Saturday 5 October 2013

ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రదేశం - TDP

ప్రత్యేక దేశంగా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేయాలి: వేణుగోపాలరావు డిమాండ్

Published at: 05-10-2013 20:58 PM

 New  0  0 

 



ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రదేశం

సమైక్యాంధ్ర ఉద్యమం విభజన ఉద్యమంగా మాత్రమేగాక, ఏకంగా వేర్పాటు ఉద్యమంగా మారే కొత్త సంకేతాలు వస్తున్నాయి. పదమూడు జిల్లాలతో కూడిన సీమాంధ్రను ప్రత్యేక దేశంగా విడగొట్టాలని నూజివీడుకు చెందిన తెలుగుదేశం నేత నూతక్కి వేణుగోపాల రావు డిమాండ్ చేశారు. 

నూజివీడు, అక్టోబర్ 5 : సీమాంధ్ర 13 జిల్లాలను ఆంధ్రప్రదేశ్ అనే ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని నూజివీడు తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాష్ట్ర తెలుగు యువత ప్రచార కార్యదర్శి నూతక్కి వేణుగోపాలరావు డిమాండ్ చేశారు. శనివారం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన పాదయాత్రలో భాగంగా నూజివీడు పట్టణంలో చారిత్రాత్మక ప్రదేశం అయిన 1913లో మహాత్మగాంధీ నూజివీడులో బస చేసిన స్మారకప్రదేశంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 13 జిల్లాల ప్రజల మనోభావాలకు కనీస గౌరవం ఇవ్వకుండా నియంతగా, పక్షపాతంతో వ్యవహరిస్తున్న ఈ కేంద్రప్రభుత్వ పాలన కింద తాము జీవించలేమని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ను విడగొడితే సీమాంధ్ర ప్రజలకు జరిగే నష్టాన్ని ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణకమిటి స్పష్టంగా చెప్పినా, న్యాయంగా వ్యవహరించవలసిన కేంద్రప్రభుత్వం సీమాం«ద్రులకు తీవ్రంగా నష్టంజరిగే విధంగా చర్యలు తీసుకోవటం ప్రజాస్వామికం కాదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశంలో ఈ కుటిల కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ ప్రజల నిర్ణయాన్ని పట్టించుకోకుండా ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సీమాంధ్ర ప్రజలను అణచివేయటానికే నిర్ణయించుకొన్నప్పుడు తాము ఆ ప్రభుత్వంలో ఒక రాష్ట్రంగా ఉండదలచుకోలేదన్నారు. రాష్ట్రవిభజనలో సాధారణంగా జరిగే ప్రక్రియలకు విరుద్ధంగా ఆఘమేఘాల మీద అన్ని నిబంధనలను బైపాస్‌చేస్తూ నిర్ణయం తీసుకోవటమే సీమాంధ్రప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చులకన భావం రుజువుచేస్తోందన్నారు. ఒక భారతీయుడిగా ప్రత్యేక దేశంగా ఏర్పడాలని కోరుకోవడం బాధగా ఉన్నా, సీమాంధ్రప్రజల్లో చాలామందిలో ఇప్పుడు ఇదే అభిప్రాయం ఏర్పడుతోందన్నారు. యువతలో మరో అభిప్రాయం కూడా ఉందన్నారు.
ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికా అధ్యక్షుడికి తమ సీమాంధ్ర ప్రజల పట్ల ఈ కేంద్రప్రభుత్వం చేస్తున్న అన్యాయంను ఆయన దృష్టికి తీసుకువెళ్ళి సీమాంధ్రకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, లేకపోతే మమ్ములను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలుపుకోవాలని ఆ దేశ అధ్యక్షుడిని యువత కోరనున్నట్లు నూతక్కి వేణు తెలిపారు. సుదీర్ఘసముద్ర తీరం ఉంది, విడిపోయి బాగా అభివృద్ధి చెందవచ్చునని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. పార్లమెంట్ వెంటనే అనుమతి ఇచ్చి ఈ నూతన దేశవిభజనను పూర్తిచేస్తే మా వల్ల ఇబ్బంది మీకు ఉండదు, మీ దరిద్రం మాకు ఉండదన్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/7522#sthash.nfNGdGYL.dpuf

No comments:

Post a Comment