భావ ప్రకటనకూ పరిమితులున్నాయి: సుప్రీం
Sakshi | Updated: May 15, 2015 02:10 (IST)
న్యూఢిల్లీ: భావ ప్రకటన స్వేచ్ఛ నిరపేక్షమేం కాదని, దానికీ పరిమితులుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘భావ ప్రకటన స్వేచ్ఛను విశాల కోణంలో అర్థం చేసుకోవాలి. అదే సమయంలో దానికి అంతర్గతంగా స్వతఃసిద్ధ పరిమితులు కూడా ఉండాలి. అవి రాజ్యాంగ ప్రమాణాలకు లోబడి ఉండాలి. రాజ్యాంగంలోని 19(1) అధికరణ అందించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు నిరపేక్షమేం కాదని, దానికీ అదే అధికరణంలోని రెండవ భాగం 19(2) కింద పరిమితులుంటాయని మేం ఇదివరకే స్పష్టమైన వివరణ ఇచ్చాం’ అని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ పీసీ పంత్‌ల ధర్మాసనం గురువారం తేల్చి చెప్పింది.
మహాత్మాగాంధీపై అనుచిత రీతిలో, అభ్యంతరకర పదజాలం ఉపయోగిస్తూ వసంత్ దత్తాత్రేయ గుర్జార్ అనే మరాఠీ కవి రాసిన కవితను 1994లో ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ యూనియన్ వారి ఇన్‌హౌజ్ జర్నల్‌లో ప్రచురించిన ప్రచురణ కర్త దేవీదాస్ రామచంద్ర తుల్జాపుర్కర్‌పై దాఖలైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చిన సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.
No comments:
Post a Comment