Wednesday, 27 May 2015

రాజధాని భూమిపూజ ప్రదేశం ఖరారు

రాజధాని భూమిపూజ ప్రదేశం ఖరారు
సీఎంవో నుంచి గ్రీన్ సిగ్నల్

విజయవాడ, మే 27: రాజధాని భూమి పూజకు ఎట్టకేలకు స్థలం ఖరారైంది. కృష్ణమ్మ ఒడ్డున, దుర్గమ్మకు ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని భూమిపూజ కోసం ఎంపిక చేశారు. కృష్ణానది కరకట్టకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో తుళ్లూరు మండలం మందడం-తాళ్లాయిపాలెం మధ్యలో ఆ స్థలం ఉంది. జెడ్పీటీసీ నరేంద్ర కుటుంబ సభ్యులకు చెందిన  స్థలాన్ని భూమి పూజ కోసం ఎంపిక చేయడంపై నరేంద్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థలాన్ని భూమి పూజ కోసం ఖరారు చేస్తూ సీఎంవో నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ కాంతిలాల్, జేసీ శ్రీధర్, ఎస్పీలు త్రిపాఠి, నాయక్‌ ఆ స్థలాన్ని పరిశీలించారు. అక్కడ చేయాల్సిన భద్రత ఏర్పాట్లపై వారు చర్చించినట్లు తెలిసింది.

No comments:

Post a Comment