాలు చెప్పడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆర్థికంగా లబ్ధి కలిగించే బెటర్‌ ప్యాకేజీని కోరుతున్నాం. ఆ మేరకు కేంద్రానికి నివేదించామని తెలిపారు. 
 
ఉద్యోగుల పిల్లల స్థానికత పెద్ద సమస్య కాదు
సొంత రాష్ర్టానికి వచ్చే ఉద్యోగుల పిల్లల స్థానికతకు సంబంధించి ఎలాంటి సమస్యా లేదని చంద్రబాబు చెప్పారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లోని వారికి ఇక్కడి స్థానికత కల్పించే విషయంలో ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ రావాల్సి ఉంటుందని, దానిని తీసుకు రావటానికి కృషి చేస్తామని, ఇదేమంత పెద్ద సమస్య కాదని చంద్రబాబు చెప్పారు. ‘‘95 శాతం మంది రాజధానికి భూములు ఇవ్వటానికి ముందుకు వచ్చారు. మిగిలిన 5 శాతం కొంత ఉదారంగా వ్యవహరించాలి. అవసరమైతే పవన్‌ కళ్యాణ్‌తో కూడా మాట్లాడతాను’’ అని చంద్రబాబు అన్నారు.

Wednesday, 26 August 2015

హిందువులు తగ్గారు.. ముస్లింలు పెరిగారు

హిందువులు తగ్గారు.. ముస్లింలు పెరిగారు
వృద్ధిరేటులోనూ ముందు.. జనాభా మతగణన వివరాలు

  • దశాబ్దకాలంలో 0.8 పర్సంటేజ్‌ పాయింట్ల వృద్ధి
  • హిందువుల్లో 0.7 పర్సంటేజ్‌ పాయింట్ల తగ్గుదల
  • హిందువుల్లో 16.8 శాతమే
  • ముస్లింల వృద్ధిరేటు 24.6 శాతం 
  • మొత్తం జనాభాలో హిందువులు 79.8శాతం
  • ఐదు దశాబ్దాలుగా తగ్గుతూ వస్తున్న హిందూ జనాభా
న్యూఢిల్లీ, ఆగస్టు 25 : మతాలవారీగా జనాభా లెక్కల వివరాలను ఎన్డీయే సర్కార్‌ మంగళవారం విడుదల చేసింది. 2011 జనగణన ఆధారంగా రిజిసా్ట్రర్‌ జనరల్‌ అండ్‌ సెన్సెస్‌ కమిషనర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం దేశ జనాభాలో హిందువులు 79.8 శాతం ఉన్నారు. జనాభా వృద్ధి రేటులో హిందువుల కన్నా ముస్లింలు ముందువరుసలో ఉన్నారు. 2001-11 నడుమ దశాబ్ద కాలంలో హిందూ జనాభా వృద్ధి రేటు 16.8 శాతంగా నమోదైతే, ముస్లిం జనాభా వృద్ధి రేటు 24.6 శాతంగా నమోదైంది. ఇది దేశ జనాభా వృద్ధి రేటు(17.7శాతం) కన్నా ఎక్కువ. 1991-2001 నడుమ ముస్లిం జనాభావృద్ధి రేటు(29 శాతం) కన్నా తక్కువ. దశాబ్ద కాలంలో మొత్తం జనాభాలో ముస్లిం జనాభాలో 0.8 పర్సంటేజ్‌ పాయింట్ల(పీపీ) శాతం వృద్ధి నమోదైతే హిందూ జనాభాలో 0.7 పీపీ తగ్గుదల నమోదైంది. అసోంలో ముస్లిం జనాభా వృద్ధి మిగిలిన రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మణిపూర్‌లో మాత్రం దశాబ్దకాలంలో ముస్లిం జనాభా తగ్గడం గమనార్హం. దేశంలో ముస్లిం జనాభా తగ్గుదలను నమోదు చేసిన ఏకైక రాష్ట్రం మణిపూర్‌. దశాబ్దకాలంలో మిగిలిన మతాల వృద్ధిరేటును పరిశీలిస్తే.. క్రైస్తవుల్లో 15.5 శాతం, సిక్కుల్లో 8.4 శాతం, బౌద్ధుల్లో 6.1 శాతం, జైనుల్లో 5.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. 1961 నుంచి హిందూ జనాభా క్రమేణా తగ్గుతూ వస్తుండగా, ముస్లిం జనాభా పెరుగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 
  • తెలంగాణలో హిందువులు 85.09 శాతం
  • ముస్లిం జనాభా 12.68 శాతం(హైదరాబాద్ ముస్లింలు టాప్)
  • క్రైస్తవులు 1.27 శాతం  
తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 3.51 కోట్ల మంది జనాభా ఉండగా వారిలో హిందువులు 85.09 శాతం, ముస్లింలు 12.68 శాతం ఉన్నారు. క్రైస్తవుల జనాభా 1.27 శాతంగా నమోదైంది. మతపరమైన జనాభా లెక్కలను 2011 జనగణన ఆధారంగా మంగళవారం భారత గణాంక శాఖ విడుదల చేసింది. తెలంగాణలో హిందూ, ముస్లింలలో మహిళల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. క్రైస్తవుల్లో మాత్రం మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణలో హైదరాబాద్‌లో ముస్లింల సంఖ్య అత్యధికంగా ఉంది. ఇక్కడ 17.13 లక్షల మంది ముస్లింలు ఉండగా, అత్యల్పంగా ఖమ్మంలో 1.58 లక్షల ముస్లింలు ఉన్నారు. క్రైస్తవుల సంఖ్య కూడా హైదరాబాద్‌లోనే ఎక్కువగా(87.5వేలు) ఉంది. ఆదిలాబాద్‌లో అతి తక్కువ సంఖ్యలో(15.4) క్రైస్తవులు ఉన్నారు.  
  • ఏపీలో హిందువులు 90.86 శాతం, 
  • ముస్లింలు 7.3 శాతం.. కృష్ణాలో అధికసంఖ్యలో క్రైస్తవులు
ఆంధ్రప్రదేశ్‌లో 2011 జనాభాలెక్కల ప్రకారం 4.93 కోట్ల మంది జనాభా ఉండగా వారిలో హిందువులు 90.86 శాతం ఉన్నారు. ముస్లిం జనాభా 7.3 శాతంగా నమోదైంది. భారత గణాంకశాఖ మంగళవారం మతపరమైన జనాభా లెక్కల వివరాలను వెల్లడించింది. ఏపీలో క్రైస్తవుల జనాభా శాతం 1.3గా నమోదైంది. ఏపీలో హిందూ, ముస్లింలలో మహిళల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. క్రైస్తవుల్లో మాత్రం మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలవారీగా కర్నూలులో అత్యధికంగా 6,70,737 మంది ముస్లింలు ఉండగా, రెండోస్థానంలో గుంటూరు ఉంది. ఇక్కడ 5,59,770 మంది ముస్లింలు ఉన్నారు. అత్యల్పంగా శ్రీకాకుళంలో 9025 మంది ముస్లింలు ఉన్నారు. ఏపీలో క్రైస్తవుల సంఖ్య కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఉంది. ఇక్కడ 1,45,598 మంది క్రైస్తవులు ఉన్నారు.

