న్యూస్ ఫ్లాష్ | మరోసారి రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు, పంజాబ్ లో 80% యువత డ్రగ్స్ కు బానిసలు | Share on: |
లోకేశ్ మార్కులు వేయడమేంటి?
Reported by Gvvn Prathap | Updated: May 07, 2015 17:37 (IST)
మంత్రులు ఏడాది పనితీరుపై స్వీయ నివేదికలను రూపొందించి ముఖ్యమంత్రి ఓఎస్డీ అభీష్టకు పంపించాలనడంపైనా వారు మండిపడుతున్నారు. అభీష్టకు స్వీయ నివేదికలను పంపిస్తే, ఆయనతోపాటు విశ్రాంత ఐఏఎస్ అధికారి పరిశీలించి నివేదిక రూపొందిస్తారా? వాటి ఆధారంగా లోకేశ్ మార్కులు వేస్తారా? ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా జరిగిందా? అని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రిమండలి అంటేనే సభ్యులు అందరూ కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకునేందుకు, చర్చించేందుకు సమావేశమవుతారు. ఆ నిర్ణయాలకు అందరూ బాధ్యులే. ఇందులో ముఖ్యమంత్రి, మంత్రులు అనే తారతమ్యం అంటూ ఉండదు. అయితే, సీఎం మంత్రిమండలికి నాయకత్వం వహిస్తారంతే. మరోవైపు మంత్రివర్గ సమావేశాలను ఇక నుంచి పది గంటలపాటు నిర్వహిస్తామని సీఎం చెప్పడంపైనా మంత్రులు పెదవి విరుస్తున్నారు.
కేబినెట్ సాగే తీరిదేనా?
విధానపరమైన నిర్ణయాలతోపాటు ప్రజలకు ప్రయోజనం కార్యక్రమాలు చేపట్టడానికి మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారు. అయితే, సోమవారం కేబినెట్ సాగిన తీరు అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని మంత్రులే వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి సచివాలయంలో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాలపైనా మంత్రులు, ఉన్న తాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గంటల కొద్దీ సమావేశాలు నిర్వహించడం, మళ్లీ వారం తిరగకుండా అదే అంశంపై సమీక్ష నిర్వహించడం వల్ల సమయమంతా వృధా అవుతోంది. దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేసి ఫలితాలు సాధించడానికి సమయమే దొరకడం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సమావేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు ఏ మాత్రం దోహదపడటం లేదని ఉన్నతస్థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment