Friday 25 October 2013

గుండెకు వెన్న మంచిదే!

గుండెకు వెన్న మంచిదే!

Published at: 25-10-2013 05:05 AM
 5  5  0 
 
 

లండన్, అక్టోబర్ 24: "వెన్న, చీజ్, గుడ్లు, గడ్డపెరుగు తింటే హృద్రోగాలు వచ్చే ముప్పు ఎక్కువ'' ...సంప్రదాయ ఆంగ్ల వైద్య విధానం చెప్పే మాట ఇది! కానీ, అది ఒట్టి అపోహేనని హృద్రోగాలకూ వెన్న, చీజ్, గుడ్లు, పెరుగుకు ఎలాంటి సంబంధమూ లేదని.. నిజానికి అవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని లండన్‌లో భారత సంతతికి చెందిన కార్డియాలజిస్ట్ అసీమ్ మల్హోత్రా సంచలన ప్రకటన చేశారు. హృద్రోగాల ముప్పును తగ్గించుకోవడానికి శాచురేటెడ్ (సంతృప్త) కొవ్వులు అధికంగా ఉండే ఈ తరహా పదార్థాల వినియోగాన్ని తగ్గించుకోమని చెప్పడం తప్పంటూ ఆయన రాసిన వ్యాసాన్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఆధునిక వైద్య విధానం నమ్ముతున్నదానికి విరుద్ధంగా.. సంతృప్త కొవ్వుల వాడకాన్ని తగ్గించడమే హృద్రోగాల ముప్పును పెంచుతోందని మల్హోత్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజల్లో మందుల వాడకాన్ని.. ప్రత్యేకించి స్టాటిన్ల వాడకాన్ని పెంచుతోందని, అదే సమయంలో మరింత ప్రమాదకరమైన ఎథెరోజెనిక్ డైస్లిపిడెమియా (రక్తంలో కొవ్వుల నిష్పత్తి సరిగా లేకపోవడం) ముప్పు పెరిగిపోతోందని ఆయన వివరించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/14111#sthash.I4a3qYYe.dpuf

No comments:

Post a Comment