చనిపోయింది నా కుమార్తె: అంగీకరించిన సిఈఓ భార్య

చనిపోయింది నా కుమార్తె: అంగీకరించిన సిఈఓ భార్య

ముంబై, ఆగస్ట్ 26: స్టార్ ఇండియా సిఈఓ పీటర్ ముఖర్జీ భార్య ఇంద్రాణి ముఖర్జీ తన కుమార్తె షీనా బోరాను హత్య చేయించినట్లు ముంబై పోలీసుల ముందు అంగీకరించారని తెలిసింది. అయితే షీనా తన భార్య ఇంద్రాణికి గత వివాహం వల్ల కలిగినట్లుగా తనకు తెలియదని పీటర్ ముఖర్జీ తెలిపారు. తన భార్య ఇంత ఘాతుకానికి పాల్పడిందని తెలిసి ఆయన షాక్‌కు గురయ్యారు. తన భార్య ఇంద్రాణి ఎప్పుడూ షీనా తన సో్దరి అని చెప్పేదని ఆయన గుర్తు చేశారు. 24 ఏళ్ల షీనా బోరాను చంపేసి 2012లో ముంబైకి 84 కిలో మీటర్ల దూరంలోని రాయ్‌గఢ్ అడవుల్లో పడేశారు. ఇంద్రాణి ముఖర్జీ కారు డ్రైవర్ ద్వారా తన కుమార్తె షీనాను హత్య చేయించినట్లు ఆరోపణలున్నాయి. 

తిరుపతి వస్తా.. ప్రకటన చేస్తా.. - మోదీ

మాట మరువం.. హామీలు అమలు చేస్తా
తిరుపతి వస్తా.. ప్రకటన చేస్తా..

