రాజకీయ పార్టీల విషయంలో ఉద్యోగ జేఏసీ విఫలం : అనంత
అనంతపురం, అక్టోబర్ 2 : సమైక్యాంధ్ర ఉద్యమంలో రాజకీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఉద్యోగ జేఏసీలు విఫలమయ్యాయని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన తర్వాత జరిగిన పరిణామాలపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో వ్యతిరేకించామన్నారు. అధినాయకత్వం ప్రక్రియ సాగుతోందని గంభీరంగా చెబుతున్నా.. ముందుకు పోలేని పరిస్థితి నెలకొందన్నారు.
విభజన జరిగితే రాయలసీమకు అందులోనూ అనంతపురం జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. నీటి ప్రాజెక్టులు అన్నిప్రాంతాలతో ముడిపడి ఉన్నాయని, రాజధాని హైదరాబాద్ పరిస్థితీ ఇలాగే ఉందన్నారు. కేంద్రం ప్రజా ఉద్యమానికి దిగిరాక తప్పదన్నారు. విభజనకు అనుకూలంగా లేఖనిచ్చినోళ్లు కూడా ఇపుడు వ్యతిరేకిస్తున్నారని పరోక్షంగా టీడీపీ, వైసీపీలపై ఆరోపించారు. రాజకీయాలు వదిలి అందరూ ఒకే వేదికపైకి వచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా చూడాల్సిన అవసరముందని సూచించారు.
No comments:
Post a Comment