పాకాల, మే 30: నెల్లూరు జిల్లా వెంకటగిరిలో గత నెల చోరీకి గురైన శ్రీమేధ దక్షిణామూర్తి విగ్రహం కేసులో పాకాలకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్టయ్యాడు. గత నెల 10వ తేదిన వెంకటగిరిలోని కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో అతి పురాతన శ్రీమేధ దక్షిణామూర్తి స్వామి విగ్రహాన్ని కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన శ్రీనివాసులు, నరసింహం చోరీ చేశారు. ఈ విగ్రహాన్ని మరో పది మందితో కలసి అమ్మేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వీరు ఇటీవల గుంటూరు పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసుల విచారణలో విగ్రహాన్ని పాకాల మండల టీడీపీ ఉపాధ్యక్షుడు సోంపల్లి చంద్రశేఖర్ నాయుడు అలియాస్ మర్యాద నాయుడు ఇంట్లో దాచి ఉంచినట్టుగా తేలింది. ఇందుకు బీటెక్ చదువుతున్న ఆయన కుమారుడు శ్రీకాంత్ నాయుడు సహకరించాడని సమాచారం. దీంతో పోలీసులు ఇటీవల పాకాలకు వచ్చి ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాంత్‌ను వెంట తీసుకు వెళ్లారు. శుక్రవారం గుంటూరులో పోలీసులు చోరీ, నిందితుల వివరాలను వెల్లడించారు. కోట్ల రూపాయల విలువ చేసే విగ్రహం చోరీ కేసులో పాకాల విద్యార్థి ఉండటం మండలంలో చర్చనీయాంశమైంది.కాగా ఇదే ఇదే కేసులో శ్రీకాళహస్తికి చెందిన కేతినేని ఆనంద నాయుడు సైతం పోలీసులకు పట్టుబడ్డాడు
No comments:
Post a Comment