  • ముఖ్యమంత్రి  చంద్రబాబుకు ప్రధాని మోదీ హామీ
  •  హామీలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వండి
  • నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడికి ప్రధాని ఆదేశం
  • మాట ఇచ్చారు.. మీరిక తప్పించుకోలేరు!
  • ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వాల్సిందే
  • వెంకన్న సాక్షిగా ప్రజలకు హామీ ఇచ్చారు
  • ఇవేవీ మా రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు
  • ఇవ్వలేకపోతే ప్రజల్ని ఒప్పించే బాధ్యత మీదే
  • ప్రధానికి తేల్చిచెప్పిన చంద్రబాబు
‘‘నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అనుకూలంగా లేవన్న మాట నిజమే! కానీ, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నిజమే. వాటిలో మనం దేనిని ఎంత వరకు చేయగలం అన్న దానిపై కసరత్తు చేయండి. వీలైనంత త్వరగా నాకు నివేదిక ఇవ్వండి’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియాను ఆదేశించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా, తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీ ప్రజలకు హామీలు ఇచ్చిన మాట కూడా నిజమేనని, నవ్యాంధ్రను ఆదుకుంటానని తిరుపతిలో తానే చెప్పానని, ఢిల్లీకి దీటైన రాజధానిని కూడా నిర్మిస్తానని చెప్పానని, మళ్లీ తిరుపతికి వచ్చి తానే ప్రకటన చేస్తానని మోదీ భరోసా ఇచ్చారు. 
 
న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు కేంద్రం ఇచ్చిన హామీలపై మంగళవారం ఉదయం చంద్రబాబు ఢిల్లీలో ప్రధానితో భేటీ అయ్యారు. గంటా 35 నిమిషాలపాటు జరిగిన సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, ఆ శాఖ సీనియర్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. సమావేశంలో చంద్రబాబు 45 నిమిషాలపాటు మాట్లాడారు. వాస్తవానికి, మోదీ వద్ద 45 నిమిషాలు మాత్రమే భేటీ జరగాల్సి ఉంది. కానీ... దీనిని మరో 50 నిమిషాలపాటు పొడిగించారు. హడావుడిగా రాషా్ట్రన్ని విభజించిన తీరు, హైదరాబాద్‌ నగరాన్ని, అక్కడ ఉన్న సంస్థలు, వ్యవస్థలను వదులుకొని రావడం ద్వారా తాము పడుతున్న (మొదటిపేజీ తరువాయి)
ఇబ్బందులు, తెలంగాణలో కొందరు పనిగట్టుకొని లేవనెత్తుతున్న ద్వేష భావం, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో పెరుగుతున్న అసహనం, ఆత్మహత్యాయత్నాలు వంటివాటిని ఆయన వరుస క్రమంలో వివరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ‘‘ఈ విభజన సీమాంధ్ర ప్రజలు కోరుకున్నది కాదు. ఇప్పుడు... నవ్యాంధ్ర పొరుగు రాష్ర్టాలతో సమానంగా అభివృద్ధి చెందే దాకా సాయం చేయాల్సిన బాధ్యత మీదే. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వాల్సిందే. హోదా ఇవ్వలేకపోతే... ఎందుకు ఇవ్వలేరో మీరే ప్రజలకు చెప్పండి! హోదాకు బదులుగా ఏం ఇస్తారో చెప్పండి. వాటిని ముందు స్పష్టం చేయండి. తప్పించుకోవాలని చూస్తే బాధ్యతారాహిత్యం అవుతుంది. విభజన సమయంలో పార్లమెంటులో మీ పార్టీ ఏం చెప్పిందో గుర్తుకు తెచ్చుకోండి. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఐదేళ్లు ప్రత్యేక హోదా అంటే... అది సరిపోదని, పదేళ్లు కావాలని వెంకయ్య నాయుడు, జైట్లీ కోరారు. ఈ విషయాన్ని ఏపీ ప్రజలు మరచిపోలేదు’’ అని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. చంద్రబాబు చెప్పిన విషయాలను అన్నీ విన్న తర్వాత ప్రధాని స్పందించారు. ‘‘ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే. మీ రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టంలో ఉన్న అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీలకు మేం కట్టుబడి ఉన్నాం. వాటి నుంచి వైదొలగే ఆలోచన లేదు’’ అని తేల్చి చెప్పారు.
 
