Tuesday 22 October 2013

విభజనకు అందరూ ఓకే - జేడీ శీలం

విభజనకు అందరూ ఓకే

Published at: 23-10-2013 05:16 AM
 1  0  1 
 
 

యూటీయే పరిషష్కారం
హైదరాబద్‌తోనే సమస్య జటిలం
కేంద్రమంత్రులు, ఎంపీ మధ్య విభేదాల్లేవ్
ఎంత కాలం సమైక్యమంటాం?
శీతాకాల భేటిలో బిల్లు రాకపోవచ్చు:జేడీ శీలం
అడుగడుగునా అడ్డుకున్న సమైక్యవాదులు
హైదరాబాద్, అక్టోబర్ 22:'రాష్ట్ర విభజన అనివార్యమైతే సమస్యల్లా హైదరాబాదే. అలాంటి నగరం దేశంలో మరోటి లేదు. హైదరాబాద్ నిర్మాణం.. అభివృద్ధిలో అందరి శ్రమ ఉంది. రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ అంటే ఒక లైఫ్‌లైన్. అందుకే హైదరాబాద్‌ను యూటీ చేస్తే రాష్ట్ర విభజన సమస్య పరిష్కారమవుతుంది' అని కేంద్ర మంత్రి జేడీ శీలం పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళుతూ మంత్రి తొలుత విజయవాడలోని ఓ హోటల్ వద్ద, అనంతరం భీమవరంలో మీడియాతో మాట్లాడారు. విభజనకు రాష్ట్ర ప్రజలు విముఖంగా లేరని అయితే హైదరాబాద్‌తో పెనవేసుకుపోయిన బంధాన్ని వారు తేలికగ్గా తీసుకోలేకపోతున్నారని శీలం వివరించారు. ప్రస్తుత విభజన బిల్లు ప్రారంభం మాత్రమేనని, అంతం కాదన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు.
ఒక సమస్యను పరిష్కరించాలనుకుంటే అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులందరం విభజన వల్ల తలెత్తే ఇబ్బందులపై చర్చిస్తున్నామని, అధిష్ఠానానికి విన్నవించే ప్రయత్నం చేస్తున్నామని, అయితే తాము చేసే ప్రతి ప్రయత్నాన్ని మీడియాకు చెప్పడం వీలు పడదన్నారు. తమ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయనే నమ్మకం ఉందన్నారు. అయినా ఒక ప్రాంతం వారు రాష్ట్రాన్ని విభజించాలని కోరుతుంటే ఎంతకాలం సమైక్యంగా ఉంటామని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రమంత్రులు, ఎంపీల మధ్య బేధాభిప్రాయాలున్నాయన్న విషయాన్ని ఆయన తోసిపుచ్చారు.
నవంబర్ 7లోగా మరోసారి సమావేశమై, అధిష్ఠానానికి సీమాం«ద్రుల మనోభావాలను వివరించేందుకు సిద్ధమవుతున్నామన్నారు. విభజన బిల్లు శీతాకాలం సమావేశాలలో రాకపోవచ్చునన్నది తన అభిప్రాయమన్నారు. మీరు, పనకబాక లక్షి వంటి వారి ద్వారా విభజనకు ప్రజల్ని అంగీకరింపజేసేలా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తోంది కదా అన్న ప్రశ్నకు ఆయన ఆవేశం వ్యక్తం చేస్తూ.. ఇలా కుల ప్రస్తావన తీసుకురావద్దన్నారు. విభజన జరిగితే పోలవరం వల్ల ముంపునకు గురయ్యే సుమారు 1.50 లక్షల ఎకరాల ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపాలన్నారు.
అడుగడుగునా నిలదీతలు
కేంద్ర మంత్రికి విజయవాడ మొదలు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన ఆసాంతం సమైక్యవాదుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతూ వచ్చాయి. శీలం బస చేసిన హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించడానికి యాజమాన్యం అనుమతి ఇవ్వలేదు. పొలిటికల్ జేఏసీ నేత కొలనుకొండ శివాజి నాయకత్వంలో సమైక్యవాదులు కొందరు హోటల్‌కు ఫోన్‌చేసి దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆయన హోటల్ వెలుపల కార్ల పార్కింగ్ స్థలం వద్ద నిలబడి మీడియాతో మాట్లాడారు. హోటల్‌లో విలేకరుల సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం చెందిన మంత్రి శీలం ఆ తర్వాత ఆదాయపన్ను శాఖ అధికారులను పిలిపించడం చర్చనీయాంశమైంది. హోటల్ నిర్వాహకులను బెదిరించడానికే మంత్రి వారిని పిలిపించారన్న ప్రచారం జరిగింది. మంత్రి హోటల్ బయట మీడియా సమావేశం నిర్వహించి తన స్థాయిని దిగజార్చుకున్నారని సమైక్యాంధ్ర రాజకీయ ఐకాస కన్వీనర్ కొలనుకొండ శివాజీ విమర్శించారు. మరోవైపు పశ్చిమగోదావరి పర్యటనలోనూ కేంద్ర మంత్రికి సమైక్యవాదుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. పాలకొల్లు, భీమవరంలో సమైక్యవాదులు అరగంట సేపు మంత్రిని ఘెరావ్ చేశారు.
- See more at: http://www.andhrajyothy.com/node/13333#sthash.UhJb9tje.dpuf

No comments:

Post a Comment