Saturday, 9 May 2015

10 ఏళ్లలో 13 లక్షల మారుతీ స్విఫ్ట్ కార్ల అమ్మకం

10 ఏళ్లలో 13 లక్షల మారుతీ స్విఫ్ట్ కార్ల అమ్మకం
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశీయ కార్ల ఉత్పత్తి దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) 13 లక్షల స్విఫ్ట్‌ కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కారు స్విఫ్ట్‌ను విడుదల చేసిన పదేళ్ల (2005) లోనే ఈ రికార్డును అందుకోవటం విశేషం. భారతీయ ఆటోమొబైల్‌ రంగ చరిత్రను మార్చిన స్విఫ్ట్‌ కారు దేశీయ మార్కెట్లోకి విడుదలైన స్వల్పకాలంలోనే 13 లక్షల మార్కును అందుకుందని ఎంఎస్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌) ఆర్‌ఎస్‌ కల్సి అన్నారు. పెద్ద కారు ఫీచర్లతో తీసుకువచ్చిన స్విఫ్ట్‌ భారత వినియోగదారుల మనసును ఎంతగా ఆకట్టుకుందో ఈ కార్ల విక్రయాలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్లోకి విడుదల చేసిన ఏడాదే కార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలుచుకోగా 2011లో మరోసారి స్విఫ్ట్‌ మోడల్‌లో మార్పులు చేర్పులు చేసిన అనంతరం మళ్లీ ఈ అవార్డును గెలుచుకుందని మారుతి సుజుకీ ఇండియా వెల్లడించింది. 2007లో లక్ష యూనిట్లతో ఆరంభమైన స్విఫ్ట్‌ ప్రయాణం 2015 ఏప్రిల్‌ నాటికి 13 లక్షల యూనిట్లకు చేరుకుందని తెలిపింది.
 
పదేళ్లలో స్విఫ్ట్‌ ప్రయాణం..
  •  2002లో పారిస్‌ ఆటో షోలో కాన్సెప్ట్‌ ఎస్‌ విడుదల
  •  2003 ఫ్రాంక్‌ఫర్ట్‌ ఆటో షోలో కాన్సెప్ట్‌ ఎస్‌2 ఆవిష్కరణ 
  •  2004 పారిస్‌ ఆటో షోలో విడుదల
  •  2004 నవంబర్‌లో జపాన్‌ మార్కెట్లోకి విడుదల
  •  2005 మే నెలలో భారత మార్కెట్లోకి అడుగు
  •  2007 డీజిల్‌ వేరియంట్‌ విడుదల
  •  2011లో సరికొత్త రూపంతో మార్కెట్లోకి

No comments:

Post a Comment