Wednesday 13 May 2015

పిల్లలను పనిలో పెట్టుకోవచ్చు.

పిల్లలను పనిలో పెట్టుకోవచ్చు.. కానీ కుటుంబ పరిశ్రమలు, సినిమాల్లోనే
బాలకార్మిక చట్టానికి కేంద్రం సవరణ!
న్యూఢిల్లీ, మే 13: పద్నాలుగేళ్లలోపు బాలలను కొన్ని షరతులకు లోబడి కుటుంబ పరిశ్రమలు, వినోద పరిశ్రమ లో పనిచేయించుకునేందుకు వీలుకల్పిం చే ఒక ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్‌ బుధవారం ఇక్కడ సమావేశమై తీసుకున్న పలు నిర్ణయాల్లో ఈ కీలక ప్రతిపాదన కూడా ఉంది. ఈ మేరకు 2012నాటి బాలకార్మిక చట్టానికి ప్రభుత్వం త్వరలో సవరణ తీసుకురానున్నది. అయితే 14 ఏళ్లలోపు పిల్లలను ఇతర పరిశ్రమలలో పనిలో పెట్టుకుంటే కచ్చితంగా చట్టవ్యతిరేక చర్యగానే పరిగణిస్తారని ప్రభుత్వం పేర్కొంది. ‘ప్రమాదరహిత’ కుటుంబ పరిశ్రమలలోనే వీరి చేత పని చేయించుకోవాల్సి ఉంటుంది. కాగా ఇది చిన్నారులకు బాల్యం హక్కు లేకుండా చేయడమేనని సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ ఆరోపించారు.

No comments:

Post a Comment