Action follows complaint that it was creating hatred against PM Modi

The Indian Institute of Technology-Madras has derecognised the Ambedkar-Periyar Study Circle (APSC), a student association, following an anonymous complaint that it was instigating protests against the policies of the Centre and creating “hatred” against Prime Minister Narendra Modi and Hindus.
The members have shot off a letter to the institute’s Director against what they called the “unilateral” and “undemocratic” decision to derecognise the group.
Citing an anonymous complaint allegedly from a section of students, Prisca Mathew, Under Secretary to the Ministry of Human Resource Development, wrote to the IIT-M management on May 15 requesting its comments on the issue.
Mail from Dean
Students said that on May 22, they received a mail from the Dean of Students, Sivakumar M. Srinivasan, communicating that the APSC was being derecognised for “misuse of privileges.”
When contacted, Mr. Srinivasan said the members failed to follow the code of conduct for student bodies that clearly stated that activities should have the Dean’s approval. “The members did not go through me or take my permission for the posters or the activity,” he said, referring to posters mentioned in the unsigned complaint.
A member of the APSC said: “We were not asked any explanation before this mail came. It was only later that we met the Dean, who asked us for an assurance that we will not involve in such activities again,” an APSC member said.
On Thursday evening, the members wrote a detailed response to the Director, Dr. Bhaskar Ramamurthi. “Our organisation is engaged in propagating Ambedkar and Periyar thoughts, in helping depressed castes and the caste Hindus to realise the evil of caste-based discrimination taking place in modern India and expose the ideology functioning behind such discrimination,” said the letter, which did not accept the Dean’s decision.
The complaint had said the APSC was trying to “de-align” Scheduled Caste and Schedule Tribes students to “make them protest against the MHRD and the Central government” and create hatred against the “Prime Minister and Hindus

ఎపిఎస్‌సి విద్యార్థి సంస్థపై నిషేధించిన మద్రాస్‌ ఐఐటి

08:22 - May 30, 2015
తమిళనాడు: హిందూమతంలోని కుల వివక్షను వ్యతిరేకించడం, మూఢనమ్మకాలను నిరసించటాన్ని కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది. విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని నింపుతున్న అంబేద్కర్ పెరియార్ స్టడీ స్టడీ సర్కిల్‌ అనే విద్యార్థి సంఘంపై మద్రాసు ఐఐటీ నిషేధం విధించింది. ప్రధాని నరేంద్రమోడికి, కేంద్రానికి వ్యతిరేకంగా కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేశారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మద్రాస్‌ ఐఐటి తీసుకున్న ఈ నిర్ణయం ఇపుడు వివాదాస్పదమైంది.
ఎపిఎస్‌సిపై హెచ్‌ఆర్డీకి విద్యార్థుల ఫిర్యాదు
అంబేద్కర్‌-పెరియర్‌ స్టడీ సర్కిల్ -ఎపిఎస్‌సి అనే ఈ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్- హిందీ వ్యతిరేక ప్రచారంతో పాటు గోమాంసం నిషేధం, ఘర్‌ వాప్సీ, కార్పొరేట్లకు అనుకూల నిర్ణయాలు తదితర కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమ అభిమతాన్ని వెల్లడించింది. మోడీ విధానాలను విమర్శిస్తూ ఏపీఎస్సీ పంచిన కరపత్రాలపై మానవ వనరుల మంత్రిత్వశాఖకు కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన హెచ్‌ఆర్డీ- అంబేద్కర్‌ పెరియార్‌ స్టడీ సర్కిల్‌ను నిషేధించాలన్న ఆదేశం మేరకు మద్రాస్‌ ఐఐటి ఈ నిర్ణయం తీసుకుంది.
కేంద్రం నిర్ణయంపై సర్వత్రా విమర్శలు
అయితే దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..ఆమె నివాసం ఎదుట ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు, ఏపిఎస్‌సి విద్యార్ధి సంఘాలు నిరసనకు దిగాయి. తబనూ అబద్దపు ప్రచారం జరుగుతోందని...హిందూ మత సంస్థలే తమపై ఫిర్యాదు చేశాయని ఎపిఎస్సీ నాయకులు ఆరోపిస్తున్నారు. తాము రాజ్యాంగాన్ని అతిక్రమించలేదని దీనిపై అధికారులు తమ అభిప్రాయాన్ని తీసుకోకపోడవం శోచనీయమన్నారు.
ఐఐటి మద్రాస్‌ పేరును వాడుకోవడం వల్లే నిషేధం
ఐఐటి మద్రాస్‌ పేరును పర్మిషన్‌ లేకుండా వాడుకునే హక్కు లేదని అందుకే తాము ఆ సంస్థను నిషేధించినట్టు మద్రాసు ఐఐటీ యాజమాన్యం పేర్కొంది. కేంద్ర మంత్రిత్వ ఆదేశాల మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఐటీ డీన్‌ శివకుమార్ తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించడం వల్లే నిషేధం- స్మృతీ ఇరానీ
మద్రాస్‌ ఐఐటి వివాదంపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు. అంబేద్కర్‌ పెరియార్‌ స్టడీ సర్కిల్‌ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే మద్రాస్‌ ఐఐటి ఆ విద్యార్థి సంస్థపై నిషేధం విధించిందని స్పష్టం చేశారు. మద్రాస్‌ ఐఐటి స్వయం ప్రతిపత్తి గల సంస్థ కావడం వల్ల ఏదైనా నిర్ణయం తీసుకునే అధికారం ఆ సంస్థకుందన్నారు.
మోడి ప్రభత్వాన్ని విమర్శినందుకే నిషేధం-రాహుల్‌
స్టూడెంట్స్ యూనియన్‌పై నిషేధం ప్రకటించడాన్ని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. మోడి ప్రభుత్వాన్ని విమర్శించినందుకే..స్టూడెంట్స్ యూనియన్‌పై నిషేధం విధించారని ట్విట్టర్లో స్పందించారు. అయితే రాహుల్‌ వ్యాఖ్యలపై మంత్రి స్మృతీ ఇరానీ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పనిగట్టుకుని హెచ్‌ఆర్డీని టార్గెట్‌ చేస్తోందని మంత్రి విమర్శించారు.
విపక్షాలు మండిపాటు
మరోవైపు కేంద్ర మానవ వనరులశాఖ తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు భగ్గుమన్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమేనని పేర్కొన్నాయి. అటు ఆ సంస్థతో సంబంధం ఉన్న ప్రొఫెసర్లు కూడా ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు.
కులం పేరిట దూషిస్తున్నారు: విద్యార్థులు
ఇక కేంద్రానికి ఫిర్యాదు చేసిన విద్యార్థులు మాత్రం తమ వాదనను సమర్థించుకుంటున్నారు. కులం పేరిట తమను దూషిస్తున్నారని, ప్రధానికి, హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేసినందువల్లే తాము ఈ పనికి పూనుకున్నామని చెబుతున్నారు.