Thursday 28 May 2015

9 ఏళ్లు.. 9 పరుగులు.. 9 వికెట్లు

9 ఏళ్లు.. 9 పరుగులు.. 9 వికెట్లు

ముంబై: ఐపీఎల్‌-8లో అత్యంత పిన్నవయస్కుడైన సర్ఫరాజ్‌ ఖాన్‌ (బెంగళూరు) తన బ్యాటింగ్‌తో ఇప్పటికే దేశాన్ని ఆకట్టుకోగా.. ఇప్పుడు అతని తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ అండర్‌-14లో చెలరేగుతున్నాడు. తొమ్మిదేళ్ల ముషీర్‌.. ముంబై క్రికెట్‌ సంఘం (ఎమ్‌సీఏ) నిర్వహించిన అండర్‌-14 వేసవి క్యాంప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. వీరర్‌ జట్టుతో జరిగిన క్వార్టర్స్‌ (రెండు రోజుల మ్యాచ్‌) పోరులో దాదర్‌ యూనియన్‌ ఆటగాడైన ముషీర్‌ ఖాన్‌ (14-9-9-9) ఈ ఫీట్‌ చేశాడు. అందులో హ్యాట్రిక్‌ కూడా ఉండడం విశేషం. ఈ మ్యాచ్‌లో ముషీర్‌ మొత్తం 12 వికెట్లు కూల్చాడు. అలాగే అతను బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. ముషీర్‌ 48 పరుగులు చేశాడు. ఖాన్‌ ప్రదర్శనతో దాదర్‌ జట్టు సెమీస్‌ చేరింది.
 
యువీ వికెట్‌ కూడా: వార్తల్లో నిలవడం ముషీర్‌కు కొత్తేం కాదు. 2013లో జరిగిన ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో.. యువరాజ్‌ సింగ్‌ను అవుట్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు

No comments:

Post a Comment