Monday, 21 October 2013

శ్రీశైలం ప్రాజెక్టు సీమకు ఇస్తారా?

శ్రీశైలం ప్రాజెక్టు సీమకు ఇస్తారా? : ఎంపీ సాయిప్రతాప్

Published at: 21-10-2013 19:17 PM
 New  0  0 
 
 

న్యూఢిల్లీ, అక్టోబర్ 21 : రాజకీయ అంశాలతోనే విభజన ప్రక్రియ ఆగుతుందని, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తామంటున్నారు, రాయలసీమలో ప్రాజెక్టుల గురించి ఎవరూ ఆలోచించడంలేదని, శ్రీశైలం ప్రాజెక్టును సీమకు ఇస్తారా? అంటూ ఎంపీ సాయిప్రతాప్ వ్యాఖ్యానించారు. మళ్లీ తన పదవికి ఆయన సోమవారం స్పీకర్ పార్మాట్‌లో రాజీనామా చేసి, పత్రాన్ని లోకసభ సెక్రటరీ జనరల్‌కు అందించారు. అనంతరం సాయి ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలో చిన్న ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన జరిగితే శ్రీశైలం ప్రాజెక్టును పూర్తిగా రాయలసీమకు ఇస్తామని చెప్పగలరా అని సాయి ప్రతాప్ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగితే సీమ ప్రాంతం ఎడారిగా మారిపోతుందని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని, ఆ విషయమై ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ అభిప్రాయమన్నారు. సీమాంధ్రులు దోచుకున్నారని అంటున్న వారు రెండు నెలలుగా రోడ్ల పైకి వస్తున్న ప్రజలను చూడాలన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదన్నారు.
ప్రజల ఆందోళనల్లో భాగస్వామ్యం కావాలన్నదే తమ ఆలోచనని సాయిప్రతాప్ అన్నారు. తమ రాజీనామాలు ఆలోచిస్తే ఆనందిస్తామన్నారు. ప్రజలు లేకుంటే ప్రభుత్వాలు లేవని తెలుసుకోవాలన్నారు. విభజన ప్రక్రియ రాజకీయంగా వెనక్కి పోతుందన్నారు.
మళ్లీ రాజీనామాలు సమర్పించిన ఎంపీలు వీరే.... లగడపాటి రాజగోపాల్ (విజయవాడ), ఉండవల్లి అరుణ్ కుమార్ (రాజమండ్రి), సబ్బం హరి (అనకాపల్లి), సాయి ప్రతాప్ (రాజంపేట)
- See more at: http://www.andhrajyothy.com/node/12871#sthash.zMPUmEmn.dpuf

No comments:

Post a Comment