ఏపీ ఆర్థిక సమస్యలను చంద్రబాబు వివరిస్తున్నప్పుడు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా ఒకటి రెండుసార్లు అడ్డుపడ్డారు. ‘‘రుణ మాఫీ వంటి పథకాలకు మీరు విపరీతంగా ఖర్చు చేస్తూ లోటు బడ్జెట్‌ అని మా వద్దకు వస్తే ఎలా?’’ అని ప్రశ్నించారు. ఇందుకు చంద్రబాబు కూడా దీటుగానే జవాబిచ్చారు. ‘‘పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు నేను మీ అందరికంటే ఎక్కువగా ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక సంస్కరణల గురించి మాట్లాడాను. అమలు చేశాను. దానివల్ల చివరకు ఓడిపోయాను. రైతులకు రుణ మాఫీ మా ఎన్నికల వాగ్దానం. అభివృద్ధితోపాటు సంక్షేమం కూడా సమతుల్యం చేసుకోవాలి. ఆర్థిక సిద్ధాంతాలు వినడానికి బాగానే ఉంటాయి.
రాజకీయంగా మా మనుగడ కూడా చూసుకోవాలి. రైతులు బాగా చితికిపోయినందువల్లే ఆ హామీ ఇచ్చాం. అమలు చేశాం’’ అని చెప్పారు. ఏపీలోని విద్యుత్‌ సంస్థలకు భారీగా సబ్సిడీలు ఇవ్వాల్సి వస్తోందని, వేల కోట్లు దానికి ఖర్చు పెడుతూ ఆ లోటును తమను పూడ్చమంటే ఎలా అని మరో సందర్భంలో అరవింద్‌ ప్రశ్నించారు. ‘‘మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే మేం విద్యుత్‌ సంస్థలను బాగా నడుపుతున్నాం. వచ్చే ఏడాదినాటికి పంపిణీ నష్టాలు ఆరు శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. అయినా విద్యుత్‌ సంస్థలకు ఇప్పుడున్న నష్టాలు ఈ ఒక్క ఏడాదిలో మా పాలనలో వచ్చినవి కావు. వారసత్వంగా వచ్చాయి. వాటిని దిద్దుకోవడానికి కష్టపడుతున్నాం’’ అని చంద్రబాబు వివరించారు.
 
విదేశీ రుణాలే మాకు ముఖ్యం
నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాపై కూడా సమావేశంలో తర్జనభర్జన జరిగింది. ‘‘ప్రత్యేక హోదాను నేరుగా ప్రకటించడానికి మాకు కొన్ని ఇబ్బందులున్నాయి. మీకు అదే కావాలంటే ఇస్తాం. కానీ, దానివల్ల మీకు మరీ ఎక్కువ ఆర్థిక ప్రయోజనం ఉండకపోవచ్చు. పేరుతో సంబంధం లేకుండా అంతకంటే ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు తీసుకోవడం మీకు సమ్మతమైతే దానిపై మేం ఆలోచన చేస్తాం’’ అని జైట్లీ సూచించారు. దాంతో, హోదా ఇవ్వలేకపోతే ఆ మాట మీరే ప్రజలకు చెప్పి ఒప్పిస్తే బావుంటుందని, మీరు ఇచ్చిన హామీలకు వేరే ఎవరినో బలి చేస్తామనడం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. ‘‘మీరు పేరు ఏదైనా పెట్టుకోండి. మాకు అభ్యంతరం లేదు. ప్రత్యేక హోదా ఇస్తే మాకు మీ నుంచి వచ్చే నిధులు 90 శాతం గ్రాంటుగా వస్తాయి. అంతే శాతం నిధులు మాకు గ్రాంటుగా కావాలి. ప్రత్యేకించి విదేశీ రుణాల్లో ఈ గ్రాంటు మాకు చాలా అవసరం. ఆ రుణాలే మాకు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. మీరు ఏ పేరుతో అయినా సరే ఎంత ఇస్తారన్నదే మాకు ముఖ్యం. ఈ విషయంలో మీరు ఉదారంగా ఉంటే చాలు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. దాంతో, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు దీనికి అనుకూలంగా లేవని అరవింద్‌ వ్యాఖ్యానించారు. అయితే, ‘‘అది నిజమే. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు కూడా నిజం. ఇందులో మనం ఏది ఎంత వరకూ చేయగలమన్న దానిపై మీరు కసరత్తు చేసి వీలైనంత త్వరగా నాకు నివేదిక ఇవ్వండి’’ అని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ను ప్రధాని ఆదేశించారు. మళ్లీ తిరుపతికి వచ్చి ప్రకటన చేస్తా. వెంకన్నను దర్శించుకుంటానని మోదీ చంద్రబాబుకు హామీ ఇచ్చారు.

