2014 ఎన్నికల్లో టీడీపీకి హీరో పవన్ కల్యాణ్ మద్దతు ?
హైదరాబాద్, అక్టోబర్ 21 : రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పరిణామం, 2014 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి హీరో పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే టీడీపీ నేత, హీరో బాలకృష్ణ ఇంటికి వెళ్ళి పవన్ మంతనాలు జరిపినట్లు తెలియవచ్చింది. పవన్-బాలయ్య బేటీపై టీడీపీలో కలకలం చేలరేగింది. ఇద్దరి మధ్య ఆసక్తి కర చర్చలు జరిగినట్లు సమాచారం. పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. కాపు సామాజిక వర్గం నేతలు కూడా నాగబాబుతో చర్చలు జరిపినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కోస్తా జిల్లాల్లో ్ల కాపులు కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ అంటే పవన్‌కు మొదటి నుంచి వ్యతిరేకత అందుకే తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని, ప్రజారాజ్యం పార్టీనీ కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు కూడా పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా తటస్థంగా ఉండిపోయారు. గతంలో పీఆర్‌పీ ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ నాయకుల్ని పంచలూడదీసి కొట్టాలని పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ రాకతో టీడీపీలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఖమ్మం జిల్లాలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఓ ఫ్లెక్సీలో ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్యతోపాటు పవన్ ఫోటో కనిపించింది. గుంటూరు జిల్లాలోనూ ఇలాంటి ఫ్లెక్సీ వెలిసింది. దీంతో పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లోనూ, సినిమా వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
No comments:
Post a Comment