హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్య క్షుడు బరాక్ ఒబామాతో ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ సమావేశమయ్యారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న లోకేశ్.. అపాయింట్‌మెంట్ మేరకు పోర్ట్‌ల్యాండ్ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒబామాను కలిశారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పఽథకాలను వివరించారు. రాష్ట్ర విభజన పరిణామాలు, కొత్తగా ఏర్పడిన రాషా్ట్రనికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు, కొత్తగా తీసుకువచ్చిన పారిశ్రామిక విధానాలను ఒబామాకు వివరించారు. లోకేశ్ స్మార్ట్ విలేజ్ పథకం గురించి చెబుతున్నపుడు..
వినూత్నంగా ఉన్నదంటూ ఒబామా మెచ్చుకొన్నారు. అమెరికా లో ఉన్న ప్రవాసాంధ్రులను ఈ పథకంలో భాగస్వాములను చేయడానికే తాను వచ్చానని లోకేశ్ చెప్పినప్పుడు ఆయన అభినందించారు. చంద్రబాబు గురించి విన్నానని, ఆయనకు తన అభినందనలు తెలియచేయాలని ఒబామా లోకేశ్‌కు సూచించారు. ‘కొత్త రాషా్ట్రనికి ప్రచారం అవసరం. గతంలో హైదరాబాద్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎలా మార్కెటింగ్ చేశామో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌నూ అలాగే చేస్తున్నాం. ఆ గుర్తింపు కోసమే ఒబామాను కలిశాను’ అని లోకేశ్ అనంతరం ప్రవాసాంధ్రులకు వివరించారు. కాగా, అమెరికాలో ఐటీ రంగంలో ప్రముఖులుగా ఉన్న ప్రవాస భారతీయులను కలిసిన లోకేశ్.. ఏపీలో ఐటీ రంగ విస్తరణకు వారి సహాయ సహకారాలు కోరారు. జూపిటర్ నెట్‌వర్క్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ప్రదీప్ సింధుతో భేటీ అయ్యారు.
ఒబామాతో లోకేశ్ ఫొటో
Sakshi | Updated: May 09, 2015 02:19 (IST)
డెమోక్రటిక్ పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో ఒబామాతో కరచాలనం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్. పదివేల డాలర్లు చెల్లించినవారికి ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ఒమాబాతో కరచాలనంచేస్తూ ఫొటో దిగే అవకాశం ఇచ్చారు. లోకేశ్ అలాగే ఈ అవకాశాన్ని ‘కొని’తెచ్చుకున్నారు.
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్ ఫొటో తీసుకున్నారు. నిధుల సమీకరణ కోసం డెమాక్రటిక్ పార్టీ '2016 వైట్‌హౌస్ విక్టరీ ఫండ్' పేరుతో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా ఆయన ఈ ఫొటో దిగారు. నిధుల సమీకరణకు ఒరెగాన్ రాష్ట్రం పోర్ట్‌లాండ్‌లోని సెంటినెల్ హోటల్‌లో గురువారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనడానికి 300 మంది టికెట్లు కొనుగోలు చేసినట్టు ఆ పార్టీకి చెందిన డెమాక్రటిక్ నేషనల్ కమిటీ (డీఎన్‌సీ) ప్రకటించింది. ఒబామా 26 నిమిషాలపాటు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎక్కువ మొత్తం పెట్టి టికెట్ కొనుగోలు చేసినవారు ఒక్కొక్కరితో విడిగా అమెరికా అధ్యక్షుడు కరచాలనం చేశారు.అందులో భాగంగానే లోకేష్ కూడా ఒబామాను కలిశారు. కార్యక్రమం హాలులో ప్రవేశానికి 500 అమెరికన్ డాలర్లు, ఒబామాతో ఫోటో దిగడానికి 5 వేల డాలర్లు, ఆయనతో కరచాలనం చేసి పరిచయం చేసుకోవడానికి 10 వేల డాలర్లు రుసుముగా నిర్దేశించిన విషయం తెలిసిందే. 500 డాలర్ల టికెట్ కొనుగోలు చేసిన వారు హాలులో ప్రవేశించి ఒబామా ప్రసంగాన్ని వినడానికి మాత్రమే వీలుంటుంది. లోకేశ్ 10 వేల డాలర్లు చెల్లించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా వచ్చిన నిధులన్నీ డెమాక్రటిక్ పార్టీ ఖాతాలోకి వెళతాయి. లోకేశ్ పోర్ట్‌ల్యాండ్‌లో ఒబామాను కలుసుకున్నారని తెలుగుదేశం పార్టీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని నూతన పారిశ్రామిక విధానాన్ని, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు విశేషాలను ఆయన ఒబామాకు వివరించినట్టు తెలిపింది. తన నాలుగో రోజు అమెరికా పర్యటనలో పలు ఐటీ కంపెనీల ప్రముఖులతో లోకే శ్ భేటీ అయ్యారని వివరించింది.
No comments:
Post a Comment