బాలీవుడ్ సినిమాను తలపిస్తోన్న షీనా మర్డర్ స్టోరీ

బాలీవుడ్ సినిమాను తలపిస్తోన్న షీనా మర్డర్ స్టోరీ

ముంబై, ఆగస్ట్ 26: స్టార్ ఇండియా సిఈఓ పీటర్ ముఖర్జీ భార్య ఇంద్రాణి ముఖర్జీ అరెస్టయ్యాక ఆమె ముంబై పోలీసులకు వెల్లడించిన విషయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. కుమార్తెను సోదరిగా పరిచయం చేసిన ఇంద్రాణి భర్త పీటర్‌కు ఏ రోజూ నిజం చెప్పలేదు. ఇదే ఆమె చేసిన తొలి పెద్ద తప్పైంది. పీటర్‌తో వివాహానికి ముందే తనకు పిల్లలున్నారని చెప్పేందుకు ఇంద్రాణి సందేహించింది. పీటర్‌తో ఇంద్రాణి వివాహానికి ముందే ఆయనకు మరో భార్య ద్వారా పుట్టిన కుమారుడు షీనాతో ప్రేమలో పడ్డాడు. అంటే తాను ప్రేమలో పడింది తన చెల్లెలు వరుసైన అమ్మాయితో అని పీటర్ కుమారుడికి తెలియదు. వీరిద్దరి సంబంధం గురించి తెలిశాక ఇంద్రాణి అసలుకే మోసం వస్తుందని గ్రహించి కుమార్తె షీనాను అడ్డు తొలగించుకోవాలనుకుంది. తన డ్రైవర్‌ను ఈ పనికి పురమాయించింది. 2012లో షీనాను చంపేశాక ఆమె మృత దేహాన్ని రాయ్‌గఢ్ అటవీ ప్రాంతంలో పూడ్చేశారు. ఆ తర్వాత ఇంద్రాణి ఏమీ తెలియనట్లు నటించడం ప్రారంభించారు. షీనా గురించి పీటర్ కుమారుడు అడిగినప్పుడల్లా అమెరికాలో ఉందని ఇంద్రాణి చెప్పేవారు. చివరకు పాపం పండి ముంబై పోలీసులు తొలుత ఇంద్రాణి డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అతడిచ్చిన వివరాల ఆధారంగా ఇంద్రాణి ముఖర్జీని కూడా అరెస్ట్ చేశారు. ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా ఇంటరాగేషన్‌లో షీనా తన కుమార్తె అని, సోదరి కాదని ఇంద్రాణి ఒప్పుకున్నారు. హత్యకు కుట్ర పన్నిన విషయాన్ని కూడా ఒప్పుకున్నారని సమాచారం. భార్య తనకు అబద్ధాలు చెప్పిందని తెలిసి పీటర్ ముఖర్జీ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు.

Tuesday, 25 August 2015

ఓబీసీ రిజర్వేషన్‌ కోరుతూ పటేల్‌ సామాజికవర్గం ర్యాలీ

ఓబీసీ రిజర్వేషన్‌ కోరుతూ పటేల్‌ సామాజికవర్గం ర్యాలీ

గుజరాత్‌, ఆగస్టు 25 : ఓబీసీ రిజర్వేషన్ల కోసం పటేల్‌ సామాజిక వర్గం అహ్మదాబాద్‌లో నిర్వహించిన ర్యాలీకి విశేష స్పందన లభించింది. గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఐదు లక్షల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాజీకి అవకాశమే లేదని రిజర్వేషన్‌ అమలు అయ్యేవరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఉద్యమకారులు అన్నారు.

రిజర్వేషన్‌ ఉద్యమకారుడు హర్దిక్‌ పటేల్‌ మీడియాతో మాట్లాడుతూ గుజరాత్‌ రాష్ట్రంలో, కేంద్రంలో మన ప్రజా ప్రతినిధులు ఉన్నారని, తమ పనులు చూసుకునేందుకు వాళ్లను ఎన్నుకోలేదని, మన సమస్యలు పరిష్కరిస్తారని ఎన్నుకున్నామని అన్నారు. మన హక్కులను నాయకులకు గుర్తు చేస్తే మొహం తిప్పేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. చాలా మంది మాట దాటవేస్తున్నారని, వాళ్లలో నిజాయితీ లేదని... మన హక్కు సాధించుకునేవరకు ఉద్యమాన్ని వదులుకునే ప్రసక్తే లేదని హర్దిక్‌ పటేల్‌ స్పష్టం చేశారు.